![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
King Charles III Coronation: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు, అప్పుడే రాజ్యాధికారాలు
King Charles III Coronation: కింగ్‌ఛార్లెస్-III పట్టాభిషేకం వచ్చే ఏడాది మే లో జరగనుంది.
![King Charles III Coronation: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు, అప్పుడే రాజ్యాధికారాలు King Charles III's Coronation To Take Place On May 6 Next Year At Westminster Abbey, Know In Detail King Charles III Coronation: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు, అప్పుడే రాజ్యాధికారాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/12/6df38fb930b0e38b73425f22fd4fdd981665558356652517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
King Charles III Coronation:
వచ్చే ఏడాది..
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది మే 6వ తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. బంకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. "రాజు పట్టాభిషేకం వెస్ట్‌మిన్‌స్టర్ అబేలో జరగుతుంది" అని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఈ కార్యక్రమంలోనే కింగ్ ఛార్లెస్-IIIకి కిరీటం అందించి అధికారికంగా ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ఎంతో కాలంగావస్తున్న ఆచారానికి తగ్గట్టుగానే పట్టాభిషేకం జరుగనుంది. వచ్చే ఏడాది జూన్ నుంచి రాజుగా ఆయన అధికారిక పాలన మొదలవుతుంది. ఆయన పట్టాభిషేకం జరిగే సమయానికి కింగ్ ఛార్లెస్-III వయసు 74గా ఉండనుంది. బ్రిటీష్ చరిత్రలో 70 ఏళ్ల తరవాత రాజైన తొలి వ్యక్తిగానూ ఆయన రికార్డు సృష్టించనున్నారు. పట్టాభిషేకం కాగానే...ఆయనకు రాజ్యాధికారాలు వచ్చేస్తాయి.
The Coronation of His Majesty The King will take place on Saturday 6 May 2023 at Westminster Abbey.
— The Royal Family (@RoyalFamily) October 11, 2022
The Ceremony will see His Majesty King Charles III crowned alongside The Queen Consort.
సింపుల్‌గా చేస్తారా..?
సాధారణంగా...రాజు లేదా రాణి పట్టాభిషేకం (Coronation) అంటే చాలా ఆర్భాటంగా చేస్తారు. రాచ మర్యాదలతో ఎంతో ఘనంగా జరుగుతుందీ తంతు. 1953లో క్వీన్ ఎలిజబెత్-II పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ...ఈ సారి కింగ్ చార్లెస్-III మాత్రం చాలా సాదాసీదాగా ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తున్నారట. ఎలాంటి హంగులు లేకుండా, పెద్దగా ఖర్చు పెట్టకుండా దీన్ని ముగించేయాలని చూస్తున్నారట. ప్రస్తుతానికి యూకేలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్న విషయం తెలిసిందే. అందుకే...ఎక్కువగా ఖర్చు పెట్టకుండా సింపుల్‌గా పట్టాభిషేకం జరిగేలా ప్లాన్ చేస్తున్నారు కింగ్ చార్లెస్. యూకే పత్రిక Independent ఇదే విషయాన్ని వెల్లడించింది. ఎప్పుడు ఈ కార్యక్రమం
జరగనుందన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. సెప్టెంబర్ 8వ తేదీన రాణి మరణించగా..అప్పటి నుంచి సంతాప దినాలు పాటిస్తోంది రాయల్ ఫ్యామిలీ. ఇప్పటి వరకూ అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవటమూ....ఇప్పట్లో ఈ తంతు లేదన్న సంకేతాలిచ్చింది. అందుకు తగ్గట్టుగానే వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. వీలైనంత వరకూ తక్కువగా ఖర్చు చేసి, చాలా సాధారణంగా చేయాలని నిర్ణయించుకున్నారు. దేశ ఆర్థిక పరిస్థితులను గమనించే ఈ డిసిషన్ తీసుకున్నారు. వెస్ట్‌మిన్‌స్టర్ అబేలోనే పట్టాభిషేకం నిర్వహిస్తారు.
ఇదీ పద్ధతి..
బ్రిటన్ రాజకుటుంబ నిబంధనల ప్రకారం రాజు లేదా రాణి మరణిస్తే వారి వారసుడు లేదా వారసురాలిగా మొదటి వరుసలో ఉన్నవారు తక్షణమే బ్రిటన్ రాజు/రాణిగా మారిపోతారు. కనుక రాణి ఎలిజబెత్ 2 వారసుడిగా మొదటి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడు
ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ రాజుగా మారతారు. అయితే పట్టాభిషేకానికి నిర్దేశిత లాంఛనాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నెలలు లేదా మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. రాణి మరణించాక 24 గంటల్లోపు కొత్త రాజు పేరును ప్రకటిస్తారు.
యాక్సెషన్ కౌన్సిల్ లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ నుంచి ఈ అధికారిక ప్రకటన వస్తుంది. పట్టాభిషేక ప్రమాణ చట్టం–1689 ప్రకారం ప్రిన్స్ చార్లెస్ తన పట్టాభిషేక కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయాలి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఇటీవలే తుదిశ్వాస విడిచారు.
తీవ్ర అనారోగ్యానికి గురై రాణి ఎలిజబెత్ 2 కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధరించారు.
Also Read: Congress President Election: 'నా వెనుక సోనియా గాంధీ లేరు- అందుకే బరిలోకి దిగాను'
Also Read: Aung San Suu Kyi: ఆంగ్‌సాన్ సూకీకి 26 ఏళ్ల జైలు శిక్ష, సంచలన తీర్పునిచ్చిన కోర్టు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)