News
News
X

Madhya Pradesh News: మూడు రోజులు మొదటి భార్యతో, మరో మూడు రోజులు రెండో భార్యతో - ఇదేం అగ్రిమెంట్‌రా బాబు

Madhya Pradesh News: రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి వింత ఒప్పందం చేసుకున్నాడు.

FOLLOW US: 
Share:

Madhya Pradesh News:

రెండు పెళ్లిళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజినీర్..

ఈ రోజుల్లో అబ్బాయిల పెళ్లంటే పెద్ద ప్రహసనం అయిపోయింది. లక్షల రూపాయల జీతమున్నా, సెటిల్ అయినా అమ్మాయిలు దొరకడమే కష్టమైపోతోంది. 30 ఏళ్లు దాటినా చాలా మంది బ్రహ్మచారులుగానే ఉంటున్నారు. కానీ మధ్యప్రదేశ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కథ వేరు. ఒక్క పెళ్లే కష్టం అనుకుంటుంటే...గ్వాలియర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడు ఏకంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడి నుంచి మొదలయ్యాయి తంటాలు. చివరకు కోర్టు వరకూ వెళ్లింది ఈ పెళ్లిగోల. ఈ సమస్యను ఎలా దాటాలిరా బాబు అని తల పట్టుకుంటున్న యువకుడికి బంపర్ ఆఫర్ ఇచ్చింది కోర్టు. ఒక్కో భార్య దగ్గర మూడేసి రోజులు ఉండొచ్చని తీర్పునిచ్చింది. పైగా మరో బోనస్‌ కూడా ఇచ్చింది. ఆదివారం రోజు ఎవరిదగ్గరైనా ఉండొచ్చని చెప్పింది. అంటే వారంలో సగం రోజులు ఒక భార్య వద్ద, మరో సగం రోజులు మరో భార్య వద్ద ఉండొచ్చన్నమాట. ఆ యువకుడికి ముందుజాగ్రత్త ఎక్కువ అనుకుంటా. ఆల్‌రెడీ రెండు ఫ్లాట్‌లు కొనేసి రెడీ చేసేశాడు. ప్రస్తుతానికి ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇదేం తీర్పురా బాబు అని నవ్వుకుంటున్నారు నెటిజన్లు. 

ఇంతకీ కథేంటి..? 

2018 మే నెలలో ఈ యువకుడు ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. గుడ్‌గావ్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే రెండేళ్ల పాటు కాపురం పెట్టాడు. ఈ దంపతులకు ఓ మగబిడ్డ పుట్టాడు. అయితే 2020లో కరోనా ఉద్ధృతి కారణంగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ ఆప్షన్ ఇచ్చాయి. వెంటనే గుడ్‌గావ్ నుంచి గ్వాలియర్‌కు వచ్చేశాడు ఆ యువకుడు. అయితే గ్వాలియర్‌లో కొద్ది రోజులు మాత్రమే గడిపాడు. ఆ తరవాత మళ్లీ గుడ్‌గావ్‌కు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఊరికి తిరిగి రాలేదు. ఇక లాభం లేదని ఆ యువకుడి భార్యే గుడ్‌గావ్‌కు 2021లో వచ్చేసింది. అప్పుడే షాకింగ్ న్యూస్ తెలిసింది. అప్పటికే ఆ వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. కంపెనీలో పని చేసే అమ్మాయినే పెళ్లాడాడు. పైగా వాళ్లకు ఓ కూతురు కూడా పుట్టింది. ఇది తెలిసిన వెంటనే మొదటి భార్య గ్వాలియర్‌లోని ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. అయితే...ఫ్యామిలీ కౌన్సిలర్‌ కాంప్రమైజ్ చేసేందుకు ప్రయత్నించాడు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లి చేసుకోవడం నేరం అని వివరించాడు. ఓసారి FIR నమోదైతే కెరీర్ కూడా పాడవుతుందని చెప్పాడు. ఇక ఇది కోర్టులో తేలే వ్యవహారం కాదని బయటకు వచ్చేశారు. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాడు ఆ కౌన్సిలర్. మూడు రోజులు ఒకరి దగ్గర, మరో మూడు రోజులు మరో భార్య దగ్గర ఉండాలని ఒప్పందం కుదిర్చాడు. ఆదివారం మాత్రం నచ్చిన చోట ఉండొచ్చని చెప్పాడు. ఇందుకు ముగ్గురూ ఒప్పుకున్నారు. ఒకవేళ ఈ రూల్‌ని కాదని ఇష్టమొచ్చినట్టు నడుచుకుంటే మాత్రం మొదటి భార్య మరోసారి కోర్టుకి వెళ్లి కేసు నమోదు చేయొచ్చని సూచించాడు. మొత్తానికి ఈ కథ అలా సుఖాంతం అయింది. 

Also Read: Keeravaani on RRR : ఆస్కార్ విజయం తర్వాత 'ఆర్ఆర్ఆర్'కి కీరవాణి ఇచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా?

Published at : 16 Mar 2023 12:07 PM (IST) Tags: Madhya Pradesh Madhya Pradesh News Gwalior 2 wives Gwalior Family Court

సంబంధిత కథనాలు

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

TSPSC: బండి సంజయ్, రేవంత్ కి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు - రూ.100 కోట్ల పరువునష్టం దావా

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

No-confidence Motion : లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం, ప్రతిపక్షాలు సమాలోచనలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

TSPSC Paper Leak: 'గ్రూప్‌-1' మెయిన్స్‌ పేపర్ కూడా లీకయ్యేదా? బయటపడుతున్న కుట్రలు!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

AP Elections: వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సీపీఐ నారాయణ క్లారిటీ - కండీషన్స్ ఆప్లై అంటూ ట్విస్ట్!

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత