Prince Harry: పబ్‌లో వర్జినిటీ కోల్పోయా, విలియమ్ నన్ను నేలకేసి కొట్టాడు - ఆటో బయోగ్రఫీలో ప్రిన్స్ హ్యారీ
Prince Harry: విడుదల కాక ముందే ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫీ స్పేర్ సంచలం సృష్టిస్తోంది.
Prince Harry Virginity:
స్పేర్ సంచలనం..
ప్రిన్స్ హ్యారీ ఆటోబయోగ్రఫీ బుక్ "Spare" ఇంకా విడుదల ముందే సంచలనం సృష్టిస్తోంది. 25 మందిని చంపానంటూ హ్యారీ ఆ బుక్‌లో రాసినట్టు బ్రిటీష్ మీడియా చెబుతోంది. దీనిపైనే అంతర్జాతీయ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఇప్పుడు మరి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వర్జినిటీ కోల్పోవడం నుంచి తన సోదరుడు విలియమ్ తనపై దాడి చేయడం వరకూ ఎన్నో సంచలన విషయాలు అందులో ప్రస్తావించారు హ్యారీ. మేఘనా మార్కెల్‌ను వివాహం చేసుకునే ముందు విలియమ్ తనపై దాడి చేశాడని చెప్పారు. మేఘనాతో వివాహమయ్యాక సోదరుడితో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టు వివరించారు.
విలియమ్ నన్ను నేలకేసి కొట్టాడు: హ్యారీ
"మేఘనాను విలియమ్ చాలా ద్వేషించాడు. ఎంతో తిట్టాడు. నన్ను కాలర్ పట్టుకుని లాగాడు. మెడను గట్టిగా నొక్కాడు. నన్ను నేలకేసి కొట్టాడు. చాలా సేపు ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోయాను. వెన్నముకకు గాయమైంది. ఆ తరవాత లేచి రూమ్‌లో నుంచి వెళ్లిపోవాలని గట్టిగా అరిచాను. గొడవ అయిన వెంటనే రూమ్‌లో నుంచి బయటకు వెళ్తూ విలియమ్ వెనక్కి తిరిగి...ఇదంతా మేఘనాకు చెప్పాల్సిన పనిలేదు అని అన్నాడు. నువ్వు నాపై దాడి చేసిన చెప్పకూడదా అని నేను అడిగాను. వెంటనే విలియమ్...నేనేమీ దాడి చేయలేదు అని సమాధానమిచ్చాడు. నేను అప్పుడు మేఘనాతో సహా ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఓ సారి మేఘనా నా గాయాలను చూసింది. ఏమైందని
అడిగింది. అప్పుడే ఈ విషయం అంతా చెప్పాను. తను పెద్దగా సర్‌ప్రైజ్ అవలేదు..కానీ చాలా బాధ పడింది" అని తన బయోగ్రఫీలో రాసుకున్నారు ప్రిన్స్ హ్యారీ.
వర్జినిటీ కోల్పోయా: ప్రిన్స్ హ్యారీ
ఇక ఇదే బుక్‌లో మరో సంచలన విషయం చెప్పారు హ్యారీ. నిజానికి హ్యారీ తండ్రి ఎవరు అన్న విషయంపైనా ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది. ప్రిన్సెస్ డయానా తన రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ జేమ్స్ హెవిట్‌తో అఫైర్ పెట్టుకున్నారు. అయితే...వాళ్లిద్దరి బిడ్డే హ్యారీ అనే రూమర్ కూడా ఉంది. దీనిపైనా హ్యారీ తన బుక్‌లో ప్రస్తావించారు. "నాన్నకు (ఛార్లెస్) కథలు చెప్పడం అంటే ఎంతో ఇష్టం. ప్రతి కథ తరవాత ఫిలాసఫికల్‌గా మాట్లాడేవారు. ఎవరికి తెలుసు నేను ఈ వేల్స్ ప్రిన్స్ అవునో కాదో...అసలు నీకు నేనే తండ్రినో కాదో అని నవ్వుతూ తన కథను ముగించేవారు. కానీ ఈ జోక్‌కి నాకెప్పుడూ నవ్వు రాలేదు. ఇదే రూమర్ అంతటా వ్యాపించింది" అని బుక్‌లో రాశారు. ఇక ఇదే పుస్తకంలో వర్జినిటీ కోల్పోయిన విషయాన్ని కూడా చెప్పారు హ్యారీ. తన కన్నా 17 ఏళ్లు పెద్దదైన మహిళతో ఓ పబ్‌లో వర్జినిటీ కోల్పోయినట్టు వివరించారు. ఆమె పేరుని వెల్లడించని హ్యారీ..అది చేదు అనుభవమే అని అన్నారు. బ్రిటీష్ రాయల్ ఫ్యామిలీలో ప్రిన్స్ హ్యారీ పెళ్లితో చాలానే విభేదాలు వచ్చాయి. ఇప్పుడు ఈ స్పేర్ బుక్‌తో అవి పూర్తిగా బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి.
Also Read: Prince Harry: నేను 25 మందిని చంపా, అందుకు రిగ్రెట్ కూడా లేదు - ప్రిన్స్ హ్యారీ బయోగ్రఫీ సంచలనం