Viral News: స్కామ్ కాలర్‌కి చుక్కలు చూపించిన యువకుడు, ఇలా చేస్తే మీ డబ్బు సేఫ్ - వీడియో
Fake Calls: ఫేక్ కాల్ చేసిన ఓ స్కామర్‌కి యువకుడు చుక్కలు చూపించాడు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించాడు. ఫోన్ కాల్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Viral News in Telugu: "మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే చాలు ఇంత డబ్బు మీ అకౌంట్‌లోకి వచ్చేస్తుంది". ఈ తరహా మెసేజ్‌లు రోజూ వస్తూనే ఉంటాయి. ఇది జస్ట్ ఓ ఉదాహరణ మాత్రమే. ఇంతకు మించి రకరకాల మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ (Scam Callers) వస్తున్నాయి. ట్రేస్ కూడా చేయలేని నంబర్ నుంచి కాల్ చేసి ఏదేదో చెప్తారు. మెల్లగా వాళ్ల బుట్టలో పడేసి అకౌంట్‌లోని డబ్బంతా లాగేస్తారు. ఆ తరవాత అవి రికవరీ కూడా అవ్వవు. పోలీస్ స్టేషన్, బ్యాంక్ చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోవడమే మన వంతవుతుంది. ఇలా రోజూ వందలాది మంది ఈ తరహా స్కామ్‌లలో బాధితులవుతున్నారు. కొందరు చాలా సులువుగా మోసపోతున్నారు. కానీ...ఓ యూజర్ మాత్రం ఆ స్కామర్‌కే చుక్కలు చూపించాడు. ఫోన్‌పేలో ఈ మధ్య ఓ స్కామ్ జరుగుతోంది. రూ.8,999 అకౌంట్‌లో జమ అవుతాయని చెప్పి ఓ లింక్ పంపించి క్లిక్ చేయమని చెబుతున్నారు స్కామర్స్. ఇది తెలియక కొంత మంది అకౌంట్‌లో ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటున్నారు. అయితే..ఓ యూజర్ మాత్రం ఫోన్ కాల్‌లో మాట్లాడుతూనే..అదంతా మరో ఫోన్‌తో వీడియో తీశాడు.
“Tum Jaise Lakhon Chutiya Phanste hai hamare paas”
— RedBoxxLocal India Parody (@REDBOXINDIIA) August 7, 2024
Chilling to hear the last 2 minutes of this phishing phone call pic.twitter.com/JgOQaeKmwJ
యూపీఐ పిన్‌తో సహా అన్ని వివరాలూ ఇవ్వాలని ఆ స్కామ్ యూజర్‌ని అడిగాడు. "డబ్బులు రిసీవ్ చేసుకోడానికి ఇవన్నీ ఎందుకు" అని యూజర్ ప్రశ్నించాడు. అప్పటి వరకూ చాలా పొలైట్‌గా సర్, సర్ అని మాట్లాడిన ఆ స్కామర్ ఒక్కసారిగా రూట్ మార్చాడు. కానీ యూజర్ మాత్రం వదల్లేదు. అలానే మాటల్లో పెట్టి చాలా సేపు ఆ సంభాషణ కొనసాగించాడు. "నువ్వో ఫేక్ నంబర్ నుంచి కాల్ చేశావని నాకు అర్థమైంది. ఇదంతా స్కామ్ అని కూడా తెలుస్తోంది. నేను ఎందుకు పిన్ నంబర్ ఇవ్వాలి" అని ప్రశ్నించాడు యూజర్. దానికి ఆ స్కామర్ "నేను ఫేక్ అని మీకెలా తెలుసు..? అలా ఇంకోసారి అంటే కేసు పెడతాను" అని రివర్స్‌లో అటాక్ చేశాడు.
ఆ తరవాత యూజర్ కాస్త గట్టిగానే మందలించాడు. ఇలాంటి స్కామ్‌లు చాలానే చూశామని, మోసం చేయాలని చూస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఆ స్కామర్ ఏ మాత్రం బెదరకపోగా తనను ఎవరూ ట్రేస్ చేయలేరని తేల్చి చెప్పాడు. అంతే కాదు. ఇదంతా వీడియో తీస్తున్నానని చెప్పగానే...ఫోన్‌నే హ్యాక్ చేస్తా అని బెదిరించాడు. కనీసం కొంతమందికైనా ఈ స్కామ్ గురించి తెలుస్తుందని, కచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేస్తానని ఆ యూజర్ చెప్పాడు. వెంటనే ఆ కేటుగాడు కాల్ కట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Viral News: క్రిమినల్‌ని పట్టుకునేందుకు పోలీస్ సాహసం, బిజీ రోడ్డుపై ప్రాణాలకు తెగించి - వీడియో