Indian Man Abused In Poland: మీ ఇండియన్‌లు పారసైట్‌లు, పోలాండ్‌లో భారతీయుడిపై అమెరికన్ నోటి దురుసు
Indian Man Abused In Poland: పోలాండ్‌లో ఓ భారతీయుడిని వెంబడిస్తూ ఓ అమెరికన్ ఇబ్బంది పెట్టాడు. ఇండియన్స్ పారసైట్స్ అంటూ దురుసుగా మాట్లాడాడు.
Indian Man Abused In Poland:
మా దేశాన్ని ఎందుకు ఆక్రమిస్తున్నారు: అమెరికన్
విదేశాల్లో భారతీయులు వర్మ వివక్ష (Racism) ఎదుర్కోవటం చాలా సాధారణమైపోయింది. ఇటీవలే అమెరికాలో భారతీయ మహిళలపై ఓ అమెరికన్ మహిళ బూతులతో విరుచుకుపడగా...ఇప్పుడు పోలాండ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ అమెరికన్ భారతీయుడిని దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలాండ్‌లోని వార్సాలో ఓ షాపింగ్ సెంటర్ ఎదురుగా ఇండియన్ నడుస్తుండగా...ఓ అమెరికన్ వచ్చి వీడియో ఆన్ చేసి పదేపదే ప్రశ్నించటం మొదలు పెట్టాడు. ఇండియా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటూ దబాయించాడు. అంతే కాదు. ఆ ఇండియన్‌ని "Parasite" అంటూ తిట్టాడు. దాదాపు రెండు మూడు నిముషాల పాటు అలా వీడియో తీస్తూ ఇండియన్‌ను వెంబడించాడు. అయితే...అమెరికన్ ఎంత విసిగించినప్పటికీ...ఆ ఇండియన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా అటూ ఇటూ తిరుగుతూ కనిపించాడు. సమాధానం ఇచ్చేందుకూ ఇష్టపడలేదు. "నేను అమెరికా నుంచి వచ్చాను. అక్కడ ఎక్కడ చూసినా మీ ఇండియన్సే కనిపిస్తారు. ఇప్పుడు పోలాండ్‌కు ఎందుకు వచ్చారు..? పోలాండ్‌ను కూడా ఆక్రమించుకుందాం అనుకుంటున్నారా? మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చుగా?" అంటూ ప్రశ్నించాడు. అయితే..ఈ వీడియో ఎప్పుడు తీశారన్న వివరాలు మాత్రం తెలియలేదు.
Shameful display of racism directed towards an ethnic minority Indian in Poland 👇 pic.twitter.com/9kQBHBLWB8
— Wasiq Wasiq (@WasiqUK) September 2, 2022
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...ఆ అమెరికన్ పేరు జాన్ మినాడియోగా భావిస్తున్నారు. ఆ వ్యక్తి గోయిమ్ టీవీ ఫౌండర్ అని...అక్కడ అదో వివాదాస్పద ఛానల్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. "మా దేశాన్ని మీరెందుకు ఆక్రమిస్తున్నారు..? మీకు ఇండియా ఉందిగా. శ్వేతజాతి ప్రజల దేశాలతో మీకేం పని..? మీకంటూ ఓ ప్రత్యేక దేశం నిర్మించుకోవచ్చుగా. మీరు యూరప్‌లో ఉండటానికి వీల్లేదు. తిరిగి వెళ్లిపోండి. పోలాండ్ కేవలం పోలిష్ ప్రజల కోసమే. నువ్వు పోలిష్‌వి కాదు" అంటూ ఇండియన్‌ను ఇబ్బంది పెట్టాడు.
టెక్సాస్‌లోనూ..
ఇలాంటి ఘటనే అమెరికాలోని టెక్సాస్‌లో జరిగింది. ఓ మెక్సికన్ అమెరికన్ మహిళ...ఇండియన్ అమెరికన్స్‌పై బూతులతో విరుచుకుపడింది. అమెరికాను నాశనం చేస్తున్నారని, ఇక్కడి నుంచి వెళ్లి పోవాలంటూ శివాలెత్తి పోయింది. డల్లాస్‌లోని ఓ పార్కింగ్ ఏరియాలో ఈ గొడవ జరిగింది. "ఇండియన్స్ అంటే నాకు చాలా చిరాకు. లైఫ్ బాగుండాలనే ఆశతో అందరూ ఇక్కడికే వస్తున్నారు. ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు" అని అసహనం వ్యక్తం చేసింది ఆ మహిళ. దాడికి గురైన ఇండియన్ అమెరికన్స్ ఆమె మాట్లాడిందంతా వీడియో తీశారు. ట్విటర్‌లో పోస్ట్ చేశారు...అమెరికాలోని ఇండియన్ అమెరికన్లంతా షాక్ అయ్యారు. ఆ మహిళ తిట్టటంతోనే ఆగలేదు. వీడియో తీస్తుంటే..వద్దంటూ దాడికి పాల్పడింది. మీద పడి కొట్టింది.
This is so scary. She actually had a gun and wanted to shoot because these Indian American women had accents while speaking English.
— Reema Rasool (@reemarasool) August 25, 2022
Disgusting. This awful woman needs to be prosecuted for a hate crime. pic.twitter.com/SNewEXRt3z
"మా అమ్మ, వాళ్ల ముగ్గురు స్నేహితులతో డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది" అంటూ ఓ మహిళ ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఇలా మాట్లాడకూడదంటూ వీడియో తీసిన మహిళ ఎన్ని సార్లు వారించినా...ఆమె ఊరుకోలేదు. "ఇండియాలో అంతా బాగుంటే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు" అంటూ గట్టిగా అరుస్తూ మీద పడిపోయింది. మరో ట్విస్ట్ ఏంటంటే. వీడియో ఆపకపోతే గన్‌తో కాల్చేస్తానంటూ తన హ్యాండ్‌బ్యాగ్‌లో చేతులు పెట్టి గన్ తీస్తున్నట్టుగా బెదిరించింది కూడా. ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తరవాత ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ కూడా చేశారు. ఆమెను జైల్లో పెట్టామంటూ ఫోటో పెట్టారు.
Also Read: Tenali Anna Canteen : తెనాలిలో "అన్న క్యాంటీన్" రగడ - అక్కడ కర్ఫ్యూ కంటే ఎక్కువగా రూల్స్ !