కపిల్ శర్మ కెనడా కేఫ్ పై ఖలిస్థానీ తీవ్రవాదుల కాల్పులు: షాకింగ్ కారణం..భారతీయుల్లో ఆందోళన!
Canada: కెనడాలో కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన కేఫ్ లో ఖలీస్థానీ తీవ్రవాదులు కాల్పులు జరిపారు. హర్జీత్ సింగ్ లడ్డీ అనే తీవ్రవాది తనదే బాధ్యత అని ప్రకటించుకున్నాడు.

Khalistani Terrorists Fire At Kapil Sharma Cafe In Canada: కామెడి కింగ్ కపిల్ శర్మ కెనడాలో కొత్తగా ప్రారంభించిన కాప్స్ కేఫ్ రెస్టారెంట్‌పై ఖలీస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు. కాల్పులతో బీభత్సం సృష్టించారు. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదు. కానీ ఈ సంఘటన స్థానిక భారతీయ సమాజంలో ఆందోళన కలిగించింది. కెనడాలో పెరుగుతున్న ఖలిస్థానీ తీవ్రవాదుల అరాచకాల్ని గుర్తు చేసింది.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాప్స్ కేఫ్ పేరుతో కపిల్ శర్మ కొత్తవ్యాపారం ప్రారంభించారు.అర్థరాత్రి పూట కస్టమర్లు ఎవరూ లేని సమయంలో తొమ్మిది రౌండ్ల బుల్లెట్లు కేఫ్‌పై కి దూసుకు వచ్చాయి. కొన్ని బుల్లెట్లు కేఫ్‌తో పాటు ఇతర నివాస భవనాలకు కూడా తగిలాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో ఈ కాల్పుల దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటన వీడియో వైరల్ అయింది.
ఈ దాడికి బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న హర్జీత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించినట్లు ప్రకటించుకున్నాడు. పేర్కొన్నాడు. లడ్డీ భారతదేశంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. కపిల్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఈ కాల్పులు జరిపినట్లుగా లడ్డీ ప్రకటించుకున్నాయి. అయితే కపిల్ శ్రమ చేసిన ఆ వ్యాఖ్యలేమిటో లడ్డీ చెప్పలేదు.
World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.
— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025
Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf
కపిల్ శర్మ , తన భార్య గిన్నీ చత్రత్ సంయుక్తంగా ఈ కేఫ్‌ను సర్రేలో ఈ నెలలోనే సాఫ్ట్ లాంచ్ చేశారు. రెస్టారెంట్ రంగంలో కపిల్ శర్మ తొలి వ్యాపార ప్రయత్నం. కెనడాలో గణనీయంగా ఉన్న భారతీయుల్ని ఆకట్టుకునేలా కేఫ్ ఉంటుంది. కపిల్ శ్రమ భార్య నేరుగా రెస్టారెంట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.
कॉमेडी के बाद कपिल शर्मा ने बिजनेस में हाथ आजमाने का सोचा
— Brahmin Genes (@Brahmingen) July 10, 2025
उसके चलते उन्होंने "Kaps Cafe" नाम से कनाडा में एक रेस्टोरेंट खोला
आज खबर आई है कि कपिल शर्मा के रेस्टोरेंट पर ओपन फायरिंग हुई है।
खालिस्तानी आतंकवादी हरजीत सिंह लाडी ने गोलीबारी की जिम्मेदारी ली है।#KapilSharma pic.twitter.com/xEb1VUQzfI
కాల్పుల ఘటనపై సర్రే పోలీసు డిపార్ట్‌మెంట్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తోంది. ఘటనా స్థలాన్ని సీల్ చేసి, సీసీటీవీ ఫుటేజ్ ,ఇతర ఆధారాలను సేకరిస్తోంది. ఈ దాడికి ముందు కపిల్ శర్మ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయా..డబ్బులుఏమైనా డిమాండ్ చేశారా అన్న అంశాన్ని కూడా పోలీసులుఆరా తీస్తున్నారు.





















