Mumbai Bus Accident: ఈ పెద్దాయనది మామూలు అదృష్టం కాదు, బస్ కింద పడినా తప్పించుకున్నాడు - వైరల్ వీడియో
Mumbai Bus Accident: ముంబయిలో ఓ పెద్దాయన బస్ కింద పడినా అదృష్టవశాత్తూ బతికి బయట పడ్డాడు.
Mumbai Bus Accident:
ముంబయిలో ఘటన..
భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా సులువుగా తప్పించుకుంటారు. ముంబయిలో ఓ పెద్దాయన అలానే తృటిలో మృత్యువు నుంచి బయట పడ్డాడు. కాస్త అటు ఇటు అయినా...ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ముంబయిలోని పొవైలో ఓ పెద్దాయన రోడ్డు దాటుతుండగా బస్ వచ్చి ఢీకొట్టింది. ఆ బస్ కిందే పడిపోయాడు. డ్రైవర్ చూస్కోకుండానే అలానే ముందుకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో బస్ వేగం తక్కువగానే ఉన్నా...ఆ పెద్దాయన మాత్రం కింద పడిపోయాడు. బస్ పూర్తిగా ముందుకెళ్లాక "డౌటే లేదు కచ్చితంగా చనిపోయే ఉంటాడు" అని అంతా అనుకున్నారు. కానీ...ఆయన అదృష్టం బాగుండి బతికిపోయాడు. అంతే కాదు. వెంటనే లేచి డ్రైవర్‌ను నిలదీశాడు కూడా. ఇది చూసిన వాళ్లు"ఔరా" అని ఆశ్చర్యపోయారు. సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2.40 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు సీసీటీవీ విజువల్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎవరెస్ట్ హైట్స్ బిల్డింగ్స్ వెలుపల లేక్‌సైడ్ కాంప్లెక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 45 సెకన్ల ఈ వీడియోలో కొంత మంది పాదచారులు రోడ్డు దాటుతుండటాన్ని గమనించవచ్చు. ఆ తరవాత ఓ పెద్దాయన వచ్చాడు. బస్ వస్తుండటాన్ని ఆయన చూసుకోలేదు. ఆ డ్రైవర్ కూడా ఏమరపాటుగానే ఉన్నాడు. ట్రాఫిక్ బాగా ఉండటం వల్ల చాలా నెమ్మదిగా ముందుకు వస్తోంది బస్. ఆ పెద్దాయన రోడ్డు దాటే క్రమంలోనే బస్‌ను ఢీ కొట్టుకుని ఆ బస్ కిందే పడిపోయాడు. అదృష్టవశాత్తూ చక్రాల కింద పడలేదు కాబట్టు ఎస్కేప్ అయిపోయాడు. ఏ కాస్త అటు ఇటు అయినా...చక్రాల కింద పడి నుజ్జునుజ్జు అయిపోయే వాడు.
#WATCH | Elderly man's close shave in Powai area of Mumbai. The incident was captured on a CCTV camera.
— ANI (@ANI) December 15, 2022
(Source: viral video) pic.twitter.com/50LV4N2Pvk
మరో వైరల్ వీడియో
ఒక కోతి జింకకు తినేందుకు ఆకులు అందిస్తూ సాయం చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రతీ ఒక్కరూ తమ స్నేహితులు, బంధువులకూ షేర్ చేస్తున్నారు. వందలాది మంది కామెంట్లు చేస్తున్నారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద కోతి, జింక స్నేహాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఆ వీడియోలో ఒక కోతి.. జింకకు అందని చెట్టు ఆకులను తినేందుకు తెంపి ఇస్తోంది. అద్భుతమైన ఈ వీడియోలో రెండు జింకలు చెట్టు కింద నిలబడి, ఆకులను తినడానికి ప్రయత్నిస్తుంటాయి. కొమ్మ ఎత్తులో ఉండడంతో జింకలు తినలేకపోతున్నాయి. విషయం గుర్తించిన ఓ కోతి.. కొమ్మపై కూర్చొని దాన్ని కిందకు వంగేలా చేస్తుంది. దీంతో కింద ఉన్న రెండు జింకలకు కొమ్మలు అందడంతో.. ఆకులు తింటాయి.
Friendship of Monkey & deer in Forest is well documented. Here is one outside it. Helping the dear deer to feed. pic.twitter.com/cvnGDD6ZSw
— Susanta Nanda IFS (@susantananda3) December 12, 2022
Also Read: Ashwini Vaishnav: రైళ్లలో వృద్ధులకు రాయితీ ఇవ్వలేం- తేల్చి చెప్పిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి