Pakistan New CJI: పాకిస్థాన్ చరిత్రలో తొలి మహిళా సీజే... ప్రధాన న్యాయమూర్తిగా అయేషా మాలిక్ పేరు నామినేట్
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఒక మహిళ ఎంపిక కానున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ముషీర్ తర్వాత సీజేగా అయేషా మాలిక్ పేరును నామినేట్ చేశారు.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తొలిసారి ఓ మహిళ ఎంపిక కాబోతున్నారు. ప్రస్తుతం చీఫ్ జస్టిస్‌గా ఉన్న ముషీర్ ఆలం పదవీ కాలం ఆగస్టు 17తో ముగుస్తోంది. తదుపరి సీజేగా ఆయన జస్టిస్ అయేషా మాలిక్ పేరును ప్రభుత్వానికి ప్రతిపాదించారు. పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకూ మహిళలు ఎంపిక కాలేదు. దీంతో జస్టిస్ అయేషా మాలిక్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. జస్టిస్ ఆలమ్ సిఫారసు మేరకు న్యాయ కమిటీ అయేషా మాలిక్ పేరును అత్యున్నత న్యాయస్థానానికి జడ్జిగా నియమించనుంది.
Also Read: జయహో భారత్.. ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి
2012లో హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు
మాలిక్ ప్రస్తుతం లాహోర్ హైకోర్టులో బాధ్యతలు నిర్వహిస్తోన్నారు. సీనియారిటీ జాబితాలో అయేషా మాలిక్ నాలుగో స్థానంలో ఉంది. అయేషా మాలిక్ 1997లో న్యాయవాద వృత్తిని మొదలుపెట్టారు. 2001 వరకు ఆమె కరాచీలో ఉన్న న్యాయసేవా సంస్థలో పనిచేశారు. లాహోర్‌లో ఉన్న పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా నుంచి ఆమె న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. అనంతరం లండన్‌లోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా స్కూల్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. 2012 మార్చిలో అయేషా మాలిక్ లాహోర్ హైకోర్టులో న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు.
Also Read: భార్యతో బలవంతపు శృంగారం చట్టవిరుద్ధం కాదు.. ముంబై ఫ్యామిలీ కోర్టు తీర్పు
IAWJలోనూ సభ్యత్వం
అయేషా మాలిక్ తన ప్రైమరీ విద్యను పారిస్, న్యూయార్క్ లోని పాఠశాలలో పూర్తి చేశారు. లండన్‌లోని ఫ్రాన్సిస్ హాలండ్ బాలికల స్కూల్ లో ఎ-లెవల్స్ పూర్తి చేశారు. 2019లో ఏర్పాటు చేసిన మహిళా న్యాయమూర్తుల రక్షణ కమిటీకి మాలిక్ అధ్యక్షురాలిగా పనిచేశారు. జిల్లా కోర్టులలో మహిళా న్యాయమూర్తుల పట్ల పురుష న్యాయవాదుల చేష్టలకు వ్యతిరేకంగా ఈ ప్యానెల్ ను రూపొందించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జీస్ లో సైతం అయేషా మాలిక్ కు సభ్యత్వం ఉంది. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం మహిళలకు సమానత్వం, న్యాయ సదుపాయాలు కల్పించడం ద్వారా మహిళా సాధికారత సాధించడం, ఇందుకోసం ఈ సంస్థ కృషి చేస్తోంది.
Also Read:అఫ్గాన్‌లో మహిళల పరిస్థితి మరింత దారుణం... బలప్రయోగంతో అధికారం సాధ్యం కాదన్న యూఎన్ చీఫ్
కన్యత్వ పరీక్షలపై సంచలన తీర్పు
2021 జనవరిలో మహిళల కన్యత్వ పరీక్షలపై జస్టిస్ అయేషా మాలిక్ సంచలన తీర్పు ఇచ్చారు. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి చేసే పరీక్షలను ఆమె చట్టవిరుద్ధమని ప్రకటించారు. ఇలాంటి దారుణాలు పాకిస్థాన్ రాజ్యాంగానికి వ్యతిరేకమైనవని పేర్కొన్నారు. గత ఏడాది జూన్‌లో ఈ పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న జస్టిస్ అయేషా మాలిక్ సింగిల్ బెంచ్ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది.
Also Read: Twitter India: ట్విట్టర్ ఇండియా బాస్ బదిలీ.. నెక్ట్స్ వచ్చేదెవరు? ఇప్పుడే మార్చడానికి కారణాలేంటి?