అన్వేషించండి

Muizzu-Xi meeting: జిన్‌పింగ్‌తో మాల్దీవ్స్ అధ్యక్షుడి భేటీ, భారత్‌ని కవ్వించడానికేనా?

Muizzu-Xi meeting: భారత్‌తో వివాదం నడుస్తున్న సమయంలోనే జిన్‌పింగ్‌తో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ముయిజూ భేటీ అయ్యారు.

Muizzu-Xi Jinping meeting: భారత్, మాల్దీవ్స్ మధ్య విభేదాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాల్దీవ్స్ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజూ భారత్‌తో మైత్రిని పక్కన పెట్టేయాలని చూస్తున్నారు. అదే సమయంలో చైనాకి దగ్గరవుతున్నారు. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. భారత్‌తో వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలా భేటీ అవడం కీలకంగా మారింది. ఐదు రోజుల పాటు చైనాలో ముయిజూ పర్యటించనున్నారు. ఈ సందర్భంగానే "చైనా మాకు అత్యంత సన్నిహితమైన దేశం. అభివృద్ధిలో కలిసి ముందుకు నడుస్తాం" అని ప్రకటన కూడా చేశారు. చైనా మీడియా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇద్దరు నేతలూ సమావేశమయ్యారని, కానీ ఏ అంశాలపై చర్చించారో స్పష్టంగా తెలియదని తెలిపింది. అయితే...ఈ భేటీలో రెండు దేశాలూ 20 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు సమాచారం. ముయిజూని సాదరంగా స్వాగతించారు జిన్‌పింగ్‌. "నా పాత మిత్రుడు" అని చాలా ఆప్యాయంగా పలకరించారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటి వరకూ మైత్రి కొనసాగినప్పటికీ ఇకపై ఈ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని జిన్‌పింగ్‌ ఆసక్తి చూపిస్తున్నారట. జనవరి 9వ తేదీ రాత్రి ముయిజూ చైనాకి చేరుకున్నారు. రెడ్‌కార్పెట్ వేసి గన్ సెల్యూట్‌తో చాలా ఘనంగా ఆహ్వానించింది చైనా. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆయనకు వెల్‌కమ్ చెప్పారు. 

చైనా టూరిస్ట్‌ల కోసం..

ఇటు భారత్‌తో మాత్రం మైత్రి కొనసాగించేందుకు ముయిజూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అక్కడి మంత్రులు కొందరు ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైన వివాదం..క్రమంగా పెద్దదైంది. గతేడాది అక్టోబర్‌లో మహమ్మద్ ముయిజూ అధ్యక్ష పదవిని చేపట్టారు. అప్పటి నుంచీ భారత్‌కి దూరంగానే ఉంటున్నారు. మాల్దీవ్స్‌లో భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ఓ సారి ఢిల్లీ వచ్చి భేటీ అయ్యారు కూడా. కానీ...భారత్‌ అందుకు అంగీకరించడం లేదు. భారత్‌పై విద్వేషపూరిత ప్రచారం చేయడానికీ ప్రస్తుత ప్రభుత్వం సహకరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొవిడ్‌కి ముందు చైనా నుంచే మాల్దీవ్స్‌కి ఎక్కువగా పర్యాటకులు వెళ్లేవారు. ఈ విషయాన్ని మహమ్మద్ ముయిజూ గుర్తు చేశారు. త్వరలోనే చైనా టూరిస్ట్‌లను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేలా చర్యలు చేపడతామని హామీ కూడా ఇచ్చారు. పలువురు ఇండియన్ టూరిస్ట్‌లు మాల్దీవ్స్ ట్రిప్‌ని రద్దు చేసుకున్న సమయంలోనే కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారు ముయిజూ. 

మాల్దీవ్స్‌కి పోటీగా లక్షద్వీప్‌ని తీర్చి దిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడ పర్యాటక రంగాన్ని (Lakshadweep Tourism) అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుత వివాదం కారణంగా చాలా మంది ఇండియన్స్ మాల్దీవ్స్ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ తప్పుని సరిదిద్దుకునేందుకు మాల్దీవ్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గూగుల్‌ సెర్చ్‌లో లక్షద్వీప్‌ టాప్‌లోకి వెళ్లిపోయింది. ఇక్కడ టూరిజం రంగాన్ని డెవలప్ చేయడానికి ఇదే సరైన సమయం అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...ఇక్కడ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏమేం చేయొచ్చో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతానికి లక్షద్వీప్‌లో అగట్టి ద్వీపంలో ఎయిర్‌ స్ట్రిప్ అందుబాటులో ఉంది. అయితే...పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లు ల్యాండ్ అయ్యేలా మినికాయ్ ఐల్యాండ్‌లో కొత్తగా ఎయిర్‌పోర్ట్ నిర్మించాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం.

Also Read: Lakshadweep Trip : లక్షద్వీప్​ వెళ్తున్నారా? అయితే ఇవి తప్పకుండా ఎక్స్​పీరియన్స్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Embed widget