Karnataka Election Results 2023: కన్నడిగులు కాంగ్రెస్‌ని నమ్మడానికి కారణాలేంటి? ఆ హామీలే గెలిపించాయా?
Karnataka Election Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణాలివే.
Karnataka Election Results 2023:
కాంగ్రెస్ సక్సెస్..
కర్ణాటక ఎలక్షన్ విన్నర్ కాంగ్రెస్ అని దాదాపు తేలిపోయింది. భారీ లీడ్‌లో దూసుకుపోతోంది ఆ పార్టీ. 38 ఏళ్ల ట్రెండ్‌ని కొనసాగిస్తూ కన్నడిగులు ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్‌కి అవకాశమిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 సీట్లు వచ్చాయి. ఈ సారి మాత్రం భారీగా పడిపోయాయి. గత ఎన్నికల్లో 78 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్..ఈ సారి అందుకు రెట్టింపు సీట్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇందుకు కారణాలేంటి..? కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కి ఎందుకు అంత బలంగా నమ్మారు..? కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలకు అంతగా నచ్చిందా..? ఆ కారణాలేంటో ఓ సారి చూద్దాం.
కారణాలివే..
40% కమీషన్ ప్రభుత్వం..
కర్ణాటక బీజేపీ అవినీతిమయం అంటూ ప్రచారం చేయడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ముఖ్యంగా ప్రభుత్వం ఏ పని చేసినా అందులో 40% కమీషన్ తీసుకుంటుందని గట్టిగానే క్యాంపెయిన్ చేసింది. బసవరాజు బొమ్మైపైనా "40% కమీషన్ సీఎం" అని కౌంటర్‌లు వేసింది. కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి కార్యకర్తల వరకూ ఇదే స్టాండ్‌పై ప్రచారం సాగించారు. అంతే కాదు. రాష్ట్రంలో లంచగొండితనం ఏ రేంజ్‌లో ఉందో చెబుతూ కొన్ని లిస్ట్‌లు కూడా విడుదల చేసింది. న్యూస్‌పేపర్లలో లోకల్ ఎడిషన్‌లలో అవి పబ్లిష్ చేసేలా ప్లాన్ చేసుకుంది. అవినీతి ఆరోపణలను బీజేపీ కొట్టి పారేసినప్పటికీ..ఆ ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే పడింది.
5 హామీలు
కాంగ్రెస్ 5 హామీలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసింది. ఎన్నికల ప్రచారంలో వీటి గురించి బాగా ప్రచారం చేసుకుంది. గృహ జ్యోతి యోజనలో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్ ఇస్తామని ప్రకటించింది. గృహ లక్ష్మి యోజన కింద కుటుంబంలోని ఒక్కో మహిళకు రూ.2 వేలు ఇస్తామని చెప్పింది. అంతే కాదు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్ సర్వీస్‌లనూ అందిస్తామని హామీ ఇచ్చింది. యూత్‌ని టార్గెట్ చేస్తూ...గ్రాడ్యుయేట్ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పింది. ఈ హామీలు...ఓట్ల వర్షం కురిపించాయి. అయితే...ఇవే హామీలను ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు. "ఉచిత హామీలు హానికరం" అంటూ విమర్శించారు.
యూనిటీ..
సాధారణంగా కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కామన్. ఈ కారణంగానే ప్రభుత్వాలనూ అధికారాన్నీ చేజార్చుకుంది. రాజస్థాన్‌లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది. కానీ...ఆ ప్రభావం కర్ణాటకపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంది హైకమాండ్. సిద్దరామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకుండా అప్రమత్తమైంది. ప్రతిసారీ వీళ్లిద్దరూ కలిసి ప్రచారం చేసేలా ప్లాన్ చేసింది. ఎలాంటి అంతర్గత కలహాలు లేవన్న సంకేతాలిచ్చింది. ఇద్దరి లీడర్ల ఇంటర్వ్యూలు విడుదల చేసింది.
అగ్రెసివ్ ప్రచారం..
ప్రచారం విషయంలో చాలా అగ్రెసివ్‌గా దూసుకుపోయింది కాంగ్రెస్. అటు బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగి క్యాంపెయిన్ చేసినప్పటికీ...అదే స్థాయిలో రాహుల్ ప్రచారం చేశారు. చాలా రోజుల తరవాత సోనియా గాంధీ కూడా ప్రచార సభలో పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా ప్రచార తారగా మెరిశారు. 15 రోజుల్లోనే మల్లికార్జున్ ఖర్గే 32 ర్యాలీలు చేపట్టారు. స్థానిక సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. బజ్‌రంగ్ దళ్ వివాదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూసినా అది వర్కౌట్ కాలేదు. ఇక కీలక బీజేప నేతల్ని తమ వైపు మళ్లించుకోవడంలోనూ సక్సెస్ అయింది కాంగ్రెస్.
Also Read: Karnataka Election Results 2023: విద్వేషంతో కాదు ప్రేమతో గెలిచాం, ఇది పేద ప్రజల విజయం - రాహుల్ గాంధీ