Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం- భారీగా ప్రాణ నష్టం!
Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం.
Kyiv Explosions: ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా మిసైల్స్ ప్రయోగించిన ఘటనలో కనీసం 8 మంది మృతి చెందినట్లు సమాచారం. ఈ పేలుడులో 24 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారి BNO న్యూస్‌కు తెలిపారు.
భారీ పేలుళ్లు
కీవ్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ పేలుళ్లు జరిగాయి. భారీ శబ్దంతో కీవ్‌లో పేలుళ్లు సంభవించినట్లు AP న్యూస్ తెలిపింది. ఎంతమంది మృతి చెందారనే విషయంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొంది.
This is Kyiv today. Video was published by the President Volodymyr Zelensky. pic.twitter.com/K49uGtZR8S
— Igor Lachenkov (@igorlachenkov) October 10, 2022
ఉక్రెయిన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, సెంట్రల్ ఉక్రెయిన్‌లోని డ్నిప్రోలో కూడా పేలుళ్లు సంభవించాయని రాయిటర్స్ నివేదించింది. ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు సహాయక సిబ్బంది.
నగరమంతటా క్షిపణి దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
ఇటీవల
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల చేసిన అణు హెచ్చరికలపై ఉక్రెయిన్ స్పందించింది. పుతిన్ హెచ్చరికలు ఉత్తి మాటలు కావని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ అన్నారు.
Also Read: Mulayam Singh Yadav Death: 'కాకలు తీరిన యోధుడు- రాజకీయ చదరంగంలో కురువృద్ధుడు'
Also Read: Mulayam Singh Yadav Death: 'ఆయన మరణం నన్ను బాధిస్తోంది'- మోదీ సహా ప్రముఖుల సంతాపం