అన్వేషించండి

Gandhi Jayanthi: అహింసాయుధధారి మహాత్ముని 155వ జయంతి - భారత స్వాతంత్ర్య ప్రదాతకు ప్రపంచ వ్యాప్తంగా ఘన నివాళి

World Non-Violence Day: అక్టోబర్‌ 2న గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రపంచ అహింసా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చుక్క రక్తం చిందకుండా భారత్‌కు స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడ్ని గుర్తు చేసుకుంటోంది.

Mahatma Gandhi 155th Birth Anniversary: వేదకాలం నుంచి భారతదేశ సమాజంలో ఎంత మందో దేవుళ్లు ఈ నేలపై నడయాడారని పురాణేతిహాసాల ద్వారా మనకు తెలుస్తుంది. అధునిక భారతం ఇంకా చెప్పాలంటే 19, 20వ శతాబ్దాల్లో ఆ మహాత్మాగాంధీ నడచిన ఇదే నేలపై నడిచిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులంటే అతిశయోక్తి అవుతుందేమో. కానీ ఐన్‌స్టీన్ మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. మహాత్మా గాంధీ అనే వ్యక్తి ఈ నేలపై రక్తమాంసాలతో నడిచాడని చెబితే భావితరాలు విశ్వసించకపోవచ్చు అని వందేళ్ల క్రితమే ఐన్‌స్టీన్ అన్నారు. అంతగా ఆయన ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. దక్షిణాఫ్రికా నల్ల సూరీడుగా పిలిచే నెల్సన్ మండేలా జీవన పోరాటం, ఆయన నిర్దేశించుకున్న లక్ష్యం, అనుసరించిన మార్గం అన్నీ గాంధీ జీవితం నుంచి స్ఫూర్తి పొందినవే. అంతలా ప్రపంచాధినేతలు స్మరించుకొనే మహాత్మా గాంధీ భారతదేశంలో పుట్టడం, ఇక్కడే రక్తమాంసాలతో తిరిగారంటే భారతీయులుగా ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయం.

అహింసే ఆయుధం

అహింస అనే ఆయుధాన్నే ప్రయోగించి రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గాంధీ గడగడలాడించారు. అందుకే ఆయన జన్మదినమైన అక్టోబర్‌ 2ని ప్రపంచ అహింసా దినోత్సవంగా జరుపుతున్నారు. ఆయన నినాదం సత్యమేవ జయతే. ఆ నినాదమే దేశంలో ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఇప్పటికీ 150 కోట్ల మంది భారతీయుల్లో ఉండడానికి ప్రేరణగా ఉంది. అక్టోబర్‌ 2, 1869లో గుజరాత్‌లోని పోరుబందర్‌లో పుట్టిన మోహన్‌దాస్ కరమ్‌ చంద్‌ గాంధీ .. 13వ ఏటనే తనకంటే ఏడాది పెద్దదైన కస్తూరీభాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బారిష్టర్ పూర్తి చేసి లాయర్ ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ 22 ఏళ్లు ఉన్నారు.

అవమానమనే అగ్గిరవ్వ సత్యాగ్రహమై..

మహాత్మగాంధీ సౌతాఫ్రికా వెళ్లిన తొలినాళ్లలో రైలు ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న అవమానమే ఆయనలో ఉన్న సత్యాగ్రహ జ్వాలని రగిలించింది. 1893, జూన్ 7న ఆయన డర్బన్ నుంచి ప్రిటోరియాకు రైలులో వెళ్తున్నారు. రైలు పీటర్‌మారిట్జ్‌బర్గ్‌కు చేరుకున్న తర్వాత ఆయన్ను ఫస్ట్‌ క్లాస్ కంపార్ట్‌మెంట్‌ నుంచి థర్డ్‌ క్లాస్‌కు వెళ్లాలని.. టికెట్‌ ఉన్నా భారతీయులకు ప్రవేశం లేదని అధికారులు ఆదేశించారు. గాంధీ వాళ్ల మాటను లెక్కచేయకపోవడంతో లగేజ్‌తో సహా ప్లాట్‌ఫారం మీదకు నెట్టారు. తెల్లవాళ్ల జాత్యహంకారంపై ఆయన సత్యాగ్రహ జ్వాలలు రగిలించారు. 1894లో నేషనల్ ఇండియన్‌ కాంగ్రెస్‌ స్థాపించి సమానత్వం కోసం పోరాటం చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. అలా అహింసాయుత మార్గంలో ఆయన చేసిన పోరాటం వ్యవస్థలో మార్పులకు కారణం కూడా అయింది. దాదాపు 22 ఏళ్లపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన ఆయన 1915లో భారత్‌కు తిరిగి వచ్చారు.

భారత స్వాతంత్రోద్యమ బావుటా

సుదీర్ఘకాలం విదేశీ గడ్డపై ఉండి భారత్‌కు తిరిగి వచ్చిన గాంధీజీని ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణగోఖలే దేశం మొత్తం పర్యటించాల్సిందిగా సూచించారు. ఆయన సూచన మేరకు దేశం మొత్తం పర్యటించిన గాందీ.. దేశంలో పేదరికం చూసి చలించిపోయారు. తన వేషధారణను మార్చుకొని సగటు భారతీయుడి దుస్తులైన గోచీ, మాత్రమే ధరించి చేతి కర్రతో దేశ ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేశారు. 1917లో చంపారన్ ఉద్యమం పేరిట బిహార్ నుంచి తొలి స్వతంత్ర సంగ్రామ శంఖారావాన్ని ఆయన పూరించారు. 1919లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఆయన పిలుపునిచ్చిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. అయితే చౌరాచౌరీ ఘటనతో అది హింసామార్గం పట్టడంతో ఆయన ఆ ఉద్యమాన్ని నిలుపుదల చేశారు. 1921లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయన ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. విదేశీ వస్తు బహిష్కరణ పిలుపు బ్రిటీష్ వ్యాపార సామ్రాజ్య పునాదులను కదిలించింది.

ఆ తర్వాత ఉప్పుపై పన్నును వ్యతిరేకిస్తూ చేపట్టిన 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆయన చేపట్టిన దండి యాత్ర.. ఆంగ్లేయులకు దండయాత్రలా కనిపించింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆయన ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం దేశంలో బ్రిటీషర్ల పాలనకు చరమగీతం పాడింది. రెండేళ్ల పాటు ఆ ఉద్యమం నడిచింది. చివరకు 1947 ఆగస్టు 15న భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చింది. దానికి ఒక రోజు ముందు పాకిస్థాన్ ఏర్పడింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లలో దాదాపు 20 లక్షల మంది వరకు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలపై కలత చెందిన నాథూరామ్ గాడ్సే 1948 జనవరి 30న ఢిల్లీలో ప్రేయర్స్‌ జరుగుతున్న సమయంలో గాంధీని కాల్చి చంపాడు.

ఆదర్శం.. మహాత్ముని జీవితం

గాంధీ మహాత్ముడు తన జీవితానుభవాలను ఏర్చి కూర్చి రచించిన 'దీ స్టోరీ ఆఫ్‌ మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్ లైఫ్‌' బుక్ ఎంతో ప్రత్యేకమైంది. ఆ పుస్తకం నుంచి స్ఫూర్తి పొంది తన జీవనపంథా మార్చుకున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉన్నారు. ఆయన ప్రతిదీ పాటించి చేయమనే చెప్పేవాళ్లు. ఆయన ఒక శాఖాహారి. జీవితాంతం శాఖాహారిగానే గడిపారు. ఆయన్ను మహాత్ముడిగా తొలిసారి రవీంద్రనాథ్ ఠాగూర్ పిలిచారు. నోబెల్ అవార్డుకు ఐదుసార్లు ఆయన పేరు నామినేట్ అయినా గాంధీజీకి శాంతి నోబెల్ మాత్రం రాలేదు. అయితే 2007 నుంచి ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 2ని అహింసా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

1930లో టైమ్‌ మ్యాగజైన్ కవర్‌ స్టోరీ గాంధీజీని మ్యాన్ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రచురించింది. గాంధీజీ చాలా పరిశుభ్రంగా ఉండేవారు. తన పారిశుద్ధ్య పనులన్నీ తానే స్వయంగా చేసుకునేవారు. అందరూ అలానే చేయాలని సూచించేవారు. ఆయన పారిశుద్ధ్య విధానం నుంచి స్ఫూర్తి పొందిన నరేంద్ర మోదీ సర్కారు 2014 అక్టోబర్ 2 నుంచి సత్యమేవ జయతే మాదిరి స్వచ్ఛమేవ జయతే నినాదంతో స్వచ్ఛభారత్‌కు అంకురార్పణ చేసింది. ఆయన కళ్లద్దాలనే స్వచ్ఛభారత్‌కు చిహ్నంగా వాడుతున్నారు.

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీ విశ్వసించేవారు. ఆయన కోరుకున్న రామరాజ్యం పల్లెలవెలుగుతోనే సాధ్యమని విశ్వసించిన మోదీ సర్కారు.. పల్లెలు దత్తత తీసుకొని అభివృద్ధి చేసే కార్యక్రమానికి పిలుపునిచ్చి అద్భుత ఫలితాలు సాధించింది.  అనవసరపు ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక పరిపుష్టి సాధించడానికి గాంధీజీ స్వయంగా ఎన్నో మార్గాలు సూచించారు. డబ్బు విలువను ప్రజలకు గుర్తు చేసేలా భారత కరెన్సీ నోట్లపై చెరగని చిరునవ్వుతో మహాత్ముడి చిత్రం ఉంటుంది. కస్టమర్ ఈజ్ గాడ్ అంటూ ప్రపంచానికి ఉద్బోధించింది కూడా ఆ మహాత్ముడే. ఆడవాళ్లు అర్ధరాత్రి 12 గంటలకు ధైర్యంగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అన్న ఆయన మాటలు ఇప్పటికీ భారత సమాజంలో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను ఆ నాడే ఎత్తి చూపిన వైనాన్ని గుర్తు చేస్తాయి.

మహాత్ముని జయంతి పురస్కరించుకొని రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ముఖ్యనేతలు రాజ్‌ఘాట్‌కు వెళ్లి ఆయన సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తారు. అనంతరం ఆయనకు ఇష్టమైన రఘుపతి రాఘవ రాజారాం పాటతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను రాజ్‌ఘాట్‌లో నిర్వహిస్తారు. మద్యాన్ని, జంతు హత్యలను ఆయన వ్యతిరేకించే వారు. అందుకని అక్టోబర్‌ 2న భారతదేశంలో మాంసం, మద్యం విక్రయాలు నిషేధం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan : కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
కొండగట్టులో పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు! టీటీడీ నిధులతో నిర్మించే పనులకు శ్రీకారం 
China Corruption mayor: చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
చైనాలో అవినీతి చేశాడని మాజీ మేయర్‌కు మరణశిక్ష - ఇంత దోచేస్తే ఊరుకుంటారా?
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
Vaammo Vaayyo Song Lyrics : ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రవితేజ రొమాంటిక్ మాస్ బీట్ - యూత్ జోష్ పెంచేలా 'వామ్మో వాయ్యో' సాంగ్ లిరిక్స్
Venezuela : వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
వెనిజులా రాజధాని కారకాస్‌పై క్షిపణి దాడి! పలు చోట్ల విధ్వంసం!
Maoist Latest News: ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
ఆపరేషన్ కగార్ తరువాత దేశంలో అతిపెద్ద లొంగుబాటు! డీజీపీ వద్దకు మావోయిస్టు కీలకనేత బరిసెదేవా దళం!
Hyundai Creta నుంచి Tata Sierra వరకు - కొత్త Seltos ముందు బలంగా నిలబడే కారు ఏది?
కొత్త Kia Seltos - ధర, స్పెసిఫికేషన్లలో ఇతర కార్ల కంటే బెటర్‌గా ఉందా?
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Embed widget