By: Ram Manohar | Updated at : 03 Mar 2023 03:01 PM (IST)
కర్ణాటక హిజాబ్ అంశాన్ని విచారించేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
Karnataka Hijab Ban:
ప్రత్యేక ధర్మాసనం..
కర్ణాటక హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యా సంస్థల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం. ముగ్గురు జడ్జ్‌లతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆ ధర్మాసనమే ఈ అంశంపై విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేపీ పర్దివాలా ధర్మాసనం ఈ విషయం తెలిపింది. ఓ మహిళా న్యాయవాది ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరగా...ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే పరీక్షలు జరగనున్నాయని, హిజాబ్ ధరించి ఎగ్జామ్‌లు రాయడానికి అనుమతించకపోతే వాళ్లు ఓ అకాడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వస్తుందని వివరించారు పిటిషనర్. అయితే...హోళీ పండుగ తరవాత ఈ అంశంపై విచారణ చేపడతామని చెప్పారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. పిటిషనర్ మాత్రం మరో 5 రోజుల్లో పరీక్షలున్నాయని వివరించారు. "ఇప్పటికే ఓ ఏడాది కోల్పోయారు. మరింత ఆలస్యమైతే మరో ఏడాది కూడా కోల్పోయే ప్రమాదముంది" అని చెప్పారు. ఆ తరవాతే చంద్రచూడ్ ముగ్గురు సభ్యులతో బెంచ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అయితే...ఎప్పుడు అన్నది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
Hijab row: SC assures petitioner to constitute bench, hearing expected after Holi vacation
Read @ANI Story | https://t.co/oJIXZoylm6#Hijabrow #SupremeCourt #Karnataka pic.twitter.com/JQ2gxUL4JL — ANI Digital (@ani_digital) March 3, 2023
పరీక్షల సంగతేంటి..?
విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడానికి వీల్లేదని గతంలోనే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ ధరించిన వారిని అనుమతించడం లేదు. మార్చి 9 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ క్రమంలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించే ఎగ్జామ్స్ రాస్తామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు అనుమతించడం లేదు. గతేడాది మార్చి 15వ తేదీన కర్ణాటక హైకోర్టు హిజాబ్‌ను అనుమతించాలని వేసిన పిటిషన్‌లన్నింటినీ కొట్టి పారేసింది. తరగతి గదులు మతపరమైన విధానాలు పాటించేందుకు వేదిక కావని తేల్చి చెప్పింది. ఆ తరవాతే ఈ వివాదం సుప్రీం కోర్టు గడప తొక్కింది. కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హిజాబ్ వివాదంపై రెండు వర్గాల విద్యార్థులు పోటాపోటీగా నిరససలు చేశారు. ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించి రావడాన్ని వ్యతిరేకిస్తూ హిందూ విద్యార్థులు కాషాయ కండువాలతో విద్యా సంస్థలకు హాజరుకావడంతో వివాదం రాజుకుంది. కర్ణాటక ఉడిపి జిల్లాలో ఓ ప్రభుత్వ కాలేజీలో మొదలైన ఈ వివాదం క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్ అనేది ముస్లిం ఆచారాల్లో తప్పనిసరి కాదంటూ తీర్పు చెప్పింది. విద్యార్థులు హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు రావడాన్ని తప్పుపట్టింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును కొట్టివేయాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: Anurag Thakur: పెగాసస్ ఫోన్‌లో కాదు ఆయన బ్రెయిన్‌లో ఉంది, రాహుల్‌పై కేంద్రమంత్రి సెటైర్
APPGECET 2023 Application: ఏపీ పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Perni Nani On Chandrababu : చంద్రబాబు విజయ రహస్యం కొనడం, అమ్మడం- పేర్ని నాని సెటైర్లు
Nagaland Minister Tweet: నేనేం నిద్రపోవడం లేదు, జస్ట్ మొబైల్ చూసుకుంటున్నా - నాగాలాండ్ మంత్రి ఫన్నీ ట్వీట్
Breaking News Live Telugu Updates: పోలవరం ప్రాజెక్టు సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Rapaka Varaprasad: నేను దొంగ ఓట్ల వల్లే గెలిచా, ఒక్కొక్కరు 10 దాకా ఫేక్ ఓట్లేశారు - ఎమ్మెల్యే రాపాక
HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!
కన్నా విందు భేటీలో రాయపాటి ఫ్యామిలీ- మారుతున్న గుంటూరు రాజకీయం!
TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?