అన్వేషించండి

KTR TWEET: 'ఫార్ములా ఈ-రేస్‌తో హైదరాబాద్ ఖ్యాతి పెంచాం' - ఎప్పటికైనా సత్యం, న్యాయం గెలుస్తాయంటూ కేటీఆర్ ట్వీట్

KTR NEWS: బీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా హరీష్‌రావు సహా బీఆర్‌ఎస్‌ నేతలను గృహనిర్బంధించారు.

KTR NEWS: భాగ్యనగరానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొస్తే... నీచ రాజకీయాలతో తనపై కక్ష గట్టి కేసులు నమోదు చేశారని బీఆర్‌ఎస్‌  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఏసీబీ(ACB) విచారణకు వెళ్లేముందు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో  చాటేందుకు ఫార్ములా- ఈ రేస్‌ను ఎంతో కష్టపడి హైదరాబాద్‌(Hyderabad)కు తీసుకొచ్చామన్నారు. భవిష్యత్‌ మొత్తం ఎలక్ట్రానిక్ వాహన రంగానేదనని గుర్తించి.. ముందుగానే అవకాశాలు ఒడిసి పట్టుకునేందుకు ప్రయత్నాలు సాగించామన్నారు. ‘‘ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో భాగ్యనగరాన్ని  గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఫార్ములా ఈ రేసు(E-Race) తీసుకొచ్చాం.  తెలంగాణలో  ఎలక్ట్రానిక్  వాహనాల ఇన్నోవేషన్, రీసెర్చ్‌, తయారీ రంగాల్లో పెట్టబుడులే లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టాం. తద్వారా తెలంగాణ యువతకు  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యోచించాం. ఫార్ములా ఈ - రేసు నిర్వహణతో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ అమాంతం పెరిగి ఈ- మొబిలిటీ వీక్‌ ద్వారా రూ.12 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. నీచ రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన వారికి ఈ విషయాలు అర్థంకాకపోవచ్చు గానీ... విజ్ఞులైన తెలంగాణ(Telangana) ప్రజలకు ఈ విషయాలన్నీ తెలుసన్నారు. మా విజన్‌, నిజాన్ని తెలంగాణ సమాజం  తప్పకుండా గుర్తిస్తుంది. ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది. అంటూ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. 
 
పార్ములా-ఈ రేసు నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ  అప్పటి పురపాలక మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగా విచారణకు హాజరు కావాలంటూ కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ  చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థ సొమ్ములు చెల్లించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. మంత్రివర్గం అనుమతి లేకుండానే  సొంతంగా నిర్ణయాలు తీసుకుని విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు తేల్చారు. తనపై తప్పుడు కేసు నమోదు చేశారంటూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్(KTR) క్వాష్‌ పిటిషన్ దాఖలు చేయగా....తప్పు జరిగినట్లు  ప్రాథమిక ఆధారాలు ఉన్నాయంటూ తెలంగాణ హైకోర్టు కేటీఆర్ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం న్యాయవాదితో కలిసి కేటీఆర్ విచారణకు హాజరుకాగా.. ఏసీబీ అధికారులు న్యాయవాదిని అనుమతించకపోవడంతో... ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోసారి కోర్టును ఆశ్రయించగా విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న న్యాయస్థానం.. ఆయన సమక్షంలోనే విచారించాల్సిందిగా  ఆదేశించింది. 
 
కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఆయన్ను  గృహ నిర్బంధించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్‌ను అరెస్ట్ చేయవచ్చన్న అనుమానంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా  హరీష్‌రావును ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధించారు. బీఆర్‌ఎస్‌ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే...చట్టపరమైన చర్యలు ఉంటాయని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే  విచారణ సాగుతోందని...ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.  ఏసీబీ విచారణకు వెళ్లే ముందు కేటీఆర్‌ను ఆయన సోదరి కవిత(Kavitha) దంపతులు, ఎమ్మెల్యే పాడికౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు  పరామర్శించారు. న్యాయం  తప్పకుండా గెలుస్తుందని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget