అన్వేషించండి

MLA Seethakka Profile: నక్సలైట్‌ నుంచి మంత్రిస్థాయి వరకు-అంచెలంచెలుగా సీతక్క రాజకీయ ప్రస్థానం

Minister Seetakka News: తెలంగాణ మంత్రివర్గంలో ఎమ్మెల్యే సీతక్కకు కూడా చోటు దక్కింది. నక్సలైట్‌ నుంచి ప్రజాప్రతినిధిగా.. ఎమ్మెల్యేగా.. మంత్రిగా ఎదిగిన సీతక్క రాజకీయ ప్రస్థానం ఒకసారి చూద్దాం.

MLA Seethakka Political Profile: ధనసరి అనసూయ అలియాస్ సీతక్క. ఆదివాసీ కోయ జాతికి చెందిన ఈమె తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ఆమె జీవితం  ఎందరికో ఆదర్శప్రాయం. తెలంగాణ రాజ‌కీయాల్లో సీత‌క్క‌ది ప్ర‌త్యేక స్థానం. విద్యార్థి దశ నుంచే పోరాటం మొదలు పెట్టారు. ఆ తర్వాత దళంలో చేరి అన్నలతో కలిసి ప్రభుత్వం  మీద పోరాటం చేశారు. అక్కడ మారిన సిద్ధాంతాలు పొసగక బయటికి వచ్చారు. సాయుధ పోరాటాల కంటే ప్రజల్లో ఉండి పోరాడటమే మేలనుకుని జనజీవన స్రవంతిలో  కలిసిపోయారు. తుపాకీ తూట కంటే అంబేడ్కర్ బాటలో పయనిస్తే ప్రజల బతుకుల్లో మార్పు తీసుకురావచ్చని భావించారు. గిరిజన మహిళలకు ఉపాధినిచ్చే ప్రభుత్వ  సంస్థలో చేరి ఉద్యోగం చేసుకుంటూ సామజిక సేవ వైపు పయనం సాగించారు సీతక్క. ఆపై రాజకీయాల్లో ఎంట్రో ఇచ్చారు. పాలిటిక్స్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.  ఎమ్మెల్యేగా గెలిచి.. సొంత నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వచ్చారు. ప్రజల పక్షాన పోరాడారు. ఇటు రాజకీయాల్లో, అటు ప్రజల్లో మంచి గుర్తింపు  తెచ్చుకున్నారు. ఇలా నక్సలైట్ జీవితం నుంచి.. ఇప్పుడు మంత్రిగా ఎదిగారు సీతక్క. 

1971, జూలై 9న.. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెంకి చెందిన సమ్మక్క-సమ్మయ్య దంపతులకు జన్మించారు సీతక్క. ప్రభుత్వ గిరిజన వసతి గృహంలో  చదువుకుంటున్న సమయంలోనే పోరాటంలోకి వెళ్లారు సీతక్క. గిరిజన వసతి గృహంలో సరిగా భోజనం పెట్టడం లేదని, బాలికలకు ప్రభుత్వం ఇస్తున్న పది రూపాయలను  వసతి గృహ అధికారులు ఇవ్వడం లేదని తోటి విద్యార్థులను కూడగట్టుకుని ధర్నా చేశారామె. అప్పుడు ఆమె వయస్సు 13ఏళ్లు. ఆమె పోరాటపటిమను గుర్తించిన పీపుల్స్  వార్ దళం సభ్యుల పిలుపుతో...14ఏళ్ల వయస్సులోనే అడవిబాట పట్టారు. 1988లో 10వ తరగతి చదువుతుండగానే నక్సల్స్‌ పార్టీలో చేరారు. మావోయిస్టుల్లో చేరినా చదువు  వదల్లేదు సతీక్క. పోలీసుల అరెస్ట్‌ చేసినా... జైల్లో ఉంటూనే పదో తరగతిలో ఫెయిల్ అయిన సబ్జెక్టులకు పరీక్షల రాసి పాస్ అయ్యారు. ఆ తర్వాత... ప్రేమించిన తన బావనే  పెళ్లాడారారు సీతక్క. రెండు నెలల కుమారుడిని వేరేవాళ్ల చేతుల్లో పెట్టి మళ్లీ అడవిబాట పట్టారు. జన నాట్య మండలి ద్వారా ఆదివాసీల సమస్యలపై పోరాటం చేశారు. 20ఏళ్ల  పాటు నక్సలైట్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు సీతక్క. ఆ తర్వాత సీతక్క దంపతుల మధ్య విబేధాలు రావడం.. దళంలో మారిన సిద్ధాంతాలు నచ్చక 1996లో బయటికి  వచ్చేశారు సీతక్క. ఆ తరువాత ఐటిడీఏ (ITDA)లో నెల జీతానికి పనిచేస్తూ చదువు కొనసాగించారు.

ఎన్టీఆర్‌ పిలుపుతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన సీతక్క.. 2001లో లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. 2004లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో  తొలిసారిగా ములుగు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్లీ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్‌ చేరారు. 2018  ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి ములుగు నుంచి గెలుపొందారు సీతక్క. కరోనా సమయంలో అందరూ ఇళ్ళకే పరిమితమైతే.. ప్రభుత్వ సహాయం లేకున్నా తన  నియోజకవర్గంలోని గ్రామాలన్నీ తిరుగుతూ ఎంతో మందికి ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేశారు. ప్రజా నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉస్మానియా  యూనివర్సిటీ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలోని గోత్తి కోయ గిరిజనుల జీవన స్థితిగతులపై పరిశోధనలు చేసి డాక్టరేట్ కూడా పొందారు సీతక్క. 

రాజకీయాల్లో చేరడానికి ముందు 15ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు సీతక్క.. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు.  రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు. నక్సలైట్ జీవితం నుంచి లాయర్‌గా.. ఆపై ఎమ్మెల్యేగా... ఆ తర్వాత ప్రజాదరణ పొందిన నాయకురాలిగా గుర్తింపుతెచ్చుకున్న  సీతక్క ఇప్పుడు.. కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగిరారు. ముళ్ల బాటలను దాటుకుండా.. ప్రజాసేవకు సరైన మార్గం ఎన్నుకుంటూ... ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Telangana MLC Election Results 2025: కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
కమలం అంటే ఫ్లవర్ అనుకుంటివా, వైల్డ్‌ ఫైర్‌! రేవంత్ రెడ్డికి టీచర్స్, పట్టభద్రుల పవర్‌ఫుల్ మెసేజ్‌!
YS Vivka Case: వివేకా హత్య కేసులో కీలక పరిణామం -  భద్రత కల్పించిన సాక్షి మృతి !
వివేకా హత్య కేసులో కీలక పరిణామం - భద్రత కల్పించిన సాక్షి మృతి !
MLC BJP Won: పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
పట్టభద్రుల ఎమ్మెల్సీని గెల్చుకున్న బీజేపీ - హోరాహోరీ పోరులో ఓడిపోయిన కాంగ్రెస్
Congress Mallanna: కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టిన మల్లన్న - వివరణ ఇవ్వాలని మధుయాష్కీ డిమాండ్
Nara Lokesh: అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే జగన్ రెడ్డి - నారా లోకేష్ తీవ్ర విమర్శలు
Singer Kalpana Daughter: మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
మా అమ్మ సూసైడ్ అటెంప్ట్ చేయలేదు... సింగర్ కల్పన కేసులో క్లారిటీ ఇచ్చిన కుమార్తె
Embed widget