News
News
X

Jodhpur News: కన్నతండ్రిని కర్రతో చావబాదిన కుమారుడు- వైరల్ వీడియో!

Jodhpur News: వృద్ధ తండ్రిని కుమారుడు చావబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

Jodhpur News: రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. జోధ్‌పుర్‌ నగరంలోని ఓ కుమారుడు ఎలాంటి కనికరం లేకుండా వృద్ధుడైన కన్నతండ్రిని కర్రతో కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ జరిగింది

జోధ్‌పుర్‌ నగరానికి చెందిన తండ్రీ కొడుకు మధ్య ఏదో వివాదం వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కుమారుడు వీధిలో ఉన్న కర్రను తీసుకొని కన్నతండ్రిని కనికరం లేకుండా కొట్టాడు. వృద్ధుడైన తండ్రి బాధతో విలపిస్తున్నా వదలకుండా కుమారుడు చావబాదాడు. చుట్టుపక్కల వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కుమారుడు వదల్లేదు.

అయినా కుమారుడు ఇరుగుపొరుగు వారికి దూరంగా వెళ్లి తన వృద్ధ తండ్రిని మళ్లీ  కొట్టాడు. తండ్రిని కుమారుడు కొడుతున్న ఈ వీడియోను అక్కడున్న వారు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అరెస్ట్

ఈ ఘటన జోధ్‌పుర్‌ నగరంలోని రతనాడ పోలీస్‌స్టేషన్ స్టేషన్ పరిధిలో జరిగింది. వీడియోలోని యువకుడు తన తండ్రిపై దాడి చేయడం ఇదే మొదటిసారి కాదని పోలీసులు చెప్పారు.

" ఈ ఘటనకు ఒకరోజు ముందు ఆ వ్యక్తి తన తండ్రితో అనుచితంగా ప్రవర్తించినట్లు మాకు ఫిర్యాదు అందింది. తండ్రిని కొట్టిన నిందితుడిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 కింద అరెస్టు చేశాం. ఆయనకు కౌన్సిలింగ్ ఇస్తాం. కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు చేస్తున్నాం.                           "
-జోధ్‌పుర్ పోలీసులు 

మరో ఘటన

చిన్నతనం నుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రిపై కనికరం లేకుండా కుమారులు దాడి చేస్తోన్న ఘటనలు కొత్తేం కాదు. గతంలో  మద్యానికి బానిసైన ఓ వ్యక్తి కన్న తండ్రిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మద్యం తాగొద్దని మందలించాడనే కోపంతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు కుమారుడు. చెడు అలవాట్లకు బానిస కావద్దని వారించిన తండ్రినే చంపాలని యత్నించాడు.

Also Read: Uttar Pradesh News: బాత్రూమ్‌లో భోజనాలు- కబడ్డీ ప్లేయర్లకు ఘోర అవమానం!

Also Read: Delhi Crime: కోడలు పాడు పని! అత్తామామల న్యూడ్ వీడియోలు రికార్డ్ - వాటితో కన్నింగ్ స్కెచ్!

Published at : 20 Sep 2022 11:20 AM (IST) Tags: Viral video Jodhpur man caught on camera mercilessly beating elderly father

సంబంధిత కథనాలు

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

Nagababu On Garikapati : క్షమాపణ చెప్పించుకోవాలని కాదు, గరికపాటిపై నాగబాబు మరో ట్వీట్

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 7 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

AILET 2023: నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశాలకు నోటిఫికేషన్ - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

Chandragiri Crime : ప్రేమ పెళ్లి ఇష్టం లేక యువకుడి ఇల్లు ధ్వంసం, తలుపులు పగలగొట్టి కూతురి కిడ్నాప్!

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

రాజీనామా చేసి విశాఖ రాజధాని కోసం ఉద్యమిస్తాను: ధర్మాన ప్రసాదరావు

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

కార్లకు ఐరన్ బంపర్ గార్డ్స్ పెట్టుకోవడం తప్పు అని మీకు తెలుసా? ఇన్సూరెన్స్ కూడా రాదు!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?