(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Election Results 2024: ఢిల్లీకి క్యూ కట్టిన NDA కీలక నేతలు, ప్రభుత్వ ఏర్పాటుపై పెరుగుతున్న ఉత్కంఠ
Lok Sabha Election Results 2024: NDA కీలక నేతలు వరుసగా ఢిల్లీకి క్యూ కట్టనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు.
Election Results 2024: ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూసిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. NDA కూటమి 294 స్థానాల్లో, I.N.D.I.A కూటమి 232 చోట్ల విజయం సాధించాయి. వార్ వన్ సైడ్ అవుతుందని అనుకున్నా...రెండు కూటములూ గట్టిగా పోటీ పడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 మార్క్ అటు కాంగ్రెస్‌కి కానీ ఇటు బీజేపీకీ కానీ రాలేదు. ఫలితంగా...ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ పెరుగుతూనే ఉంది. బీజేపీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 22 సీట్‌లు అవసరం. అటు ఇండీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 38 సీట్‌లు అసరముంది. అయితే...NDA మిత్రపక్షాలైన తెలుగు దేశం పార్టీ, JDU ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్ ఢిల్లీకి పయనమవుతున్నారు. వీలైనంత వరకూ బలాన్ని పెంచుకోవాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. మెజార్టీ సాధించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. ఇక నితీశ్ కుమార్ ఎప్పటికప్పుడు కూటములు మారుస్తారన్న పేరుంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందు ఆయన NDA కూటమిలోకి వెళ్లిపోయారు. అప్పటి వరకూ ఇండీ కూటమిలో కీలక నేతయగా ఉన్న ఆయన ఉన్నట్టుండి జంప్ అయ్యారు.
#WATCH | Patna, Bihar: Earlier visuals of Bihar CM an d JD(U) leader Nitish Kumar leaving from his residence, for the airport.
— ANI (@ANI) June 5, 2024
NDA meeting is scheduled to be held in Delhi, later today. pic.twitter.com/xyAcZJQuJo
నితీశ్‌తో పాటు తేజస్వీ యాదవ్ కూడా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ వేరువేరుగా సమావేశాలకు హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ మళ్లీ ఇండీ కూటమిలోకి వెళ్లిపోతారన్న వాదన మొదలైంది. కానీ జేడీయూ నేత కేసీ త్యాగి మాత్రం ఈ వాదనల్ని కొట్టి పారేస్తున్నారు. ఇండీ కూటమిలోకి వెళ్లే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. ఇక మరో కింగ్‌మేకర్‌గా భావిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో మాట్లాడారు. తెదేపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉంది బీజేపీ. అటు ఇండీ కూటమి నితీశ్ కుమార్‌ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. నితీశ్ కుమార్, తేజస్వీయాదవ్, చంద్రబాబుతో పాటు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఉద్దవ్ థాక్రే, శరద్ పవార్, డీఎమ్‌కే అధ్యక్షుడు ఎమ్‌కే స్టాలిన్ కూడా ఢిల్లీ బాట పట్టారు.
#WATCH | Patna, Bihar: When asked if they are trying to have an INDIA alliance Government at the Centre, RJD leader Tejashwi Yadav says, "We will keep trying. People should keep trying. Why shouldn't they?"
— ANI (@ANI) June 5, 2024
He also says, "Our performance has been very good...We based our… pic.twitter.com/hEMAh76owR
Also Read: BJP Failure in UP: యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూకుడుకి బ్రేక్‌లు, ఎక్కడ బెడిసి కొట్టింది?