Lok Sabha Election: కర్ణాటకలో కాంగ్రెస్‌కు కలిసొస్తుందట, పార్టీలో ఆశలు రేపుతున్న ఆ సర్వే
Lok Sabha Election: కర్ణాటకలో కాంగ్రెస్‌కు 17 లోక్‌సభ సీట్లు వస్తాయని ఓ సర్వే జోస్యం చెప్పింది.
Lok Sabha Election Karnataka:
కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు: సర్వే
2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వేల సందడి మొదలైంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది..? ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయని జోస్యం చెబుతున్నాయి. ఇప్పుడు కర్ణాటక రాజకీయాల పైనా C Voter India Today సర్వే చేపట్టింది. "Mood of the Nation" పేరుతో చేసిన ఈ సర్వేలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ బలం పుంజుకుని విజయం సాధిస్తుందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేసింది ఈ సర్వే. దాదాపు 60% లోక్‌సభ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. 2019తో పోల్చి చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పిన ఈ సర్వే...అప్పటికంటే కనీసం 8 రెట్లు ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటుందని తెలిపింది. 17లోక్‌సభ స్థానాల్లోని ఓటర్లను ప్రశ్నించగా....ఎక్కువ మంది కాంగ్రెస్‌కు మొగ్గు చూపినట్టు సీఓటర్ సర్వే వెల్లడించింది. 2019లో కాంగ్రెస్ కేవలం రెండు ఎంపీ సీట్లు మాత్రమే దక్కించుకుంది. బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. అయితే..ఈ సర్వే ప్రకారం చూస్తే మునుపటి కన్నా కాంగ్రెస్ ఎక్కువ సీట్లలోనే విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం 28 లోక్‌సభ స్థానాల్లో 17 కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్టు సర్వేలో తేలింది. గతేడాది ఆగస్టులోనూ సీఓటర్ సర్వే చేయగా...యూపీఏకి 13 స్థానాలు దక్కుతాయని తేలింది. ఇప్పుడా సంఖ్య 17కి పెరిగింది.
బీజేపీ ధీమా
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. బెంగళూరులో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో మాట్లాడిన యడియూరప్ప...ఎన్నికల్లో బీజేపీకి 130-140 సీట్లు వస్తే తప్పకుండా మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఎన్నికల టెన్షన్ మొదలైందని అని సెటైర్లు వేశారు. కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను నియమించడంపైనా స్పందించారు యడియూరప్ప. ఈ నిర్ణయంతో బీజేపీకి కలిసొస్తుందని స్పష్టం చేశారు. కో ఇంఛార్జ్‌గా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నమలైను నియమించింది అధిష్ఠానం. అన్నమలైపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు సీనియర్ నేతలు. ఈ ఇద్దరి నేతృత్వంలో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని బలంగా నమ్ముతున్నారు. ఈ ఏడాది మే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం దీనిపై పూర్తి వివరాలు ప్రకటించనుంది. 2018 మేలో జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ సెక్యులర్ (JDS),కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిచాయి. జేడీఎస్ లీడర్ కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే..2019లో ఈ సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. తరవాత కొన్ని కారణాల వల్ల ఆయన ఆ పదవి నుంచి తప్పుకోగా...బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యారు.
Also Read: PM Modi Speech: మీరెంత బురద జల్లితే అంత అందంగా కమలం వికసిస్తుంది - కాంగ్రెస్‌కు ప్రధాని చురకలు