NASA Captures iconic Pillars: నక్షత్రాల పుట్టినిల్లు ఎలా ఉందో చూశారా? కొత్తగా చూపించిన జేమ్స్‌వెబ్ టెలిస్కోప్
NASA Captures iconic Pillars: నక్షత్రాల పుట్టినిల్లైన సృష్టి మూల స్తంభాలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఫోటో తీసింది.
NASA Captures iconic Pillars:
మీకు పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ గుర్తుంది ఉందా. ఆకాశంలో పైకి దుముకుతున్న గుర్రాల్లా, ఏనుగు దంతాల్లా చాలా ఆశ్చర్యకరంగా కనిపించే కనిపించే డస్ట్ క్లౌడ్స్ గుర్తున్నాయా. ఎప్పుడో 1995 లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ తీసిన ఆ ఫోటోలు మన స్పేస్ సైన్స్ అడ్వాన్స్ మెంట్ లో ఎంతటి కీలకపాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ నే సరికొత్తగా తీసింది నాసా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.
అసలేంటీ పిల్లర్ ఆఫ్ క్రియేషన్:
పిల్లర్ ఆఫ్ క్రియేషన్ అంటే భూమికి దూరంగా 6500-7000 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో విస్తరించి ఉన్న ధూళి మేఘాలు. సెర్ పెన్స్ కాన్ స్టలేషన్ లో ఈగల్ నెబ్యూలాలో ఈ పిల్లర్ ఆఫ్ క్రియేషన్ ను 27 ఏళ్ల క్రితం తొలి సారిగా గుర్తించి ఫోటోలు తీసింది హబుల్ స్పేస్ టెలిస్కోప్. మళ్లీ ఇప్పుడు ఇన్నాళ్లకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దాన్నే తిరిగి ఫోటో తీయటం ద్వారా మరింత క్లారిటీగా కనిపిస్తూ సందడి చేస్తోంది. హబుల్ తీసిన ఈ పిల్లర్ ఆఫ్ క్రియేషన్ ఎంత ఫేమస్ అంటే ఇప్పుడు మన స్పేస్ టెలిస్కోపులు మొత్తం తీసిన ఫోటోల్లో టాప్ 10 ర్యాకింగ్ ఇస్తే దాంట్లో ఈ ఫోటో తప్పకుండా ఉంటుందని Space.com తెలిపింది.
పిల్లర్ ఆఫ్ క్రియేషన్ లో ఏముంటుంది:
పిల్లర్ ఆఫ్ క్రియేషన్స్ ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సృష్టికి మూలస్తంభాలు అనుకుందాం. అంటే ఈ సృష్టికి కారణం ఏంటీ అని మన శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనలకు ఇదుగో ఇలాంటి దట్టమైన ధూళి మేఘాలు ఓ కారణం అని భావిస్తున్నారు. వాస్తవానికి వీటిలో ఇంటర్ స్టెల్లార్ గ్యాస్ ఇంకా డస్ట్ ఉంటాయి. వీటిలోనే నక్షత్రాలు పుడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. సృష్టి ప్రారంభంలో అంటే బిగ్ బ్యాంగ్ లో సమయంలో ఏర్పడిన ఇలాంటి దట్టమైన ధూళి మేఘాలు కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు ఇలా వ్యాప్తి చెందుతూ ఉన్నాయని....ఇంటర్నల్ అండ్ ఓన్ గ్రావిటీ కారణంగా ఈ మేఘాల్లోనే నక్షత్రాలు పుడుతున్నాయని అంచనా వేస్తున్నారు. కానీ ఈ పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ లాంటివి పరిశోధించటానికి అంతకుముందు మన విజ్ఞానశాస్త్ర ప్రపంచానికి అవకాశం లభించలేదు. తొలిసారిగా 1995లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ వీటిని గుర్తించటం ఖగోళ శాస్త్రంలో కీలక ఆవిష్కరణ అని చెప్పాలి. విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు ఎలా ఏర్పడుతు న్నాయనే దానికి మూలం వీటి ద్వారా తేల్చారు శాస్త్రవేత్తలు.
జేమ్స్ వెబ్ తీసిన కొత్త ఫోటోల్లో ఏమున్నాయి :
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నియర్ ఇన్ ఫ్రా రెడ్ కెమెరా(నిర్ క్యామ్ ) తో ఫోటోలు తీస్తోంది. ఫలితంగా పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్స్ లో నక్షత్రాల పుట్టుకకు కారణమైన రెడ్ ఆర్బ్స్ ను మరింత స్పష్టంగా గుర్తించేందుకు వీలైంది. గతంలో హబుల్ వీటిని గుర్తించినా అంత స్పష్టంగా కనిపించ లేదు అప్పుడు. జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో మాత్రం రెబ్ ఆర్బ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పిల్లర్ ఆఫ్ క్రియేషన్స్ ను చుట్టూ ఉన్న కోట్లాది నక్షత్రాలను జేమ్స్ వెబ్ ఫోటో తీసింది. ఇప్పుడు తీసిన ఫోటోల ద్వారా ఈ పిల్లర్స్ లో ఒకదానికి మరొక దానికి ఎంత దూరం ఉండి ఉండొచ్చని అంచనా వేసేందుకు వీలవుతుంది. గెలాక్సీలు కనపడకపోవటం వల్ల ఈ పిల్లర్స్ పాలపుంతలు ఏర్పడటానికి కంటే ముందు రూపమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో మొత్తంగా ఈ ఒక్క ఫోటోతో అసలు నక్షత్రాలు ఎలా పుడుతున్నాయి. మళ్లీ అవన్నీ కలిసి గెలాక్సీలుగా ఎలా ఏర్పడుతున్నాయి. నక్షత్రాల చుట్టూ గ్రహాలను ఎలా తిప్పుకుంటున్నాయి. ఇలా ఈ యావత్ సృష్టిమీద అవగాహన మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ఫోటో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ విజయాల్లో అతి కీలకమైంది.
Also Read: Black Adam Review: బ్లాక్ ఆడమ్ రివ్యూ: బ్లాక్ ఆడమ్ సినిమా ఎలా ఉంది? డీసీ ఈసారైనా హిట్టు కొట్టిందా?