Mumbai Fire: ముంబయిలో ఘోర అగ్నిప్రమాదం, ఒకరు మృతి - 22 మందికి తీవ్ర గాయాలు
Mumbai Fire Accident: ముంబయిలోని ఘట్కోపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది.
Mumbai Fire Accident:
ఘట్కోపూర్‌లో..
ముంబయిలోని ఘట్కోపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పరేఖ్ ఆసుపత్రి సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. 8 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది గాయపడగా...వారిని పరేఖ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జునోస్ పిజ్జా రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు తీవ్ర గాయాల పాలుకాగా...వారిని రాజావాది హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతుండగానే మృతి చెందారు. ఆరు అంతస్తుల బిల్డింగ్‌లోని విద్యుత్ మీటర్ రూమ్‌లో అగ్నిప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అంతకు ముందు సెంట్రల్ ముంబయిలోనూ 61అంతస్తుల బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 22వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంటలు వ్యాప్తి చెందగా...10 మంది సిబ్బంది వచ్చి మంటలార్పారు. గతేడాది కూడా ఇదే అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. 19వ అంతస్తులో ప్రమాదం జరగ్గా...ఓ సెక్యూరిటీ గార్డ్ మృతి చెందాడు.
#WATCH | Maharashtra: Fire breaks out near Parekh Hospital in Mumbai's Ghatkopar. Eight fire tenders have reached the spot. Further details awaited: Mumbai Fire Brigade pic.twitter.com/iiKUAIGEAh
— ANI (@ANI) December 17, 2022
Mumbai | 22 patients admitted to Parakh Hospital being shifted to another hospital after they complained of difficulty in breathing due to a fire incident in Juno's Pizza restaurant located in the nearby Vishwas building: Mumbai Fire Service
— ANI (@ANI) December 17, 2022
కాసేపటికే పుణేలో..
ఇది జరిగిన కాసేపటికే...పుణేలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. భీమా కొరేగావ్ ప్రాంతంలోని ఎయిర్ ఫిల్టర్ తయారు చేసే ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇందుకు కారణాలేంటన్నది ఇంతా తెలియలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
#WATCH | Fire breaks out in an Air filter company near Bhima Koregaon area of Shirur town in Pune. Six fire tenders have reached the spot. Two workers were injured: Pune Fire Department pic.twitter.com/Lfkum8hqNq
— ANI (@ANI) December 17, 2022
Also Read: India China Clash: రాహుల్ కాంగ్రెస్‌కు మాత్రమే కాదు, దేశానికీ సమస్యే - కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు