By: Ram Manohar | Updated at : 22 May 2023 04:24 PM (IST)
కేరళలో ఓ లోకోపైలట్ స్టేషన్‌లో ట్రైన్‌ని ఆపకుండా ముందుకెళ్లిపోయి కాసేపటికి మళ్లీ వెనక్కి వచ్చాడు.
Train Misses Station:
కేరళలో ఘటన..
రైల్వే స్టేషన్‌లో జనాలు కిక్కిరిసి ఉన్నారు. మరికాసేపట్లో వాళ్లు ఎక్కాల్సిన ట్రైన్ వచ్చేస్తుంది. సామాన్లన్నీ సర్దుకుని ఎదురు చూస్తున్నారు. దూరంలో హార్న్ వినిపించింది. వెంటనే అలెర్ట్ అయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఆ ట్రైన్ ప్లాట్‌ఫామ్‌పై ఆగలేదు. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముందుకు వెళ్లిపోయింది. ప్యాసింజర్స్‌కి ఏమీ అర్థం కాలేదు. కాసేపు అంతా అయోమయం అయ్యారు. ట్రైన్ ఎందుకు ఆగలేదు అని ఆరా తీయడం మొదలు పెట్టారు. కొంత సేపు అక్కడ గందరగోళం నెలకొంది. కాసేపటి తరవాత మళ్లీ ట్రైన్ హార్న్ వినిపించింది. అంతా అటు వైపు చూశారు. అంతకు ముందు ప్లాట్‌ఫామ్‌పై ఆగకుండా ముందుకెళ్లిపోయిన ట్రైన్ తిరిగి వచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అందరూ ట్రైన్ ఎక్కారు. ఈ వింత ఘటన కేరళలోని అలప్పుజ జిల్లాలో జరిగింది. వేనాడ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ చెరియనాడ్ అనే రైల్వే స్టేషన్‌లో ఆగాల్సి ఉంది. కానీ...లోకోపైలట్ ఆ విషయమే మర్చిపోయాడు. స్టేషన్ వచ్చినా కూడా చూసుకోకుండా అలాగే ముందుకు వెళ్లిపోయాడు. దాదాపు 700 మీటర్ల వరకూ ట్రైన్‌ని అలాగే తీసుకెళ్లిపోయాడు. ప్లాట్‌ఫామ్‌పై ఎదురు చూస్తున్న ప్యాసింజర్స్ ఏమవుతుందో అర్థం కాక ఉండిపోయారు.
స్టేషన్ మాస్టర్ లేడట..
ఉదయం 7.45 నిముషాలకు అక్కడ ఆగాల్సి ఉంది. అయితే...ముందుకు వెళ్లిపోయిన తరవాత లోకోపైలట్ అలెర్ట్ అయ్యాడు. "అరెరే స్టేషన్ మర్చిపోయినట్టున్నానే" అని నాలుక కరుచుకున్నాడు. వెంటనే ట్రైన్‌ని వెనక్కి తిప్పాడు. ప్యాసింజర్స్‌ని ఎక్కించుకుని కరెక్ట్ టైమ్‌కే డెస్టినేషన్‌లో దింపాడు. దీనిపై రైల్వే అధికారులు స్పందించారు. చెరియనాడ్ స్టేషన్ వద్ద స్టేషన్ మాస్టర్ లేరని, సిగ్నల్ సిస్టమ్ కూడా లేదని చెప్పారు. అందుకే లోకోపైలట్ కన్‌ఫ్యూజ్ అయ్యి ముందుకు స్టేషన్‌ని స్కిప్ చేసి ఉంటాడని వివరించారు. ఏదేమైనా లోకోపైలట్ నుంచి వివరణ కోరినట్టు వెల్లడించారు.
వాటర్ మెట్రో
ఇటీవలే కేరళలోని కొచ్చిలో వాటర్ మెట్రో (Water Metro Project)ని దేశానికి అంకితం చేశారు ప్రధాని మోదీ. భారత్‌లో ఇదే తొలి వాటర్ మెట్రో. కేరళలోని నగరాల మధ్య రవాణాను మరింత సులభతరం చేయనున్నాయి ఈ వాటర్ మెట్రో సర్వీస్‌లు. సాధారణ మెట్రో రైళ్లో ప్రయాణం ఎంత సౌకర్యంగా ఉంటుందో...ఇందులోనూ అంతే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. మెట్రో సర్వీస్‌లను దేశవ్యాప్తంగా పెంచాలన్నది మోదీ సర్కార్ లక్ష్యం. అయితే...కొన్ని చోట్ల ఆ సేవల్ని అందించేందుకు భౌగోళికంగా ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో ఈ సమస్య ఎదురైంది. అందుకే...మెట్రో అంటే కేవలం ఒకే డిజైన్‌లో ఎందుకుండాలి..? నీళ్లపైనా నడిచేలా రూపొందించలేమా..? అన్న ఆలోచన తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే చాలా డిజైన్‌లు పరిశీలించి చివరకు ఈ వాటర్ మెట్రోని తీసుకొచ్చారు. మెట్రో కనెక్టివిటీని పెంచేందుకు ఇలా వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. సాధారణ మెట్రోకి దీనికి గల తేడా ఏమిటో అధికారులు వివరిస్తున్నారు. ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ని "Metro Lite"గా పిలుస్తున్నారు.
ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సీటింగ్‌ని డిజైన్ చేశాం. నీళ్లపై నడిచే మెట్రో కాబట్టి సేఫ్‌టీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నాం. పంక్చువాలిటీ విషయంలోనూ కచ్చితంగా ఉంటుంది. పైగా ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ కూడా.
- అధికారులు, వాటర్ మెట్రో ప్రాజెక్ట్
Also Read: నలుగురు భార్యలతో మస్క్ మామ ఫొటో షూట్, తప్పులో కాలేయకండి - ఇక్కడో ట్విస్ట్ ఉంది
TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!
France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు
RBI: రెపో రేటు మారలేదు, రియల్ ఎస్టేట్‌కు ఆర్‌బీఐ ఇచ్చిన వరమా ఇది?
KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్
Indira Gandhi Assassination: ఇందిరా గాంధీ హత్యోదంతంపై కెనడాలో వేడుకలు, వార్నింగ్ ఇచ్చిన జైశంకర్
Steve Smith: టెస్టు ఛాంపియన్ ఫైనల్లో స్మిత్ సెంచరీ - మాథ్యూ హేడెన్ రికార్డు బద్దలు!
YSRCP News : రిలాక్స్ అయింది చాలు - పార్టీ అనుబంధ సంఘాలకు విజయసాయిరెడ్డి క్లాస్ !
అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్
Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?