News
News
వీడియోలు ఆటలు
X

Modi The Immortal :చైనాలో మోదీకి భారీ ఆద‌ర‌ణ‌- దివ్య పురుషుడు అంటున్న నెటిజ‌న్లు

భారత్, చైనా స‌రిహ‌ద్దుల్లో ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం ఉన్నా.. మ‌న ప్ర‌ధాని మాత్రం ఆ దేశ ప్ర‌జ‌ల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఆ దేశ ప్ర‌జ‌లు ‘మోదీ లావోగ్జియన్‌’ అని ప్రేమగా పిలుచుకుంటున్నారు.

FOLLOW US: 
Share:

Modi The Immortal : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న‌ ఆదరణ, గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. అనేక‌మంది దేశాధినేత‌లు నిత్యం ఆయ‌న్ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ ఉంటారు. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీకి ఎన్నో దేశాల్లో అభిమానులున్నారు. తాజాగా చైనాలో భార‌త ప్ర‌ధానికి భారీ క్రేజ్ ఉంద‌ని.. ఆ దేశ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను అసాధార‌ణ వ్య‌క్తిగా భావిస్తున్నార‌నే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌ముఖ అమెరిక‌న్ మ్యాగ‌జీన్ ‘ద డిప్లొమాట్‌’ ఈ ఇందుకు సంబంధించిన క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

‘ద డిప్లొమాట్‌’లో ‘చైనాలో భారత్‌ను ఎలా చూస్తున్నారు?’ అనే శీర్షికన జర్నలిస్టు ము షుంషాన్‌ రాసిన వ్యాసంలో ఈ వివరాల‌ను వెల్లడించారు. చైనీస్‌ సోషల్‌ మీడియాను షుంషాన్‌ విశ్లేషిస్తుంటారు. ముఖ్యంగా చైనాలో విశేష ఆద‌ర‌ణ ఉన్న సినా వీబో యాప్‌ను ఆయ‌న‌ విశ్లేషణ చేస్తుంటారు. ఈ యాప్‌కు 58 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నింటితో మోదీ చక్కటి సంబంధాలు కొన‌సాగిస్తున్నారని చైనీయులు భావిస్తున్నట్లు త‌న క‌థ‌నంలో షుంషాన్‌ తెలిపారు. అంతేకాకుండా మోదీ చాలా భిన్నమైన వ్యక్తి అని చైనా నెటిజన్లు నమ్ముతున్నాని.. ఆయనకు అసాధారణ సామర్థ్యాలు ఉన్నాయని భావిస్తున్నార‌ని పేర్కొన్నారు. త‌మ సామాజిక మాధ్యమాల్లో చైనీయులు మ‌న ప్ర‌ధాన‌మంత్రికి ‘మోదీ లావోగ్జియన్‌’ అని ముద్దు పేరు పెట్టుకున్నార‌ని షుంషాన్ త‌న క‌థ‌నంలో పేర్కొన్నారు. లావోగ్జియన్‌ అంటే అసాధారణ సామర్థ్యమున్న వృద్ధుడైన దివ్య పురుషుడు అని అర్థం.

 20 ఏళ్ల నుంచీ అంతర్జాతీయ మీడియా వార్తలను తాను అందిస్తున్నానని పేర్కొన్న షుంషాన్.. చైనీయులు ఒక విదేశీ నేతకు ముద్దు పేరు పెట్టడం ఎప్పుడూ చూడ‌లేద‌ని స్ప‌ష్టంచేశారు. చైనా ప్రజల దృష్టిలో న‌రేంద్ర‌మోదీకి ప్రత్యేక స్థానముందని తెలిపారు. ఇక ఈ క‌థ‌నంలో ఆయ‌న‌ మోదీని ఆకాశానికెత్తేశారు. ఆయన మిగిలిన నేతలకంటే విభిన్నంగా ఉంటార‌ని.. ఆయన వస్త్రధారణ, రూపం అసాధారణంగా ఉంటాయని, ఆయన విధానాలూ గత నేతలకన్నా భిన్నంగా ఉంటాయని తెలిపారు. అమెరికా, రష్యా, దక్షిణ దేశాలతో న‌రేంద్ర మోదీ స్నేహ పూర్వ‌కంగా మెలగుతార‌ని చైనా దేశ‌స్థులు భావిస్తార‌ని షుంషాన్‌ వివరించారు. కాగా.. చైనాలో ట్విటర్‌కు పోటీగా వచ్చిన ‘సైనా వీబో’లో న‌రేంద్ర మోదీ 2015లో చేరారు. ఆయనకు 2.44 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చైనా యాప్‌లపై నిషేధంలో భాగంగా 2020 జులై తర్వాత ఆయన తన ఖాతాను తొల‌గించారు. 

కాగా.. అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అగ్రనేతగా ఎదిగిన మోదీని ఎన్నో దేశాల మీడియా సంస్థ‌లు ప్ర‌శంసించాయి. భారత్‌పై విషం చిమ్మే పాకిస్థాన్ మీడియా కూడా గ‌తంలో మన ప్రధానిని కొనియాడుతూ ఆకాశానికెత్తేసింది. ప్రపంచాన్ని ప్ర‌భావితం చేసే స్థితికి భారత్​ను మోదీ తీసుకెళ్లార‌ని ఆ దేశానికి చెందిన ప్రముఖ వార్తాసంస్థ 'ది ఎక్స్​ప్రెస్​ ట్రిబ్యూన్‌'  ప్ర‌శంసించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో.. భారతదేశం అంతర్జాతీయ స‌మాజాన్ని ప్ర‌భావితం చేసే శ‌క్తిగా ఎలా రూపొందుతోంద‌న్న అంశాన్ని విశ్లేషించింది. మోదీ నాయ‌కత్వంలో.. ఇండియా ఎంతో నైపుణ్యంగా వ్యవహరించి తన జీడీపీని 3 ట్రిలియన్​ డాలర్లకు పెంచుకుందని అని పేర్కొంది. అభివృద్ధి పథంవైపు దూసుకెళుతోందని స్పష్టం చేసింది. తాజాగా దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణపూరిత వాతావ‌ర‌ణం నెల‌కొన్నా చైనా ప్ర‌జ‌లు మాత్రం మోదీని ఆరాధిస్తుండ‌టం ఆయ‌న‌కు విదేశాల్లో ఉన్న క్రేజ్‌ను ప్ర‌తిబింబిస్తోంది.

Published at : 20 Mar 2023 10:00 AM (IST) Tags: PM Modi Modi The Immortal chinese netizens modi laoxian

సంబంధిత కథనాలు

SCTIMST:  తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

SCTIMST: తిరువనంతపురం ఎస్‌సీటీఐఎంఎస్‌టీలో 30 జనరల్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, కొనసాగుతున్న సహాయక చర్యలు- ఎమర్జెన్సీ నెంబర్స్ ఇవే

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, కొనసాగుతున్న సహాయక చర్యలు- ఎమర్జెన్సీ నెంబర్స్ ఇవే

ABP Desam Top 10, 2 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 2 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

AFCAT Notification 2023: ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నతహోదా ఉద్యోగాలకు 'ఏఎఫ్‌క్యాట్' - నోటిఫికేషన్ వెల్లడి!

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?