అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మృతి, వరుస ఘటనలతో ఇండియన్స్‌లో టెన్షన్
Indian Student Dies: అమెరికాలోని ఒహియోలో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు.
Indian Student Dies in Ohio: అమెరికాలో వరుసగా భారతీయులపై దాడులు, హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. కొందరు ప్రమాదాల బారిన ప్రాణాలు కోల్పోతుంటే మరి కొందరు దాడులకు గురై చనిపోతున్నారు. ఇప్పుడు మరో భారతీయ విద్యార్థి మృతి చెందడం సంచలనమవుతోంది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ ఈ విషయాన్ని వెల్లడించింది. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్టు తెలిపింది. ఒహియోలోని భారతీయ విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మృతి దిగ్భ్రాంతి కలిగించిందని X వేదికగా పోస్ట్ పెట్టింది. భారత్‌లోని మృతుని కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్టు స్పష్టం చేసింది. అవసరమైన సాయం అందించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్టు వివరించింది. మృతికి కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆరుగురు భారతీయులు రకరకాల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా...అక్కడి భారతీయులు ఆందోళన చెందుతున్నారు. గత నెల భారత్‌కి చెందిన ఓ క్లాసికల్ డ్యాన్సర్ అమర్‌నాథ్ ఘోష్ హత్యకు గురయ్యాడు. అంతకు ముందు 23 ఏళ్ల విద్యార్థి ఓ పార్క్‌లో శవమై కనిపించాడు. ఇలా వరుస ఘటనలతో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అటు భారత్ కూడా ఈ ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio.
— India in New York (@IndiainNewYork) April 5, 2024
Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India.
All possible assistance is being extended including to transport…