అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Year Ender 2023: ఈ ఏడాది 6 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు- ఏ పార్టీ సత్తా ఎంత?

Elections: 2023కు వీడ్కోలు పలకబోతున్నాం. ఈ ఏడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు. ఏయే పార్టీలు... ఏయే రాష్ట్రాల్లో గెలిచాయి.. ? ఆయా పార్టీల పని తీరు ఏంటి..? అనేది ఒకసారి తెలుసుకుందాం.

2023 State Elections overall: మరికొన్ని రోజుల్లో 2023వ సంవత్సరం ముగియబోతోంది. ఈ ఏడాది అనేక రాజకీయ ఒడిదుడుకులకు సాక్షిగా నిలిచింది. ఆరు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు  జరగగ్గా... డిసెంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఐదు రాష్ట్రాలకు కొత్త సీఎంలు కూడా వచ్చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ప్రధాని పార్టీ కనిపించింది.  అయితే ఏ పార్టీ పని తీరు ఎలా ఉంది...? ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపొందింది..? అన్నది ఒకసారి చూద్దాం. 

ఈనెల (డిసెంబర్‌)లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మిజోరంలో ఎన్నికలు నిర్వహించారు. వీటిలో మూడు రాష్ట్రాల్లో  బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఈ విజయం వచ్చే ఏడాది (2024)లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుంది. బీజేపీ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.  2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రాన్ని తెలుసుకుంటాం.

2023లో ముందుగా కర్నాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2023, మే 10న కర్నాటక ఎన్నికల పోలింగ్‌ జరగగా... మే 13న ఫలితాలు వచ్చాయి. కర్నాటకలో  మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 224 కాగా... 136 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సాధించింది. బీజేపీ 65 సీట్లు గెలుచుకోగా... జేడీఎస్ 19 సీట్లతో విజయం సాధించింది.  ఇండిపెండెంట్లకు 4 సీట్లు వచ్చాయి. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ కర్నాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిద్ధిరామయ్య కర్నాటక ముఖ్యమంత్రిగా  ఉన్నారు. డీకే శివకుమార్‌ను... కర్నాటక డిప్యూటీ సీఎంగా చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం.

ఇక.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. 2023, నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ జరగగా... జనవరి 3న ఫలితాలు వెలువడ్డాయి. 
తెలంగాణ అసెంబ్లీలోని 119 స్థానాల్లో... కాంగ్రెస్ 64 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించింది. పదేళ్లు పాలించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ను ఓడించింది. ఉద్యమ పార్టీ  నేత కేసీఆర్‌ను గద్దె దించింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. కాగా.. ఏఐఎంఐఎం 7  సీట్లలో విజయం సాధించింది. సీపీఐ ఒక సీటు గెలుచుకుంది. సీపీఐ కాంగ్రెస్‌ కూటమి పార్టీ. తెలంగాణ కాంగ్రెస్‌ సీఎంగా రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క  బాధ్యతలు చేపట్టారు.

ఛత్తీస్‌గఢ్ విషయానికి వస్తే... ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో పోలింగ్‌ జరిగింది. నవంబర్ 7న 20 స్థానాలకు మొదటి దశ పోలింగ్ జరగగా... నవంబర్ 17న 70  స్థానాలకు రెండో దశ పోలింగ్ జరిగింది. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో... బీజేపీ 54 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 35 సీట్లు  దిక్కించుకుంది. ఇండిపెండెంట్లు ఒక సీటు గెలుచుకున్నారు. మెజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ... ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఛత్తీస్‌గఢ్‌ సీఎంగా...  విష్ణుదేవ్‌ సాయిని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం.

మధ్యప్రదేశ్.... ఈ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17, 2023న పోలింగ్‌ జరిగింది. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 163 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 66  సీట్లకు పరిమితం అయింది. భారతీయ ఆదివాసీ పార్టీ ఒక సీటు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో మెజార్టీ స్థానాలు సాధించింది ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. మధ్యప్రదేశ్‌  ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్‌ బాధ్యతలు తీసుకున్నారు.

ఇక రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరిగాయి. రాష్ట్రంలోని మొత్తం 199 స్థానాలకు పోలింగ్‌ జరగగా...  డిసెంబర్ 3న ఫలితం వచ్చింది. ఇందులో బీజేపీ 115  సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 69, బీఎస్పీకి రెండు, ఇతరులకు 15 సీట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీకి భారీ మెజారిటీ సాధించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టింది. రాజస్థాన్‌  ముఖ్యమంత్రిగా భ‌జ‌న్ లాల్ శ‌ర్మకు అవకాశం కల్పించింది బీజేపీ.

మిజోరాంలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 7, 2023న మిజోరాంలోని 40 స్థానాలకు పోలింగ్‌ జరగగా... డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. ఇందులో జోరామ్  పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) పార్టీ గెలించింది. ZPM పార్టీకి 27, మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్)కి 10, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2, కాంగ్రెస్‌ ఒకటి,  ఇండిపెండెంట్లకు ఒక సీటు లభించాయి. జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ అధికారం చేపట్టింది. ZPM నాయకుడు లాల్దుహోమా మిజోరాం ముఖ్యమంత్రి అయ్యారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?కుప్పకూలిన ఆసిస్ అదరగొట్టిన భారత బౌలర్లు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
అనంతపురం రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి, సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి- రూ.5 లక్షల చొప్పున పరిహారం
Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
Vizag Forbs: ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
ఫోర్బ్స్ జాబితాలో విశాఖ కుర్రాళ్ల స్టార్టప్ తారమండల్ టెక్నాలజీస్ - స్పేస్ టెక్‌లో అదరగొట్టేస్తున్నారు !
Pawan Kalyan: మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
మహారాష్ట్ర మిషన్ ముగిసింది, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ టార్గెట్ ఆ రాష్ట్రమేనా!
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
KA Movie OTT Release Date: కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
కిరణ్ అబ్బవరం 'క' మూవీ ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?
TGPSC Group-1 Results: 'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
'గ్రూప్-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్ ఫలితాలు ఎప్పుడంటే?
IND vs AUS 1st Test Highlights: 20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్, ఆసీస్‌లో మొదలైన కంగారు
20 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియాలో భారత ఓపెనర్ల రికార్డ్ భాగస్వామ్యం, ఆసీస్‌లో మొదలైన కంగారు
Embed widget