అన్వేషించండి

Mallikarjun Kharge: ఖర్గే వ్యాఖ్యలతో సెగలు - ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అన్న కాంగ్రెస్ బాస్.. బీజేపీ ఆగ్రహం!

Kharge Controversy: ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి మల్లిఖార్జున్ ఖర్గే టెర్రిస్టు అని విమర్శించడం వివాదాస్పదమవుతోంది. తమిళనాడులో ప్రచారం చివరి రోజున ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

Mallikarjun Kharge Controversy: తమిళనాడు ఎన్నికల ప్రచారం ముగింపు దశలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆయన చేసిన  టెర్రరిస్ట్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.  
 
తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన ప్రచార సభలో మల్లిఖార్జున ఖర్గే ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. ఏఐఏడీఎంకే నాయకత్వాన్ని విమర్శించే క్రమంలో ఆయన వివాదాస్పద పదజాలాన్ని ఉపయోగించారు. అన్నాదురై ఫోటో పెట్టుకుని తిరిగే ఏఐఏడీఎంకే నేతలు, మోదీతో ఎలా జతకడతారు? ఆయనొక టెర్రరిస్ట్. ఆయన పార్టీకి సమానత్వం, న్యాయంపై నమ్మకం లేదు. అలాంటి వారితో చేతులు కలపడం అంటే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే  అని ఖర్గే వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిని ఉద్దేశించి ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఇలాంటి పదాలు వాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.            
 
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. ప్రపంచవ్యాప్తంగా గౌరవించే  ప్రధానిని ఉగ్రవాది అనడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఖర్గే తన నిగ్రహాన్ని కోల్పోయి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు  అని  మండిపడుతున్నారు. ఖర్గే తక్షణమే దేశ ప్రజలకు, ప్రధానికి క్షమాపణ చెప్పాలని, ఎన్నికల కమిషన్ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.                            

వివాదం ముదరడంతో కాంగ్రెస్ నేతలు ఖర్గే వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం భౌతికమైన ఉగ్రవాదం గురించి కాదని, విపక్షాలను ఇబ్బంది పెడుతున్న  రాజకీయ ఉగ్రవాదం గురించి అని వివరణలు ఇస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని మోదీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్న భావనతోనే ఆయన ఆ పదాన్ని వాడారని చెప్తున్నారు.  

తమిళనాడులో పోలింగ్‌కు కేవలం ఒక రోజు ముందు ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ దీనిని ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్తుండగా, డీఎంకే కూటమి మాత్రం ఈ వివాదం నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తోంది.                                            

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
Atchannaidu: జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
జలధార జలహారతితో 79,826 పనులు పూర్తి.. భూగర్భ జలాలు 0.79 మీటర్లు పెరుగుదల: అచ్చెన్నాయుడు
MLA Danam Nagender Disqualification: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget