అన్వేషించండి

Indian Railway Rules: వేరే కోచ్‌లో ఎక్కి టీటీఈకి దొరికిపోతే ఏం చేస్తారు ? మీ సీటు ఇతరులకు ఎప్పుడు కేటాయిస్తారు

కష్టపడి రైలు టికెట్ బుక్ చేసుకున్నాక, మీరు కంగారులో వేరే కోచ్ ఎక్కి TTEకి దొరికినా ఏ సమస్యా ఉండదు. కన్ఫామ్ టికెట్ ఉంటే వారిని సరైన కోచ్‌కు వెళ్లాలని సూచిస్తారు.

Train Ticket Booking | భారత్‌లో ఎక్కువ దూరం ప్రయాణించడానికి రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే జర్నీ సౌకర్యవంతంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే రైల్వేస్టేషన్లలో రద్దీ, తొందరపాటు, భారీ లగేజీ, ప్లాట్‌ఫారమ్‌ల గందరగోళంలో కొన్నిసార్లు చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటి తప్పిదాలలో ఒక తప్పిదం మీరు రైలులో వేరే  కోచ్‌లో ఎక్కడం లాంటివి. భారత్‌లోని చాలా రైళ్లలో కోచ్‌లు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు తొందరపాటులో లేదా రద్దీ కారణంగా కొన్నిసార్లు వేరే బోగీలో ఎక్కుతారు. కానీ అది తమ సీటు కాదని త్వరగానే గ్రహిస్తారు. 

మీరు ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకోగా సీటు లేదా బెర్త్ మీకు కన్ఫర్మ్ అవుతుంది. కానీ మీరు వేరే కోచ్‌లో ఎక్కడంతో రైలు బయలుదేరిన వెంటనే, TTE వస్తారు. మీరు ఇంకా మీ సీటు వద్దకు చేరుకోకపోతే, మీ సీటును మరొకరికి ఇస్తారా, మరో కోచ్‌లో ఎక్కినందుకు జరిమానా విధిస్తారా అని కొందరు ఆందోళన చెందుతుంటారు. అలాంటి సమయంలో ఆందోళన చెందవద్దు, అప్పుడు టీటీఈ ఏ నిర్ణయం తీసుకుంటారు, మీరు ఏం చేయాలో ఇక్కడ వివరాలు తెలుసుకోండి. 

పొరపాటున వేరే కోచ్‌లో ఎక్కితే మీ సీటు పోతుందా?

మీ దగ్గర కన్ఫర్మ్ టికెట్ ఉంటే, మీ సీటును వెంటనే మరొకరికి ఇవ్వడం కుదరదు. సీటుకు చేరుకునే ముందే TTE మీకు కనిపిస్తే, మీరు పొరపాటున తప్పు కోచ్‌లో ఎక్కారని వారికి వివరించాలి. మీ టికెట్‌ను టీటీఈకి చూపించండి. మీ సీటు, బెర్త్ ఉన్న కోచ్‌కి వెళ్లడానికి మిమ్మల్ని అనుమతిస్తారు. తప్పు కోచ్‌లో రైలు ఎక్కడం ద్వారా మీరు సీటు కోల్పోరు. 

మీ సీటు ఎప్పుడు పోవచ్చు?

రైల్వే నిబంధనల ప్రకారం ప్రయాణికుడు తన సరైన కోచ్, సీటుకు చాలాసేపు చేరుకోకపోతే.. ఇక ప్రయాణికుడు రాడని TTE భావిస్తే, రైలు 2 స్టేషన్లు దాటిన తర్వాత TTE ఆ సీటును RAC లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుడికి కేటాయిస్తారు. అయితే, మీరు TTEకి చెప్పినట్లయితే లేదా మీరు మీ సీటున్న కోచ్ వైపు వెళ్లి త్వరగా చేరుకుంటే మీ సీటు ఇతరులకు కేటాయించే అవకాశం లేదు. 

వేరే కోచ్‌లో ఉంటే జరిమానా విధిస్తారా?

మీ దగ్గర వ్యాలిడ్ అయ్యే కన్ఫర్మ్ టికెట్ ఉండి, మీరు మీ సరైన కోచ్‌కి వెళ్తున్నట్లు అయితే సాధారణంగా ఎటువంటి జరిమానా ఉండదు. టికెట్ లేకుండా ప్రయాణిస్తే TTE మిమ్మల్ని నేరం చేసిన వ్యక్తిగా పరిగణించి రైల్వే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు. టీటీఈ కేవలం నిర్దిష్ట ఛార్జీలు లేదా జరిమానా మాత్రమే వసూలు చేయవచ్చు. ఆ సమయంలో టీటీఈ నుంచి మీరు రసీదు తీసుకోవాలి. 

టికెట్ లేకపోతే రైలు నుండి దించేస్తారా?

మీరు వెయిటింగ్ టికెట్‌తో స్లీపర్ లేదా AC కోచ్‌లో ఉండి సీటు దొరకకపోతే, మిమ్మల్ని జనరల్ కోచ్‌కి పంపే ఛాన్స్ ఉంది. మహిళలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న ప్రయాణికుల విషయంలో TTE ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అనవసరంగా ప్రయాణికులను రైలు నుంచి కిందకు దించరు. మీ వద్ద టికెట్ లేకపోతే జరిమానా విధిస్తారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget