Manish Sisodia on BJP: 'కేజ్రీవాల్ హత్యకు భాజపా కుట్ర'- సిసోడియా సంచలన వ్యాఖ్యలు
Manish Sisodia on BJP: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేసేందుకు భాజపా కుట్ర పన్నుతుందని ఆప్ అగ్రనేత మనీశ్ సిసోడియా ఆరోపించారు.
Manish Sisodia on BJP: దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ఆద్మీ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను చంపేందుకు భాజపా కుట్ర పన్నుతుందని సిసోడియా అన్నారు. కేజ్రీవాల్‌పై భాజపా ఎంపీ మనోజ్ తివారీ వాడిన భాష చూస్తే ఇదే నిజమనిపిస్తుందని సిసోదియా పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తుందని సిసోడియా చెప్పారు. గుజరాత్, ఎంసీడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.
#WATCH | Delhi: Manoj Tiwari has threatened Kejriwal, which makes it clear that BJP is conspiring to murder (Delhi CM) Arvind Kejriwal... will submit a complaint in the election commission, also file an FIR: Dy CM Manish Sisodia in a PC pic.twitter.com/TnUXEQRhE0
— ANI (@ANI) November 25, 2022
ఖండించిన తివారీ
తనపై సిసోడియా చేసిన ఆరోపణలను భాజపా ఎంపీ మనోజ్ తివారీ ఖండించారు. కేజ్రీవాల్ భద్రత గురించి మాత్రమే తాను ఆందోళన వ్యక్తం చేశానన్నారు.
I'm concerned about Arvind Kejriwal's safety, Sisodia reading old script of BJP conspiring to kill Kejriwal: BJP MP Manoj Tiwari
— Press Trust of India (@PTI_News) November 25, 2022
Kejriwal claims Sisodia will be arrested while Sisodia prophecies Kejriwal's murder; don't know what's going on: BJP MP Manoj Tiwari
— Press Trust of India (@PTI_News) November 25, 2022
Also Read: Malaysia New PM: మలేసియాలో మహోదయం- నూతన ప్రధానిగా సంస్కరణవాది అన్వర్