Mary Kom: జూనియర్ బాక్సర్‌తో ఎఫైర్- మేరీకోమ్‌పై మాజీ భర్త సంచలన ఆరోపణలు - అసలు వివాదం ఎక్కడంటే?
Boxer Mary Kom: బాక్సర్ మేరీకోమ్, ఆమె మాజీ భర్త మధ్య పరస్పర ఆరోపణల పర్వం చోటు చేసుకుంటోంది. మేరీకోమ్ ఇతరులతో వివాహేతర బంధాలు పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తోందని మాజీ భర్త అంటున్నారు.

Mary Kom had affair with a junior boxer: మేరీకోమ్.. ఈ పేరు గురించి తెలియని క్రీడాభిమాని ఉండరు. పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాక్సింగ్ లో సంచలన విజయాలు నమోదు చేసిన ఆమె వైవాహిక బంధంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భర్తతో విడిపోయిన ఆమె ఇటీవల మేరీకోమ్ ఒక ఇంటర్వ్యూలో తన భర్త ఓన్లెర్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, తన పేరు మీద లోన్లు తీసుకుని ఆస్తులను తనఖా పెట్టాడని ఆరోపించారు. దీనివల్ల తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అందుకే 2023లోనే విడాకులు తీసుకున్నామని ఆమె వెల్లడించారు.
మేరీకోమ్ ఆరోపణలను ఆమె మాజీ భర్త ఓన్లెర్ తీవ్రంగా ఖండించారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, ప్రస్తుతం ఢిల్లీలో అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆయన పేర్కొన్నారు. మేరీకోమ్, ఓన్లెర్ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఇరవై ఏళ్లు వైవాహిత జీవితం గడిపారు. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తనపై ఆర్థిక ఆరోపణలు చేసినందుకు ప్రతిగా మాజీ భర్త ఓన్లెర్ ్ మేరీకోమ్‌కు వివాహేతర సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. 2013లో ఒక జూనియర్ బాక్సర్‌తో, అలాగే 2017 నుంచి మేరీకోమ్ బాక్సింగ్ అకాడమీలో పనిచేసే ఒక వ్యక్తితో ఆమెకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు.
Watch: "I will talk about what she told Lok Adalat. Firstly, in 2013, she was having an affair with a junior boxer. Our families had a fight, and after that, we compromised. And since 2017, she's been having a relationship (with someone) working at the Mary Kom Boxing Academy. I… pic.twitter.com/dW4v99Lzqk
— IANS (@ians_india) January 13, 2026
తాను అమాయకుడినని చెప్పుకుంటూ.. మేరీకోమ్ అఫైర్లకు సంబంధించి తన దగ్గర వాట్సాప్ మెసేజ్‌లు ఆధారాలుగా ఉన్నాయని ఓన్లెర్ ప్రకటించారు. ఆమె మరొకరితో ఉండాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని, కానీ తనపై నిందలు వేయడం ఆపాలని ఆయన హెచ్చరించారు. నేను ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాను, కానీ ఆమె నన్ను అపరాధిగా నిలబెట్టాలని చూస్తోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
मशहूर मुक्केबाज Marykom ने रजत शर्मा के शो आप की अदालत में अपने पति के प्रति जो व्यवहार रखा है उसे पता चलता है कि बुजुर्ग महिलाओं को आजादी क्यों नहीं देते थे?
— Rajlaxmi (@rajalaxmi2007) January 13, 2026
20 साल की शादी तीन बच्चे के बाद भी मैरी कॉम ने Divorce सिर्फ इसलिए ले लिया कि उनके पति का सफल कैरियर नहीं था! जबकि,… pic.twitter.com/TNZDuliVgQ
ఈ వివాదంపై మేరీకోమ్ నుంచి ఇంకా పూర్తిస్థాయిలో స్పందన రావాల్సి ఉంది. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన ఒలింపిక్ విజేత వ్యక్తిగత జీవితం ఇలా రోడ్డున పడటం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఇరుపక్షాలు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాదిస్తుండటంతో, ఈ వివాదం మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.





















