అన్వేషించండి

I.N.D.I.A కూటమి ఛైర్మన్‌గా ఖర్గే, కన్వీనర్ పదవిని తిరస్కరించిన నితీశ్

Mallikarjun Kharge: విపక్ష కూటమికి మల్లికార్జున్ ఖర్గే ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

Mallikarjun Kharge Chair Person:  

I.N.D.I.A కూటమిని ముందుకు నడిపించేదెవరన్న అంశంపై ఇన్నాళ్ల సస్పెన్స్‌కి తెర పడింది. ఈ కూటమికి ఛైర్మన్‌గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) బాధ్యతలు తీసుకున్నారు. కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రతిపాదించినప్పటికీ అందుకు ఆయన అంగీకరించలేదు. నిజానికి ఈ కూటమి ఛైర్‌పర్సన్‌గా నితీష్ కుమార్  (Nitish Kumar) ఉండాలని చాలా మంది ప్రతిపాదించారు. కానీ...ఆ పదవి కాంగ్రెస్‌కి చెందిన కీలక నేతకే దక్కాలన్న చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. చివరికి ఆయన పేరునే ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కన్వీనర్‌ పదవి కూడా కాంగ్రెస్‌ నేతకే అప్పగించాలని నితీష్ కుమార్ తేల్చి చెప్పినట్టు JDU నేతలు చెబుతున్నారు. తనకు ఆ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని చెప్పినట్టు తెలుస్తోంది. 

 

విపక్ష కూటమి నేతలు వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే ఎన్నో కీలక అంశాలు చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిగాయి. ఇదే సమయంలో కూటమి కన్వీనర్ పదవి ఎవరికి ఇవ్వాలన్న దానిపై చాలా సేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. నితీష్ కుమార్ పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందుకే ప్రస్తుతానికి ఖర్గేని ఛైర్‌పర్సన్‌గా అంగీకరించినట్టు సమాచారం. అయితే...అధికారికంగా మాత్రం కూటమి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో సంప్రదింపులు జరిపిన తరవాత అధికారికంగా ఓ ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన సమావేశంలో మమతా బెనర్జీ ప్రధాని అభ్యర్థిపైనా కీలక ప్రతిపాదనలు చేశారు. మల్లికార్జున్ ఖర్గే ప్రధాని అభ్యర్థిగా ఉండాలని సూచించారు. అందుకు అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు పలికారు. ఈ విషయంలో కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రతిపాదనపై నితీష్ కుమార్ అలిగినట్టు తెలుస్తోంది. ఆ తరవాత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. అది కేవలం ప్రపోజల్ మాత్రమే అని బుజ్జగించారు. ఈ విషయంలోనే కాదు. సీట్‌ల పంపకాల్లోనూ విభేదాలు కొనసాగుతున్నాయి. ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకోవడం వల్ల సీట్ షేరింగ్‌ కత్తిమీద సాముగా మారింది. మల్లికార్జున్ ఖర్గే కాస్త చొరవ తీసుకుని విభేదాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవేవీ పెద్దగా సక్సెస్ అవడం లేదు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో సీట్‌ల పంపకాల పంచాయితీ నడుస్తోంది. అటు మహారాష్ట్రలోనూ పరిస్థితి ఇలానే ఉంది. యూపీలోనూ ఇంకా ఏ విషయమూ కొలిక్కి రాలేదు. 

Also Read: Ram Mandir Inauguration: అయోధ్య ఉత్సవం కోసం రైళ్ల షెడ్యూల్ మార్చేసిన రైల్వే, పూర్తి వివరాలివే

టాప్ హెడ్ లైన్స్

Abhishek Sharma News: మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
మ‌ళ్లీ టాప్ లేపిన‌ అభిషేక్ .. ఇషాన్ కిషన్ కు ఝలక్, జడేజా రికార్డుకు మార్కో జాన్సెన్ ఎండ్ కార్డ్
ABP Desam Top 10, 29 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 29 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
WPL Auction Dhamaka: కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
కోట్లు కుమ్మరించిన వారియర్స్.. ఆర్సీబీకి షాక్.. వేలంలో సోఫీకి జాక్‌పాట్, 15 ఏళ్ల సంచలనానికి ఢిల్లీ గాలం
ABP Desam Top 10, 28 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 28 October 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Embed widget