Karnataka Minister: మంత్రి గారు మాస్కు పెట్టుకోరట..! మోదీ వద్దన్నారట!
మాస్కు పెట్టుకోకుండా కనిపించిన ఓ మంత్రి గారిని.. మీడియా ప్రశ్నించింది. దానికి ఆయన చెప్పిన సమాధానం విని షాకైంది. ఆయన ఎవరో మీరే చూడండి.
ఓవైపు ప్రభుత్వాలు, మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ప్రతిరోజూ మాస్కులు పెట్టుకోవాలని చెబుతూనే ఉన్నాయి. కానీ చాలా మంది నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. ఇంత జరుగుతున్నా నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఓ మంత్రిగారు ఏకంగా మాస్కుతో పనేముంది అంటున్నారు. మాస్కు తప్పనిసరి కాదని ప్రధాని మోదీ చెప్పారని సమర్థించుకున్నారు. అవును ఆయన ఎవరో మీరే చూడండి.
కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఉమేశ్ కత్తి.. అటవీ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. మాస్కు లేకుండానే అక్కడికి వెళ్లారు. దీనిపై విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆయన ఇలా సమాధానమిచ్చారు.
#COVID19
— Kiran Parashar (@KiranParashar21) January 18, 2022
"Our @PMOIndia yesterday night said that there won't be any restrictions imposed.Wearing a mask is an individual's responsibility. It is left to the individual to decide. I dont feel like wearing,so I am not wearing." : #BJP Minister Umesh Katti@IndianExpress pic.twitter.com/9VeOS5kw6u
భారీగా కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కి చేరింది. మరోవైపు రోజువారి కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 2,82,970 కరోనా కేసులు నమోదుకాగా 441 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చెరింది. మంగళవారంతో పోలిస్తే కేసుల సంఖ్య 18 శాతం పెరిగింది.
1,88,157 మంది తాజాగా కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 4.83గా ఉంది.