![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kisan Naya rally: మోదీజీ.. ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఖాళీ లేదా?: ప్రియాంక
లఖింపుర్ ఖేరీ ఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
![Kisan Naya rally: మోదీజీ.. ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఖాళీ లేదా?: ప్రియాంక Kisan Nyay Rally: Priyanka Gandhi Attacks BJP In Congress Rally, Says Government Failed To Deliver Justice Kisan Naya rally: మోదీజీ.. ఆ రైతు కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి ఖాళీ లేదా?: ప్రియాంక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/10/813b0167284aa3268eee2b7a99087e39_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
2022 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రచారశంఖారావం పూరించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. లఖింపుర్ ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. కాశీ విశ్వనాథుని క్షేత్రం, దుర్గా ఆలయంలో ఈ సభకు ముందు పూజలు చేశారు.
ముందుగా ఈ ర్యాలీకి 'ప్రతిజ్ఞ' అని పేరుపెట్టినప్పటికీ అనంతరం 'కిసాన్ న్యాయ ర్యాలీ'గా మార్చారు. దుర్గా మాత శ్లోకంతో తన ప్రసంగాన్ని ఆరంభించారు ప్రియాంక. భాజపా పాలనలో న్యాయం జరుగుతుందని ప్రజలు అనుకోవడం లేదన్నారు.
The CM is shielding the minister from public forum. PM came to Lucknow to see the performance of 'Uttam Pradesh' & Azaadi Ka Amrit Mahotsav but couldn't go to Lakhimpur Kheri to share the grief of the victim families: Congress leader Priyanka Gandhi Vadra in Varanasi pic.twitter.com/V5wALygqO8
— ANI UP (@ANINewsUP) October 10, 2021
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్..
లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రం సమర్పించనుంది కాంగ్రెస్. ఈ మేరకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో కూడిన ఏడుగురు సభ్యుల బృందానికి అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా అక్టోబర్ 9న రాష్ట్రపతికి ఓ లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్, ప్రియాంక, ఏకే ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నట్లు తెలుస్తోంది.
Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్‌లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)