(Source: ECI/ABP News/ABP Majha)
Happiest State: ఇక్కడి ప్రజలకు సంతోషం ఎక్కువట,పదహారేళ్లకే సంపాదించేస్తారు కూడాా
Happiest State: దేశంలోని అత్యంత సంతోషకరమైన రాష్ట్రంగా మిజోరం రికార్డు సృష్టించింది.
Happiest State:
సంతోషకర రాష్ట్రం..
దేశంలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం (Happiest State) మిజోరం (Mizoram) రికార్డు సృష్టించింది. గుడ్‌గావ్‌లోని Management Development Institute నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సంతోషంలోనే కాదు. అక్షరాస్యతలోనూ నంబర్ వన్‌గా నిలిచింది. అంతకు ముందు కేరళ రాష్ట్రం అత్యధిక లిటరసీ రేట్ ఉన్న రాష్ట్రంగా ఉండగా...ఇప్పుడు మిజోరం కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో రికార్డు సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ విద్యార్థులకు అర్హతల ఆధారంగా ఉపాధి అవకాశాలు చూపించడంలో ముందంజలో ఉంది మిజోరం. మొత్తం ఆరు ప్రమాణాల ఆధారంగా మిజోరంను "హ్యాపియెస్ట్ స్టేట్"గా ప్రకటించారు. ఫ్యామిలీ రిలేషన్స్, వర్క్ రిలేటెడ్ అంశాలు, సామాజిక స్పృహ, దాతృత్వం, మతం, సంతోషకర జీవితంపై కరోనా ప్రభావం ఎంత..? ఫిజికల్, మెంటల్ హెల్త్...ఇలా అన్ని కోణాల్లోనూ సర్వే నిర్వహించారు. ఈ రిపోర్ట్‌పై కొందరు విద్యార్థులు స్పందించారు. తమకు ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఎదుర్కొని నిలబడినట్టు చెప్పారు.
"ప్రభుత్వ మిజో హైస్కూల్‌కి చెందిన ఓ విద్యార్థి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కానీ ఆ విద్యార్థి కుంగిపోలేదు. చాలా పాజిటివ్‌గా లైఫ్‌ని లీడ్ చేశాడు. బాగా చదువుకున్నాడు. త్వరలోనే CA అవుతానని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. సివిల్స్ ఎగ్జామ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నాడు. మరో పదో తరగతి విద్యార్థి కూడా ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొన్నాడు. తండ్రి ఓ మిల్క్ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ఎంత కష్టమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరుతాని చెబుతున్నాడు"
- రిపోర్ట్
యాక్టివ్‌గా యూత్
టీచర్లు మంచి స్నేహితులుగా ఉంటారని, ప్రతిదీ వాళ్లతో చర్చించే చనువు ఉంటుందని చెబుతున్నారు ఇక్కడి విద్యార్థులు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే టీచర్లు ఆ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతోనూ చర్చిస్తారు. ఆ సమస్యను పరిష్కరిస్తారు. ఎక్కడా వాళ్ల చదువులు ఆగిపోకుండా జాగ్రత్త పడతారు. అందుకే ఇక్కడి యువత చదువులో చాలా యాక్టివ్‌గా ఉంటారని చెబుతున్నారు అక్కడి విద్యా నిపుణులు. చదువుతో పాటు వారికి ఉద్యోగావకాశాలు కూడా బాగుంటున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే...మిజోరంలోని పిల్లల సంపాదించే వయసు కన్నా ముందుగానే డబ్బు సంపాదించగలుగుతున్నారు. ఎంప్లాయ్‌మెంట్ అక్కడ అంత బాగుందట. 16,17 ఏళ్లకే ఏదో ఓ ఉద్యోగంలో చేరిపోతున్నారు. ముఖ్యంగా ఇక్కడి వాళ్లందరికీ ఆర్థిక స్వేచ్ఛ (Financial Freedom) ఉన్నట్టు రిపోర్ట్ స్పష్టం చేసింది. వాళ్ల ఆనందానికి ఇది కూడా ఓ కారణమే అని వివరిస్తోంది. చిన్నతనంలోనే ఇండిపెండెంట్‌గా బతకడం అలవాటవుతోందని చెబుతోంది. ఇక భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్దలుంటే వెంటనే విడిపోతున్నారు. ఎవరి దారిలో వాళ్లు ప్రశాంతంగా బతుకుతున్నారు. పగ, ప్రతీకారాలు అంటూ ఏమీ ఉండవు. "ఇద్దరికీ సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు కలిసి ఉండడంలో అర్థం లేదుగా" అని సమాధానమిస్తోంది అక్కడి యువత. ఇక ఉపాధి విషయంలోనూ యువత సంతృప్తిగా ఉంటోంది.
Also Read: Heat Waves: వేడిగాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరి, ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్