అన్వేషించండి

Kishan Reddy Guntur : మోదీ ప్రధాని అయ్యాకే రైల్వేల అభివృద్ధి - మూర్ఖులకు అర్థం కాదన్న కిషన్ రెడ్డి !

Railway : ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రైల్వేలు అభివృద్ధి చెందాయని కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు.


Kishan Reddy started trains in Guntur :  మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందిందని కేంద్ర మంత్రికిషన్  రెడ్డి తెలిపారు. గుంటూరులో మూడు రైళ్ల ప్రారంభానికి విజయవాడ వచ్చిన ఆయన రైల్వే ఆడిటోరియంలో మీడియాతో మాట్లాడారు.  రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామన్నారు. జనరల్ బడ్జెట్ లో రైల్వేను విలీనం చేసి.. ఆర్ధికపరమైన సహకారం మోడీ అందిస్తున్నారని తెలిపారు. డిజిటల్ అడ్వాన్స్ టెక్నాలజీ తో రైళ్లు నడుపుతున్నారని అన్నారు. ప్రపంచంలోనే రైల్వే నెట్ వర్కులో భారత్ నాలుగో స్థానంలో ఉందన్నారు. రైల్వే మన దేశ సమగ్రత కు అద్దం పడుతుందని తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరించి.. కొత్త హంగులతో తీర్చిదిద్దున్నామని తెలిపారు. 508 ర్వైల్వే స్టేషన్లను అమృత్ పధకంలో భాగంగా అభివృద్ది చేసేందుకు మోడీ భూమి పూజ చేశారు.  

దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు మొదలయ్యాయని తెలిపారు. సెమీ హై స్పీడ్ రైళ్లు ప్రపంచంలో మొదటి సారిగా స్వదేశీ టెక్నాలజీతో మనం నడిపామని తెలిపారు. కొంతమంది మూర్ఖులు ఈ ప్రక్రియను అవమానించారు.. వక్రీకరించారని మండిపడ్డారు. వాటిని అధిగమించి వందే భారత్ రైళ్లు నేడు అద్భుతంగా నడుస్తున్నాయన్నారు. గంటకు వంద కిలోమీటర్లు వేగంతో వెళ్లే విధంగా భద్రత, సౌకర్యాలతో రైళ్లు నడుస్తున్నాయన్నారు.  53 శాతం రాయితీతో రైల్వే సేవలందిస్తోందన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో చాలా వేగంగా రైల్వే అభివృద్ధి చెందింది.. స్విట్జర్లాండ్ తో సమానంగా నెట్వర్క్ అభివృద్ధి చేశామని తెలిపారు.  

2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్‌ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతోంది.. 5750 కిలోమీటర్ల ట్రాక్ లు, బ్రాడ్ గేజ్ లుగా అభివృద్ధి చేశాం.. రైల్వే లైన్ల విద్యుదీకరణకు రూ.38,650 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 26296 కొత్తగా 231 డబ్లింగ్ లైన్లకు రూ.2.7 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేశాం.. అమృత్ భారత్ ద్వారా 1309 రైల్వేస్టేషన్ లు మోడరన్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. 

వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశామన్నారు. ఐదు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం సాగిస్తాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయని తెలిపారు. 2018-23 వరకు మూడు లక్షల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రైల్వేకు నిధుల కొరత లేకుండా అభివృద్ది చేస్తున్నాం.. స్థలం కేటాయింపుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతున్నామని తెలిపారు. దేశంలో ప్రతి రోజూ రెండు కోట్ల మంది రైల్వే ద్వారా ప్రయాణాలు చేస్తున్నారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు 2.40లక్షల కోట్లుకు బడ్జెట్ పెరిగిందన్నారు. రైల్వే ట్రాక్ నిర్మాణం కూడా 70శాతం పెరిగిందని తెలిపారు. కేంద్రం ఇప్పటి వరకు 38,650 కోట్లు కేవలం రైల్వే విద్యుద్దీకరణ కోసం ఖర్చు చేసిందన్నారు. ప్రజలు మరింత మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించడంపైనే మోడీ ఆలోచనలు, ఆచరణ అనేది అందరూ తెలుసుకోవాలన్నారు. కాలుష్య రహిత వ్యవస్థగా రైల్వేను మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget