అన్వేషించండి

World Wonder Kid: గుర్రంపై స్కూల్‌కెళ్తున్న వరల్డ్ వండర్ కిడ్- బిడ్డను చూసి మురిసిపోతున్న పేరెంట్స్

దేవక్‌ బిను... వయసు ఆరేళ్లు. చదివేది 2వ తరగతి. ఇప్పుడు ప్రపంచంలోనే చాలా అరుదైన కిడ్‌గా యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరమ్‌ గుర్తించింది.

కరోనా కారణంగా గతేడాది వరకు చదువు ఊసే లేదు. చాలా మంది ఆన్‌లైన్ చదువులతో తంటాలు పడ్డా మరికొందరు పిల్లలు తమ అభిరుచులపై దృష్టి పెట్టి కొత్త స్కిల్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా స్కూల్‌లో కొత్తగా జాయిన్ కావాల్సిన వారు ఇలాంటి స్కిల్స్‌పై దృష్టి పెట్టారు. అలాంటి కిడ్స్‌లో దేవక్‌ ఒకడు 

కేరళలోని నీలేశ్వరంలో నివాసం ఉండే దేవక్‌ చేస్తున్న ఫీట్‌లకు ఫిదా అయిపోయిన యూనివర్సల్‌ రికార్డ్‌ ఫోరమ్‌ 'వండర్ కిడ్స్' విభాగంలో గ్లోబల్ అవార్డు విజేతగా ప్రకటించేసింది. దైర్యంతో గుర్రపు స్వారీ చేస్తున్న ఆయన స్కిల్‌ను గుర్తించి ఈ అవార్డు అందజేసింది. 

2వ తరగతి విద్యార్థి గత ఒకటిన్నర సంవత్సరాలుగా గుర్రపు స్వారీ చేస్తున్నాడు.  తన అభిరుచికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా దేవక్‌ను ప్రోత్సహించారు. ఆ బుడతడు గుర్రపు స్వారీ చేస్తుంటే ఫేమస్‌ సినిమా పాటలు మైండ్‌లో ట్యూన్ అవుతాయి.   గుర్రపు స్వారీ పట్ల అతని పట్టుదల, సహనం అతన్ని గుర్రంపై స్వారీ చేసేలా చేస్తాయి. గంటకు సగటున 40 నుంచి 48 కి.మీ వేగంతో రైడ్ చేస్తాడీ దేవక్.

కోవిడ్ వ్యాప్తి టైంలో బిను పరక్కత్, శృతి దంపతులు మున్నార్‌లోని వారి రిసార్ట్‌లో ఐసోలేషన్‌లో ఉండే వాళ్లు. ఆ టైంలో  నాలుగున్నర సంవత్సరాల వయస్సు ఉన్న  పెద్ద కుమారుడు దేవక్ బిను గుర్రపు స్వారీ చేస్తానంటూ పట్టుబట్టాడు. సరదాగా మొదలైన ఈ స్కిల్‌ తర్వాత దేవక్‌ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. సందర్శకులు స్వారీ చేయడం కోసం ‘కర్ణన్’ అనే తెల్లని గుర్రాన్ని రిసార్ట్‌కు తీసుకొచ్చారు. దానిపై స్వారీ చేయాలన్న కుతూహలంతో తల్లిదండ్రులను ఒప్పించి స్వారీ స్కిల్ నేర్చుకున్నాడు. 

కోవిడ్ కారణంగా తీవ్ర విసుగు ఆందోళన నుంచి దేవక్‌ను ఉపశమనం కలిగించేందుకు స్వారీ చేసేందుకు ప్రోత్సహించారు. తమ రిసార్ట్‌లో ఉండే సంరక్షకుల పర్యవేక్షణలో స్వారీని నేర్చుకున్నాడు. ఎనిమిది నెలల కాలంలో గుర్రపు స్వారీలో ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నాడని అతని తండ్రి బిను తెలిపారు. 
కరోనా సడలింపులు తర్వాత ఇంటికి వచ్చినప్పటికీ గుర్రపు స్వారీపై తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు దేవక్. రోజులు గడిచిన కొద్దీ గుర్రాన్ని కొనివ్వాలని పట్టుబట్టారు. 

"మా కొడుకు గుర్రపు స్వారీపై ఆసక్తి చూపడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. కానీ అతను దాని పట్ల మక్కువ చూపుతున్నాడని మేము గ్రహించిన తర్వాత, రెండో ఆలోచన రాలేదు, అని బిను చెప్పారు. "మేము మలయత్తూర్‌లోని టోలిన్స్ వరల్డ్ స్కూల్‌లో ట్రైనర్ అయిన రఫీక్‌ని కలిశాము. దేవక్ మేము బెంగుళూరు నుంచి తెచ్చిన తన కొత్త గుర్రం 'రాణి'తో శిక్షణ ప్రారంభించాడు," అని అతను చెప్పాడు.

దాదాపు ఒకటిన్నర సంవత్సరాల తర్వాత, దేవక్ 5 కిలోమీటర్ల పాటు రద్దీగా ఉండే ట్రాఫిక్ మధ్య హైవే వెంట గుర్రపు స్వారీ చేశాడు. గత వారం వండర్ కిడ్స్ విభాగంలో URF ప్రపంచ గుర్తింపును గెలుచుకున్నాడు. రద్దీగా ఉండే హైవే వెంట రోజూ గుర్రపు స్వారీ చేస్తూ పాఠశాలకు వెళ్తున్న బాలుడు ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అతని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "అతని అభిరుచి ఏదైనా కావచ్చు, అది గుర్రపు స్వారీ లేదా మరేదైనా కావచ్చు, మేము అతని కలను సాధించడానికి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాం." అని బిను చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

MS Dhoni To Play IPL 2025: సీఎస్కే ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ధోనీ మిత్రుడు సురేష్ రైనాSunil Nostalgic About His School Days: స్కూల్ రోజుల్లో తనపై ఇన్విజిలేటర్ల ఓపినియనేంటో చెప్పిన సునీల్BJP Madhavi Latha Srirama Navami Sobhayatra: శోభాయాత్రలో పాల్గొని ఎంఐఎంపై మాధవీలత విమర్శలుRaja Singh Srirama Navami Sobhayatra: శోభాయాత్ర సందడి, యువకులను ఉద్దేశిస్తూ రాజాసింగ్ ప్రసంగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayankhed: అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
అసభ్యంగా ప్రవర్తించాడని డిప్యూటీ తహసీల్దార్ చెంప ఛెల్లుమనిపించిన మహిళ - వైరల్ వీడియో
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్, భారత్‌లోని ఆ ప్రాంతాల్లో తిండి కూడా దొరకదట - సంచలన రిపోర్ట్
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
చిన్నారులకు ఆ సెరిలాక్ తినిపిస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Hyderabad News: HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
HCUలో విద్యార్థుల మధ్య ఘర్షణ - బ్లేడ్ తో దాడి, తీవ్ర ఉద్రిక్తత
Nisha Agarwal : సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
సమ్మర్ స్పెషల్ ఎల్లో ఫ్రాక్​లో సిగ్గు పడుతున్న నిషా అగర్వాల్.. ఫోటోల్లో క్యూట్​గా ఉందిగా
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి భక్తులకు అలర్ట్ - జులై నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు  రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
ప్రపంచకప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఉంటాడా అనే ప్రశ్నకు రోహిత్ శర్మ ఇచ్చిన ఫన్నీ జవాబు
Embed widget