I Phone Prices : ఇక అమెరికా కంటే ఇండియాలోనే ఐ ఫోన్లు తక్కువ - ట్రంప్ దెబ్బకు అన్నీ మారిపోతున్నాయిగా!
iPhones: ట్రంప్ టారిఫ్‌ల కారణంగా అమెరికా కన్నా ఇండియాలోనే ఐ ఫోన్లు తక్కువ ధరలకు లభించనున్నాయి. మేడిన్ ఇండియా ఐ ఫోన్లు కూడా ఎక్కువ కావడంతో భారత్ పై టారిఫ్ ప్రభావం ఉండకపోవచ్చంటున్నారు.

iPhones to be cheaper in India: అమెరికాలో తెలిసిన వాళ్లు ఉంటే.. ఐ ఫోన్ తెస్తావా అని అడగడం కామన్. ఇక నుంచి అలా అడగలేరు. ట్రంప్ రాక ముందు. పన్నులు వేయక ముందు ఐ ఫోన్ రేట్లు అక్కడ తక్కువే. కానీ ఇప్పుడు పన్నులు వేసిన తర్వాత ఐ ఫోన్ సహా అమెరికన్లు వాడే అత్యధిక గాడ్జెట్లు భారీగా రేట్లు పెరగనున్నాయి.
యాపిల్ అమెరికా కంపెనీనే కానీ యాపిల్ తయారీలో మాత్రం అమెరికాలో ఉండదు. చైనా, తైవాన్, ఇండియా లాంటి దేశాల్లో ఉత్పత్తి అవుతాయి. అంటే మేడిన్ వియత్నాం, తైవాన్, చైనా, ఇండియా ఫోన్లు అమెరికాలో అమ్ముతారు. ఇప్పుడు ట్రంప్ అన్నిదేశాలపై పన్నులు పెంచారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ప్రకటించిన "రెసిప్రొకల్ టారిఫ్‌లు" చైనా, ఇండియా, వియత్నాం వంటి దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై గణనీయమైన సుంకాలను విధించారు. దీని ప్రభావం ఐఫోన్ ధరలపై కూడా పడటం ఖాయమే.
అమెరికాలో చైనా నుండి దిగుమతి అయ్యే ఐఫోన్‌లపై 54 శాతం టారిఫ్ విదించారు. అలాగే ఇండియా నుండి 26 శాతం, వియత్నాం నుండి 46 శాతం సుంకం విధించారు. ఈ టారిఫ్‌ల కారణంగా ఐఫోన్ ధరలు అమెరికాలో గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక iPhone 16 ప్రస్తుతం 799 డాలర్లు నుండి ప్రారంభమవుతుంది. ధర 43 శాతం పెరిగితే సుమారు 1,142 డాలర్లు అవుతుంది. అంటే దాదాపుగా లక్షల రూపాయలు. అయితే అమ్మకాలు తగ్గిపోతాయన్న కారణంగా యాపిల్ లాభాలు తగ్గించుకుని పన్నుభారాన్ని కొంత తాను మోస్తే కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ రేట్లు పెరగడం మాత్రం ఖాయం.
ఇండియాలో ఐఫోన్ ధరలు సాధారణంగా అమెరికా కంటే ఎక్కువగా ఉంటాయి. 18 శాతం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వసూలుచేస్తారు. దిగుమతి సుంకాలు కూడా ఉంటాయి. కానీ ఆపిల్ ఇప్పుడు ఇండియాలో iPhone 16 సిరీస్ వంటి కొన్ని మోడల్‌లను ఇండియాలోనే తయారు చేస్తోంది. దీనివల్ల దిగుమతి సుంకాల భారం ఉండదు. iPhone 16 ఇండియాలో ఇప్పుడు అమెరికా రేటు కన్నా ఎక్కువ..కానీ టారిఫ్‌ల తర్వాత అమెరికా ధరలు దీన్ని మించిపోవడం ఖాయం.
టారిఫ్‌లు పెంచిన తర్వాత అమెరికాలో ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగితే, ఇండియాలోని ధరలు మెరికా కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇండియాలో ఉత్పత్తి సామర్థ్యం ఎంత వేగంగా పెరుగుతుంది రూపాయి-డాలర్ మారకం రేటు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. తైవాన్ నుంచి ఎక్కువగా అమెరికాలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఎగుమతి అవుతాయి. ఇది అక్కడి ప్రజల పై ఎక్కువ ప్రభావం చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఖర్చును తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇది అమెరికాను సంక్షోభంలోకి నెట్టేస్తుదంన్న ఆందోళన వినిపిస్తోంది. కానీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

