Maharashtra: ఠాక్రేకు షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు, ఈసీ నిర్ణయం సరైందేనన్న న్యాయస్థానం
Maharashtra: ఉద్దవ్ ఠాక్రేకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పార్టీ గుర్తుపై ఈసీ ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని వెల్లడించింది.
Uddhav Thackeray:
పార్టీ గుర్తుపై..
శివసేనకు చెందిన పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉద్దవ్ ఠాక్రే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం...ఠాక్రేకు షాక్ ఇచ్చింది. "ఎలాంటి అవకతవకలు" జరగలేదని తేల్చి చెప్పింది. పార్టీ గుర్తు వినియోగించటంపై నిషేధం ఉందని వెల్లడించింది. ఉప ఎన్నికలకు సమయం తక్కువ ఉన్నందున, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల సంఘం శివసేన పేరు, పార్టీ గుర్తుని వినియోగించడంపై ఆంక్షలు విధించిందని వివరించింది. " ఈ విషయంలో పిటిషనర్ అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో చాలా సమయం తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించారని కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం సరికాదు. ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన జడ్జ్..పూర్తి స్థాయి తీర్పుని త్వరలోనే వెలువరిస్తామని చెప్పారు. ఎన్నికల సంఘం చట్టపరంగానే నడుచుకుందని, గతంలోనూ పార్టీల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఇలాంటి ఆదేశాలే ఇచ్చినట్టు గుర్తు చేసింది. ఈ కేసుని ప్రత్యేకించి చూడాల్సిన పని లేదని తేల్చి చెప్పింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది ఢిల్లీ హైకోర్టు.
వివాదం..
శివసేన 'విల్లు, బాణం' గుర్తుపై శిందే, ఠాక్రే వర్గం మధ్య కొనసాగుతున్న వివాదంలో భారత ఎన్నికల సంఘం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంధేరి తూర్పు స్థానానికి జరిగే ఉపఎన్నికలో శివసేనకు రిజర్వ్ చేసిన 'విల్లు, బాణం' చిహ్నాన్ని ఉపయోగించడానికి రెండు
వర్గాలను అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది. అంధేరిలో ఈస్ట్ ఉపఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం నోటిఫై చేసిన ఉచిత చిహ్నాల జాబితా నుంచి వేర్వేరు చిహ్నాలను ఎంచుకోవాలని రెండు వర్గాలను కోరినట్లు కమిషన్ తెలిపింది. ఈ మేరకుఉప ఎన్నికల్లో తమకు త్రిశూల్, మాషాల్(మ), ఉదయించే సూర్యుడు అనే మూడు చిహ్నాల్లో ఒక చిహ్నం, పేరును కేటాయించాలని ఉద్ధవ్ ఠాక్రే కమిషన్‌ను కోరింది. ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఏక్‌నాథ్ శిందే వర్గం కొత్త పేర్లు, గుర్తులను ఎంచుకోవాలని ఈసీ ఆదేశించింది. ఈసీ ఆదేశం మేరకు రెండు వర్గాలు ఇప్పటికే కొత్త పేర్లు, గుర్తులకు సంబంధించిన ఆప్షన్‌లను ఈసీకి సమర్పించాయి. ఎవరిది అసలైన శివసేన అనే విషయంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. అయితే..మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే...ఠాక్రే వర్గం చాలా అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే...కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. పార్టీ గుర్తులను కేటాయించటంలో "పక్షపాతం" చూపించారని అసహనం వ్యక్తం చేసింది. "ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం చాలా అసంతృప్తిని కలిగించింది. ఉద్దవ్ ఠాక్రే కూడా దీనిపై అసహనంగా ఉన్నారు" అని ఠాక్రే తరపు న్యాయవాది వివేక్ సింగ్ ఈ లేఖలో పేర్కొన్నారు.
Also Read: China Covid: ఆరు నెలల తర్వాత చైనాలో మళ్లీ కరోనా మరణం