అన్వేషించండి

Aung San Suu Kyi: ఆంగ్‌సాన్ సూకీకి 26 ఏళ్ల జైలు శిక్ష, సంచలన తీర్పునిచ్చిన కోర్టు

Aung San Suu Kyi: ఆంగ్‌సాన్ సూకీకి జైలు శిక్షని 26 ఏళ్ల పాటు పొడిగిస్తూ అక్కడి కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

Aung San Suu Kyi:

ఎన్నో నేరాలు మోపుతూ..

మయన్మార్ హక్కుల కార్యకర్త, నోబెల్ పురస్కార గ్రహీత ఆంగ్‌ సాన్‌ సూకీకి జైలు శిక్షను 26 ఏళ్ల వరకూ పొడిగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆ దేశ న్యాయస్థానం. గతంలోనే మయన్మార్ సైనిక ప్రభుత్వం సూకిపై 11 అవినీతి కేసులు మోపింది. ఇప్పుడు ఇతర కారణాలు చెబుతూ...మొత్తంగా ఆమె 26 ఏళ్ల పాటు జైల్లోనే మగ్గిపోయేలా నిర్ణయం తీసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో సైనిక పాలనలోకి వెళ్లిపోయింది మయన్మార్. ఆ సమయంలోనే ఆంగ్‌ సాన్ సూకీని అరెస్ట్ చేశారు. డ్రగ్ ట్రాఫికింగ్ చేసే మౌంగ్ వీక్ నుంచి 550,000డాలర్ల లంచం తీసుకున్నారని ఆమెపై ఆరోపణలు మోపింది సైనిక ప్రభుత్వం. ఈ ఆరోపణలు ఆమె ఖండించినప్పటికీ...లాభం లేకుండా పోయింది. ఇప్పుడు మరికొన్ని అభియోగాలు చేస్తూ...అన్నింటికీ కలిపి 26 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాలని తేల్చి చెప్పింది. దీనిపై సూకీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఆమెపై కక్ష తీర్చుకునేందుకే ఈ తీర్పునిచ్చారని, 2023లో జరిగే ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా ఉండేందుకు  కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏప్రిల్‌లోనే శిక్ష 

ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సూకిపై 11 అవినీతి కేసులను సైనిక ప్రభుత్వం మోపింది. ఈ కేసు విచారణలో భాగంగా జుంటా కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. 6 లక్షల డాలర్ల నగదు, 11.4 కిలోల బంగారాన్ని సూకీ లంచం రూపంలో తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. దీంతో సూకీకి ఐదేళ్లపాటు జైలు శిక్షను విధిస్తున్నట్టు కోర్టు తీర్పునిచ్చింది. అయితే, సైనిక ప్రభుత్వం మోపిన 11 కేసుల్లో ఇది మొదటి కేసు మాత్రమే. మిగిలిన 10 కేసుల్లో కూడా ఆమెపై ఉన్న ఆరోపణలు నిరూపితమైతే మరింత శిక్షపడే అవకాశం ఉందని అప్పుడే అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైంది. 

విజయం సాధించినా..

2020 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) హౌస్‌ ఆఫ్‌ నేషనాలిటీస్‌లో 138 సీట్లు సాధించింది. ప్రతినిధుల సభలో 258 సీట్లు గెల్చుకుంది. సైన్యం మద్దతున్న యూనియన్‌ సాలిడారిటీ డెవలప్‌మెంట్‌ పార్టీ (యూఎస్‌డీపీ) దారుణంగా ఓడిపోయింది. రెండు సభల్లో వరుసగా కేవలం 7, 26 సీట్లు మాత్రమే సంపాదించుకోగలిగింది. అప్పట్నుంచి రాజ్యాంగ సవరణలపై సూకీ బృందం ఆలోచించటం మొదలెట్టింది. ఈ చర్యలను సైన్యం వ్యతిరేకిస్తూ వచ్చింది. కొత్త పార్లమెంటు సమావేశమై నిర్ణయాలు తీసుకోకుండా తిరుగుబాటు ద్వారా సూకీకి, రాజ్యాంగ సవరణలకు సైన్యం కళ్లెం వేసింది. అనంతరం దేశాన్ని హస్తగతం చేసుకొని సూకీని జైల్లో పెట్టింది. ప్రజానేత ఆంగ్‌ సాన్‌ సూకీ 1989 నుంచి 2010 మధ్య 15 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆమె మయన్మార్‌లో సైనిక పాలన నిర్మూలన కోసం పోరాటం చేశారు. ఆంగ్ సాన్ సూకీకి 1991లో నోబెల్‌ శాంతి బహుమతి లభించింది.

Also Read: Kerala CM Writes To Modi: హిందీని బలవంతంగా రుద్దుతారా? సమైక్యతకు మచ్చ తీసుకురాకండి - కేరళ సీఎం,

Also Read: Bharat Jodo Yatra: రోడ్డుపై రాహుల్ గాంధీ పుష్‌ అప్ ఛాలెంజ్- ఉత్సాహంగా జోడో యాత్ర!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adani Deal Jagan:  అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
అమెరికా కేసుతో రాజకీయంగా జగన్‌కు మరిన్ని సమస్యలు - విచారణకు సిద్దమని ఎందుకు ప్రకటించలేకపోయారు ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Maharashtra CM: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్‌- 50 ఏళ్లు దాటిన వారికి కేబినెట్‌లో నో ఛాన్స్!
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Embed widget