హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్న ముస్లిం దంపతులు, హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లి
Muslim Couple: ఓ హిందూ అమ్మాయిని దత్తత తీసుకున్న ముస్లిం దంపతులు హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెకు వివాహం జరిపించారు.
Muslim Couple adopted Hindu Girl:
ఎన్‌సీపీ నేత ట్వీట్
The Kerala Storyపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రశాంతంగా ఉన్న సొసైటీలో అలజడి రేపడం ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇదంతా అవాస్తవం అని ముస్లిం సంఘాలు మండి పడుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు మత సామరస్యానికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తున్నారు. విద్వేషాలు ప్రచారం చేయడమెందుకు అంటు ప్రశ్నిస్తున్నారు. అవి వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య ఏ ఆర్ రెహమాన్ ఓ వీడియో షేర్ చేశారు. ఇప్పుడు NCP లీడర్ జితేంద్ర అవ్హాద్ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ ఫోటో వెనకాల కథేంటో కూడా రాశారు. ప్రస్తుతం ఈ ఫోటో కూడా వైరల్ అవుతోంది. ముస్లిం జంట పదేళ్ల హిందూ అమ్మాయిని దత్తత తీసుకుని బాగోగులు చూసుకుంది. ఏ లోటు రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఆమెకు చదువు చెప్పించడమే కాదు. పెళ్లి కూడా ఘనంగా చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి వయసు 22 ఏళ్లు. అయితే...ఆ అమ్మాయిని దత్తత తీసుకున్నాక పేరు మార్చారు. ఖాతిజా అని పేరు పెట్టారు. ఇప్పుడు అబ్దుల్లా అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. పూర్తిగా హిందూ సంప్రదాయ ప్రకారమే వివాహం ఘనంగా చేశారు. ఆ అమ్మాయి కోరుకున్న విధంగానే అన్ని సంప్రదాయాలు పాటించారు. ఇదే విషయాన్ని ట్విటర్‌లో వివరించారు జితేంద్ర. ఎప్పుడూ నెగటివ్ వార్తలే ఎందుకు..? ఇలాంటి పాజిటివ్ సంగతుల గురించి కూడా మాట్లాడుకుందాం అంటూ ట్వీట్ చేశారు. హిందూ సంప్రదాయ ప్రకారం పెళ్లాడిన ఆ యువతి బుర్ఖాలో ఉన్న తన తల్లి కాళ్లకు దండం పెడుతున్న ఫోటో వైరల్ అవుతోంది.
केरळमधील कासरगोड येथील अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी 10 वर्षांच्या हिंदू मुलीला दत्तक घेतले जिने तिचे पालक गमावले होते, ती आता 22 वर्षांची आहे.
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) May 6, 2023
अब्दुल्ला आणि त्याची पत्नी खदिजा यांनी तिचे लग्न एका हिंदू मुलाशी पूर्ण हिंदू विधींनी लावून दिले.
यावर चित्रपट काढण्याची… pic.twitter.com/ZvvjvMYXdO
సినిమాకి నో ట్యాక్స్..
The Kerala Story సినిమాపై దేశవ్యాప్తంగా ఎంత రచ్చ జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. కేరళలో పలు చోట్ల ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నాయి ముస్లిం సంఘాలు. అటు తమిళనాడులోనూ దీనిపై పెద్ద గొడవే జరుగుతోంది. ఈ సినిమాని బ్యాన్ చేయాలని ముస్లిం సంఘాలు కోర్టు వరకూ వెళ్లినా నిరాశే ఎదురైంది. "మేం జోక్యం చేసుకోం" అని కోర్టు తేల్చి చెప్పింది. పొలిటికల్‌గానూ అలజడి రేపింది ఈ సినిమా. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ కావాలనే ఇలాంటి సినిమాలకు సపోర్ట్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా ట్యాక్స్‌ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. స్వయంగా ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఓ వీడియో విడుదల చేసి ఈ విషయం వెల్లడించారు. బీజేపీ సహా మరి కొన్ని హిందూ సంస్థలు కేరళ స్టోరీ సినిమాపై పన్ను వసూలు చేయొద్దని డిమాండ్ చేశాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న చౌహాన్...వెంటనే ఈ ప్రకటన చేశారు.
Also Read: ABP Cvoter Karnataka Opinion Poll: కర్ణాటకలో కింగ్ కాంగ్రెస్ - ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికర విషయాలు