అన్వేషించండి

Amrit Bharat Stations: విజయవాడ డివిజన్ పరిధిలో మోదీ ప్రారంభించే మొదటి నాలుగు అమృత్ భారత్ స్టేషన్‌లు ఇవే!

Amrit Bharat Stations:విజయవాడ డివిజన్ పరిధిలో అమృత్ భారత్ స్టేషన్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో తుని, కాకినాడ టౌన్, నిడదవోలు, రాయనపాడు స్టేషన్‌లను మొదట మోదీ ప్రారంభించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Amrit Bharat Stations: ఏపీలో అమృత్ భారత్ స్కీమ్‌లో 73 రైల్వే స్టేషన్‌లను 3418 కోట్ల రూపాయలతో పూర్తిగా అధునీకరిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో విజయవాడ పరిధిలో 21 స్టేషన్‌లు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన రైల్వే స్టేషన్‌ల పనులు పూర్తి అయ్యాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా రెడీ అయిన రైల్వే స్టేషన్‌లను ప్రధాని మోదీ ఒకేసారి ప్రారంంభించనున్నారు. వాటిలో విజయవాడ డివిజన్ పరిధిలో 4 స్టేషన్‌లు ఉన్నాయి. అవే రాయనపాడు, నిడదవోలు,కాకినాడ టౌన్,తుని.

1) రాయనపాడు రైల్వే స్టేషన్  

విజయవాడ స్టేషన్‌కు సాటిలైట్ స్టాప్‌గా ఏర్పడిన రాయనపాడు ఇప్పుడు పూర్తిగా రూపం మార్చుకుంది. కొన్ని విషయాల్లో విజయవాడ స్టేషన్ కంటే అందంగా ముస్తాబైంది. విజయవాడ స్టేషన్‌ఫై భారం తగ్గించేందుకు ఏర్పడిన రాయనపాడు పెరుగుతున్న విజయవాడ పరిధికి మరో స్టేషన్‌గా మారింది. ఇప్పటికే చాలా రైళ్లు విజయవాడ మెయిన్ స్టేషన్‌కు వెళ్లనవసరం లేకుండా గుణదల నుంచి రాయనపాడు లైన్‌లో ఖమ్మం రూట్‌లోకి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి ట్రైన్స్‌కి రాయన పాడులో హాల్ట్ ఇస్తున్నారు. సికింద్రాబాద్‌కు చర్లపల్లి ఎలానో విజయవాడకు రాయనపాడు అలాంటిదే. ప్రస్తుతం ఈ స్టేషన్ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. 


Amrit Bharat Stations: విజయవాడ డివిజన్ పరిధిలో మోదీ ప్రారంభించే మొదటి నాలుగు అమృత్ భారత్ స్టేషన్‌లు ఇవే!

2)  నిడదవోలు రైల్వే స్టేషన్

గోదావరి జిల్లాల్లో అతి ముఖ్యమైన రైల్వే జంక్షన్ ఇది. చెన్నై-హౌరా మెయిన్ లైన్‌లో ఈ స్టేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి తణుకు, భీమవరం, నరసాపురం, గుడివాడ, మచిలీపట్నం మీదుగా విజయవాడ వెళ్లే మరో రూట్ ఉండడం వల్ల ఈ స్టేషన్‌ను డెవలప్ చెయ్యడానికి రైల్వే డిసైడ్ అయి ఏకంగా 30 కోట్లు కేటాయించింది. ఇంతకు ముందు కేవలం 3 ప్లాట్ ఫామ్స్ ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 5కు చేరుకుంది. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న పట్టణం కావడంతో నిడదవోలు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికపరంగా, టూరిజంపరంగా చాలా ముఖ్యమైన ఏరియా. రానున్న గోదావరి పుష్కరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాజమండ్రికి దగ్గరలో గల ఈ స్టేషన్‌ను డెవలప్ చేశారు. ముఖ్యంగా ఈ స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లిఫ్ట్, ఎస్కలేటర్ ప్రయాణికులకు చాలా సౌకర్యంగా మారాయి. 

Amrit Bharat Stations: విజయవాడ డివిజన్ పరిధిలో మోదీ ప్రారంభించే మొదటి నాలుగు అమృత్ భారత్ స్టేషన్‌లు ఇవే!

3) కాకినాడ టౌన్ స్టేషన్

కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ ప్రస్తుత రూపం చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. దీని రూపం ఎంతెలా మారింది ఆంటే రైల్వే కూడా ఈ స్టేషన్ డెవలప్మెంట‌ను ప్రమోట్ చేసుకొంటోంది. కాకినాడలోని పారిశ్రామిక ప్రాంతాలను దేశంలోని ఇతర పట్టణాలతో కలిపే కాకినాడ టౌన్ స్టేషన్ విజయవాడ డివిజన్‌లో చాలా ముఖ్యమైంది. కాకినాడలో రెండు రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ టౌన్. వీటిలో కాకినాడ టౌన్ స్టేషన్ నుంచే ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. ఒకప్పుడు ఇక్కడ నుంచి రైళ్లు చాలా తక్కువగా వెళుతుండేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా పెరిగింది. దానితో 21 కోట్ల ఖర్చుతో స్టేషన్‌ను బాగా డెవలప్ చేశారు. అందమైన మొక్కలు, కొత్త బెంచీలు, కుర్చీలు, అధునాతన టాయిలెట్స్, స్టేషన్ గోడలపై స్వాతంత్ర్య సమరయోధుల పెయింటింగ్స్ ఇలా చాలా సౌకర్యాలు వచ్చేశాయి.


