News
News
X

Maharashtra Assembly Session: చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే 

Maharashtra Assembly Session: మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఓ అరుదైన ఘటన జరిగింది. ఎన్‌సీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన చంటి బిడ్డతో సమావేశాలకు హాజరయ్యారు.

FOLLOW US: 
Share:

Maharashtra Assembly Session: మహారాష్ట్రలో సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సమావేశాల్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి చెందిన నాసిక్ నియోజకవర్గ ఎమ్మెల్యే సరోజ అహిరే తన రెండున్నర నెలల పసికందుతో అసెంబ్లీకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. 

ఇదీ సంగతి

చంటి బిడ్డను ఎత్తుకొని అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేతో పాటు తన భర్త, అత్త కూడా చంటి బిడ్డను చూసుకోవడానికి అసెంబ్లీకి వచ్చారు. సభకు హాజరయ్యే ముందు ఎమ్మెల్యే సరోజ అహిరే విలేకర్లతో మాట్లాడారు.

" గత రెండున్నర సంవత్సరాలుగా కరోనా వైరస్ సృష్టించిన విపత్తు కారణంగా మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. నేను ఇప్పుడు తల్లి అయినా.. నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రజల ప్రశ్నలకు సమాధానాల కోసం ఇక్కడకు వచ్చాను. అసెంబ్లీలో మహిళా చట్ట సభ్యులకు సరైన భోజన గది, క్రౌచ్ కూడా లేదు. ప్రభుత్వం దీనిని గమనించి.. శాసనసభ సభ్యులు వారి పిల్లలను తీసుకురావడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తే బావుంటుందని ఆశిస్తున్నాను.                                             "
-   సరోజ అహిరే, ఎన్‌సీపీ ఎమ్మెల్యే

దాదాపు రెండున్నర సంవత్సరాల తరవాత నాగపుర్‌లో మహరాష్ట్ర శాసన సభ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని భాజపా- శివసేన (ఏక్‌నాథ్ శిందే వర్గం) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ప్రతిపక్ష పార్టీలు గత ఆదివారం జరిగిన సంప్రదాయ తేనేటి విందును బహిష్కరించాయి.

Also Read: Parliament Winter Session: చైనాపై చర్చకు సభాపతి నో- రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్!

Published at : 19 Dec 2022 05:36 PM (IST) Tags: Assembly new born baby Maharashtra Assembly Session NCP MLA

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

Breaking News Live Telugu Updates: కడప జిల్లా పులివెందలలో కాల్పుల కలకలం - ఇద్దరి పరిస్థితి విషమం

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

YS Sharmila: కింద పడిపోయిన వైఎస్ షర్మిల - ఇంటిముందే తోపులాట, ఉద్రిక్తత

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

Mla Rapaka : దొంగ ఓట్లతో గెలిచానని అనలేదు, నా మాటలు వక్రీకరించారు- ఎమ్మెల్యే రాపాక వివరణ

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 28 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ప‌శువైద్యుడు గుర్తించ‌లేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది

ప‌శువైద్యుడు గుర్తించ‌లేకపోయాడు- చాట్‌జీపీటీ పెంపుడు కుక్క ప్రాణాలు కాపాడింది

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!