అన్వేషించండి

Indian couple: పెళ్లి ఖర్చుతో ఇల్లు కొని అందులోనే పెళ్లి చేసుకున్నారు - ఈ జంట ప్లానింగ్ అదుర్స్ !

Expensive wedding:ఆర్భాటాల పెళ్లిళ్లకు స్వస్తి చెప్పి, ఆ డబ్బుతో సొంత ఇంటి కలను నిజం చేసుకున్న ఒక భారతీయ జంట కథ ఇది. అదే ఇంట్లో సింపుల్‌గా పెళ్లి కూడా పూర్తి చేసుకున్నారు.

Indian couple skipped expensive wedding and bought a house: నేటి కాలంలో పెళ్లి అంటేనే కోట్లాది రూపాయల ఖర్చు, ఆడంబరాలు, ఆర్భాటాల మయం. కానీ, ఆ ధోరణికి భిన్నంగా ఆలోచించింది ఒక భారతీయ జంట. కేవలం ఒక్కరోజు వేడుక కోసం లక్షల రూపాయలు తగలేయడం కంటే, జీవితాంతం నీడను ఇచ్చే  సొంత ఇల్లు  ముఖ్యం అని భావించి వారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఖరీదైన డెస్టినేషన్ వెడ్డింగ్స్, భారీ ఫంక్షన్ హాల్స్ వైపు వెళ్లకుండా, ఆ పొదుపు చేసిన సొమ్ముతో వారు ఒక ఇంటిని కొనుగోలు చేశారు.

 కొత్త ఇంట్లోనే శుభకార్యం 

ఈ జంట కేవలం ఇల్లు కొనడమే కాదు, తమ వివాహాన్ని కూడా అదే కొత్త ఇంట్లో జరుపుకోవడం విశేషం. అతిథుల కోసం భారీగా ఖర్చు చేయకుండా, ఆత్మీయుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా తమ కలల సౌధంలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.  మా పెళ్లికి అయిన ఖర్చు సున్నా.. కానీ మాకు దక్కిన ఆస్తి విలువ ఎంతో విలువైనది అంటూ వారు గర్వంగా చెప్తున్నారు.

ఈ జంట తమ వివాహ వేడుకకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకోగా, అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఖాళీగా ఉన్న కొత్త ఇంట్లో, సాదాసీదా దుస్తులతో, ఎంతో సంతోషంగా వారు ప్రమాణాలు చేస్తున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. పెళ్లికి వేల సంఖ్యలో అతిథులు రావాల్సిన పనిలేదు, మనం ఉండే ఇంటి గోడలు సాక్ష్యంగా ఉంటే చాలు  అన్న సందేశాన్ని  వీరు ఇచ్చారు. 

ఆర్థిక ప్రణాళికే కీలకం 

పెళ్లి పేరుతో చేసే అప్పులు, ఆ తర్వాత పడే ఆర్థిక ఇబ్బందుల కంటే.. ఇలాంటి ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడమే మేలని ఈ జంట నిరూపించింది. యువతలో మారుతున్న ఆలోచనా దృక్పథానికి ఇదొక నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం ప్రదర్శన కోసం కాకుండా, భవిష్యత్తు భద్రత కోసం పెట్టుబడి పెట్టడం గొప్ప విషయమని ఆర్థిక నిపుణులు సైతం ఈ జంటను ప్రశంసిస్తున్నారు.    

సోషల్ మీడియా వేదికగా ఈ వార్తపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "అనవసరపు ఖర్చులను తగ్గించి, జీవితంలో నిజమైన స్థిరత్వాన్ని ఎంచుకున్నారు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇది కదా అసలైన వెడ్డింగ్ గోల్ అంటే!" అని మరొకరు అభినందించారు. ఆర్భాటాలకు వెళ్లే యువతకు ఈ జంట ఒక సరికొత్త మార్గాన్ని చూపించిందని చెప్పవచ్చు.  


 

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
Breaking News: హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తప్పించండి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Divorce Decree Quashed: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు - భర్త మరణం తర్వాత విడాకులు రద్దు - భార్యకు మళ్లీ ఆస్తి హక్కులు!
గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు - భర్త మరణం తర్వాత విడాకులు రద్దు - భార్యకు మళ్లీ ఆస్తి హక్కులు!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget