అన్వేషించండి

Viral News: ఆ బాడీగార్డ్‌కు సీఈఓలను మించిన వేతనం- కింగ్‌ కోహ్లీ సెక్యూరిటీ గార్డ్ గురించి ఆసక్తికర విషయాలు

Kohli Bodyguard: విరుష్క జోడీతో పాటు వారి సెక్యూరిటీ గార్డు కూడా చాలా ప్రత్యేకం.ఏళ్లుగా వారిని కాపుకాస్తున్న సోనూ గురించి తెలుసుకుంటే కింగ్ కోహ్లీ సెక్యూరిటీ గార్డు అంటే ఆ మాత్రం ఉంటదిగా అనాల్సిందే.!

Interesting things about Virushka Bodyguard: కింగ్ కోహ్లీ, అనుష్క జంటకు కొన్నేళ్లుగా సోనూ అనే వ్యక్తి బాడీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అనుష్కతో మొదలైన అతడి ప్రయాణం, విరుష్క జోడీకి ఇప్పుడు ఆ ఇద్దరి గారాల పిల్లల వరకు కొనసాగుతూ వస్తోంది. విరుష్క జోడీ సోనూకి ఏడాదికి జీతం కోటీ 20 లక్షల రూపాయలు ఇస్తుంది. దేశంలోని చాలా కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్‌కు కూడా ఈ స్థాయి వేతనాలు లేవు.

సోనూ సింగ్ అంటే కింగ్‌ కోహ్లీకి, అనుష్కకు ప్రత్యేక అభిమానం:

కింగ్ కోహ్లీ, అనుష్క శర్మ వేర్వేరు రంగాల్లో సెలబ్రిటీలు. క్రికెటర్‌గా విరాట్ ప్రపంచాన్ని ఏలుతుంటే, అతడి సతీమణి అనుష్క శర్మ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వేర్వేరు రంగాలకు చెందిన వీళ్లు ప్రేమ వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఆ జోడీని వాళ్ల ఫ్యాన్స్ విరుష్క జోడీ అని ముద్దుగా పిలుచుకుంటారు. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా ఇట్టే వైరల్ అవుతుంది. విరుష్క జోడీ ఎక్కడికి వెళ్లినా వారికి భారీగా అభిమానుల తాకిడి ఉంటుంది. అయితే అభిమానుల కారణంగా ఎప్పుడూ ఆ జోడీ ఏ ఇబ్బంది ఎదుర్కోలేదు. కారణం సోనూ. ఈ జోడీ పర్సనల్ బాడీ గార్డ్‌. విరుష్క జోడీని కంటి రెప్పలా కాపు కాస్తున్న సోనూ పేరు ప్రకాశ్ సింగ్‌. కొన్నేళ్లుగా విరుష్క జోడీకి ఇతడు బాడీగార్డ్‌గా ఉండగా అతడ్ని విరాట్‌, అనుష్క శర్మ ఇద్దరూ తమ కుటుంబ సభ్యునిగానే చూస్తారు. అతడి పుట్టిన రోజులు జరిపి మరీ తమ అభిమానం ప్రదర్శిస్తుంటారు. 2018లో జీరో సినిమా సెట్‌లో అనుష్క, సోనూ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన పిక్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.

ముందు అనుష్క శర్మకు బాడీగార్డ్‌గా వచ్చి ఇప్పుడు కుటుంబం మొత్తానికి:

అనుష్క శర్మకు మొదటి నుంచి సోనూ బాడీగార్డ్‌గా ఉన్నాడు. ఆ తర్వాత ఓ షాంపూ షూటింగ్‌లో కోహ్లీ, అనుష్మ శర్మ మొదటి సారి కలుసుకొని ఫ్రెండ్‌ షిప్‌ చేశారు. అది కాస్తా డేటింగ్‌ లవ్‌ వరకు కొనసాగి 2017 డిసెంబర్‌లో ఈ జంట ఒక్కటైంది. వీరి పెళ్లి అయినప్పటి నుంచి అనుష్క శర్మతో పాటు కోహ్లీకి కూడా సోనూనే బాడీగార్డ్‌గా ఉంటున్నారు. విరుష్క జంటకు 2021లో పాప పుట్టింది. ఆమెకు వామిక అనే పేరు పెట్టారు. వామిక కడుపులో ఉన్న సమయంలో అనుష్క శర్మ ఎప్పుడైనా బయటకి వెళితే పక్కనే సెక్యూరీటీ గార్డ్‌ సోనూ కూడా ఉండే వాడు. వామిక పుట్టిన మూడేళ్ల తర్వాత కోహ్లీ- అనుష్క శర్మ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

ఈ లిటిల్‌ కింగ్‌ అకాయ్‌కు కూడా సోనూనే సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్నాడు. ఇంతగా విరుష్క కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సోనూకు భారీ మొత్తంలోనే వార్షిక జీతాన్ని ఇస్తున్నారు కోహ్లీ దంపతులు. ఏడాదికి కోటీ 20 లక్షల రూపాయలు జీతంగా సోనూకి అందుతోంది. దేశంలోని చాలా కంపెనీల సీఈఓలతో పోల్చితే విరాట్ సెక్యూరిటీ గార్డుకే అధిక వేతనం అందుతోంది.

Also Read: Kanpur Test Match: కాన్పూర్ వేదిక సాగుతున్న బంగ్లాదేశ్, భారత్ టెస్టు మ్యాచ్‌లో ఆడుకుంటున్న వరుణుడు- రెండో రోజు ఆట రద్దు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget