Sabarimala Darshan: శబరిమల అయ్యప్ప రికార్డ్- మూడు రోజుల్లో 3 లక్షల మందికి దర్శనం!
Sabarimala Darshan: శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. వరుసగా మూడు రోజుల్లో మూడు లక్షల మంది దర్శనానికి బుకింగ్ చేసుకున్నారు.
Sabarimala Darshan: ప్రముఖ అయ్యప్ప పుణ్యక్షేత్రం శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఒక్కరోజే సుమారు లక్ష మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. పైగా సోమవారం నాడు స్వామి వారి దర్శనానికి 1,07,260 మంది భక్తులు బుకింగ్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఇది రికార్డ్ బ్రేకింగ్ బుకింగ్ అని అధికారులు తెలిపారు.
సౌకర్యాలు
ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపడుతున్నారు. అయ్యప్ప దర్శనం కోసం బుకింగ్స్ లక్ష దాటడం ఈ సీజన్‌లో ఇది రెండోసారి. శనివారం కూడా రద్దీకి తోడు వర్షం కురవడంతో.. భక్తులు ఎటూ కదిలే దారి లేక పంపానది నుంచి సన్నిధానం వరకు క్యూలైన్లలో ఎక్కడివారు అక్కడే తడిసి ముద్దయ్యారు. రద్దీ నియంత్రణలో పోలీసులకు గాయాలయ్యాయి. శని, ఆదివారాలు వరుసగా లక్ష మందికి పైగా అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.
A large number of devotees throng #SabarimalaTemple in #Kerala, to offer prayers.
— The Times Of India (@timesofindia) December 12, 2022
As per temple officials, 1,07,260 devotees have booked darshan timings for today. pic.twitter.com/FbRY4X1aub
హైకోర్టు
అధిక రద్దీ కారణంగా ఆలయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కేరళ హైకోర్టు ఆదివారం అత్యవసర విచారణ జరిపింది. ఇంతలా రద్దీ పెరిగితే నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించింది. మరో గంట పాటు దర్శన వేళలను పొడిగించమని సూచించింది.
ఈ అంశంపై దేవస్థానం ప్రధాన తంత్రితో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని అధికారుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై సోమవారం సాయంత్రం అసెంబ్లీ హాలులో సీఎం అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష జరగనుంది. అదనపు భద్రతా చర్యలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు.
Also Read: Watch Video: స్టీరింగ్ గాలికొదిలేసి కదులుతున్న కారులో పేకాట- వైరల్ వీడియో!