Amrit Bharat Stations: విజయవాడ డివిజన్ పరిధిలో మోదీ ప్రారంభించే మొదటి నాలుగు అమృత్ భారత్ స్టేషన్‌లు ఇవే!

4) తుని రైల్వే స్టేషన్ 

చారిత్రక పట్టణం తుని స్టేషన్‌ను 19.కోట్లతో డెవలప్ చేసింది రైల్వే శాఖ. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలతో ముడిపడిన తుని సమీపంలోని గిరిజన గ్రామాలకు చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్. అటు వైజాగ్ వెళ్లాలన్నా ఇటు కాకినాడ, విజయవాడ లాంటి టౌన్ వెళ్లాలన్నా ఈ స్టేషన్ ద్వారానే ప్రయాణం చేస్తారు. చాలా కాలం నుంచి అభివృద్ధికి నోచుకోని తుని స్టేషన్ ఇప్పుడు అదిరిపోయే లుక్‌లోకి మారిపోయింది. ముఖ్యంగా స్టేషన్ ఎంట్రీ ముఖధ్వారాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలానే స్టేషన్ లోపలి సౌకర్యాలను చక్కగా తీర్చిదిద్దారు.

 

Frequently Asked Questions

ఏపీలో అమృత్ భారత్ స్కీమ్ కింద ఎన్ని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు?

ఏపీలో అమృత్ భారత్ స్కీమ్ కింద 73 రైల్వే స్టేషన్లను 3418 కోట్ల రూపాయలతో పూర్తిగా అధునీకరిస్తున్నారు.

ప్రధాని మోదీ ఏయే విజయవాడ డివిజన్ పరిధిలోని స్టేషన్లను ప్రారంభించనున్నారు?

ప్రధాని మోదీ విజయవాడ డివిజన్ పరిధిలోని రాయనపాడు, నిడదవోలు, కాకినాడ టౌన్, తుని రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు.

నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎంత కేటాయించారు?

నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధికి రైల్వే శాఖ 30 కోట్లు కేటాయించింది. ఇది గోదావరి జిల్లాల్లో ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్.

కాకినాడ టౌన్ స్టేషన్ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారు?

కాకినాడ టౌన్ స్టేషన్ అభివృద్ధికి 21 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక్కడ కొత్త బెంచీలు, అధునాతన టాయిలెట్స్, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో గోడలు తీర్చిదిద్దారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Iran War Effect AP Hotels: ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్! ఏపీలో స్విగ్గి, జోమోటో సేవలు బంద్? హోటల్ యాజమాన్యాల కీలక నిర్ణయాలు!
YS Jagan: ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఇక  ప్రధాని అయితే దేశం గతేంటీ?- చంద్రబాబుపై జగన్ కామెంట్స్ వైరల్ 
Advertisement

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Musi Riverfront Development Project:మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
మూసీ ప్రక్షాళనతో విశ్వనగరంగా హైదరాబాద్‌! మంచి సలహాలు ఇవ్వాలని ప్రతిపక్షాలకు పిలుపు!
Pathala Bhairavi: పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
పాతాళ భైరవి @ 75... ఎన్టీఆర్‌ను స్టార్ చేసిన క్లాసిక్ సినిమా తెర వెనుక సంగతులు
Amavasya 2026: మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
మార్చి 19 భూతడి అమావాస్య రోజు ప్రతికూల శక్తుల ఆధిపత్యం! పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
Bangaru Bomma Song Lyrics: బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
బంగారు బొమ్మ లిరిక్స్... ఎస్పీబీని గుర్తు చేసిన చరణ్ - సుమంత్ ప్రభాస్ 'గోదారి గట్టుపైన' సినిమాలో సాంగ్ విన్నారా?
YSRCP coterie problem: వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
వైఎస్ఆర్‌సీపీలో కోటరీకి చెక్ పడినట్లే - జగన్ సొంత రాజకీయం ప్రారంభించారా?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
LPG గ్యాస్ సిలిండర్లు ఎందుకు ఎర్రగా ఉంటాయి? జ్యోతిష్య శాస్త్రంతో వాటికి సంబంధం ఏంటి?
Telugu Innovation: రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
రెగ్యులర్‌ పనుల కోసం డజన్లు కొద్దీ వెబ్‌సైట్లు అవసరం లేదు! ఒకే ప్లాట్‌ఫామ్‌పై అన్ని సర్వీస్‌లు అందిస్తున్న MiOffice.ai 
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
2026 మార్చి 14 రాశిఫలాలు: ఈరోజు మీ రాశికి శుభమా? అదృష్టం ఎలా ఉండబోతోంది?
Embed widget