YouTuber spying for Pakistan: పాకిస్థాన్ కు సమాచారం చేరవేత, మరో యూట్యూబర్ అరెస్ట్- జ్యోతి మల్హోత్రాతో లింకులు
పాకిస్థాన్ కు గూఢచర్యం కేసులో పంజాబ్‌కు చెందిన యూట్యూబర్ జస్బిర్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతడికి ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో లింకులు ఉన్నట్లు గుర్తించారు.

Youtuber Spying For Pakistan | అమృత్‌సర్: భారతదేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా యూట్యూబర్లు అరెస్ట్ అవుతున్నారు. పంజాబ్ లోని రూపనగర్ లో పోలీసులు మరో యూట్యూబర్ జస్బీర్ సింగ్ (YouTuber Jasbir Singh) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌కు నిఘా వ్యవహారాలకు సంబంధించి సమాచారం అందిస్తున్నాడన్న ఆరోపణలతో అతడ్ని అరెస్ట్ చేశారు. జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్నాడు. పాక్‌లో పర్యటించి మరీ భారత్ గురించి సీక్రెట్ సమాచారం ఐఎస్ఐ (ISI) ఏజెంట్లకు చేరవేసిన జ్యోతి మల్హోత్రా (Jyoti Malhotra)తో కూడా తాజాగా అరెస్ట్ అయిన యూట్యూబర్ కు లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మూడుసార్లు పాక్‌లో పర్యటించిన జస్బీర్ సింగ్
జస్వీర్ సింగ్ పాకిస్తాన్ రహస్య సంస్థ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ISI) షాకిర్ తో సంబంధాలు కలిగి ఉన్నాడు. అతడు గత ఏడాది, అంతకుముందు మరో రెండుసార్లు మొత్తం మూడు పర్యాయాలు పాకిస్తాన్ వెళ్ళాడు. అతనికి సంబంధించిన ఎలక్ట్రానిక్ డివైజ్ ద్వారా పాకిస్తాన్‌కు చెందిన అనేక నంబర్లను పోలీసులు గుర్తించారు. పాక్ దౌత్య అధికారి దానిష్ ఆహ్వానం మేరకు జస్వీర్ సింగ్ ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన పాకిస్తాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాడని సమాచారం.
వరుస యూట్యూబర్లు అరెస్ట్





















