అన్వేషించండి

Operation Sindoor: లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసా?

Operation Sindoor: లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్‌కు చెందినవారు. ఆమె బయోకెమిస్ట్రీ చదివారు. ఆమె గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Operation Sindoor: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచవ్యాప్త సంచలనంగా మారింది. భారత్‌ను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన ఈ ఆపరేషన్‌ వివరాలను ఇద్దరు మహిళలే ప్రపంచానికి తెలియజేశారు. భారతీయ మహిళల పసుపుకుంకుమ లాక్కున్న ఉగ్రవాదులను మట్టిలో కలిపేసే ప్రక్రియ ఎలా సాగిందే తెలియజేశారు. గాజుల చేయి గర్జించి పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించిందిన విధానం అందరి ప్రశంసలు అందుకుంది.  

భారతమాత ముద్దు బిడ్డలైన ఇద్దర మహిళా అధికారులు ధైర్య సాహసాలతో సరిహద్దులను కాపాడటమే కాకుండా.. ఆపరేషన్‌ గురించి ప్రపంచానికి తెలియజేసి దేశ మహిళల శక్తి నిరూపించారు. ఆపరేషన్ సిందూర్ వివరాలు ప్రపంచవ్యాప్తంగా మీడియాకు వివరించాల్సిన బాధ్యతను భారత ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషి, వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌కు కేంద్రం అప్పగించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కూడా వారితో కలిసి కీలకమైన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌ రక్షణ సేవల్లో మహిళల భాగస్వామ్యం ఎంతలా పెరుగుతుందో ఈ దృశ్యం చెప్పింది.

కల్నల్ సోఫియా ఖురేషి ఎవరు?
కల్నల్ సోఫియా ఖురేషి భారత సైన్యంలో నాయకత్వ పటిమకు శక్తికి ఉదాహరణగా నిలిచారు. 2016లో పూణేలో ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 కార్యక్రమంలో భాగంగా 18 దేశాల మల్టీ నేషనల్‌ ఆర్మీ డ్రిల్‌ నిర్వహించారు. ఈ ఎక్సర్‌సైజ్‌లో భారత్‌ తరపున పాల్గొన్నారు ఖురేేషీ. 35 ఏళ్ల వయసులోనే భారతదేశ టీంను లీడ్ చేసే ఛాన్స్ తీసుకున్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయమయ్యారు. 40 మంది సైనికులతో కూడిన భారత బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ఆ ఈవెంట్‌లో యావత్ ప్రపంచంలో ఇలా ఒక దేశ సైనిక దళానికి నాయకత్వం వహిస్తున్న ఏకైక మహిళగా కూడా ఖురేేషీ రికార్డు సృష్టించారు. 

కల్నల్ సోఫియా ప్రయాణం
గుజరాత్‌కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఇది ఆమె చదువుల పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి,ని తెలియజేస్తోంది. తర్వాత సైనిక శిక్షణలో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన విధానం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. 1990లో సైన్యంలో చేరారు కల్నల్ సోఫియా ఖురేషి, మూడు దశాబ్దాలకుపైగా భారత సైన్యానికి సేవలు అందిస్తున్నారు. సైన్యంలో మొదట కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థకు బాధ్యత వహించే సిగ్నల్ కార్ప్స్ లో పని చేశారు. 

2006లో ఆమె UN శాంతి పరిరక్షక మిషన్ కింద కాంగో వెళ్లారు. 6 సంవత్సరాలకుపైగా శాంతి పరిరక్షక మిషన్‌లలో ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతర్జాతీయ మిషన్లకు ఉత్తమ శిక్షణను అందించే శిక్షకురాలిగా కూడా ఆమె పేరు తెచ్చుకున్నారు. ఆమె కుటుంబానికి సైన్యంతో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆమె తాత సైన్యంలో పని చేేశారు. ఆమె భర్త మెకనైజ్డ్‌ ఇన్‌ఫ్యాంట్రీలో అధికారిగా ఉన్నారు. తరచూ యువతతో మాట్లాడే ఆమె సైన్యం చేరాలని యువతను ప్రోత్సహిస్తుంటారు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి భారతదేశం గట్టిగానే బదులు చెప్పింది. ఈ ఒక్కటే కాదు 26/11 ముంబై దాడులు, ఇలా పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. తెల్లవారుజామున, భారతదేశం పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ (PoJK) అంతటా ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. పహల్గామ్‌లో చనిపోయిన వారికి ఘన నివాళిగా ఈ చర్యలకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టారు.

టాప్ హెడ్ లైన్స్

Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Elon Musk vs Mukesh Ambani : ఎలాన్ మస్క్ vs ముఖేష్ అంబానీ - భారత్‌లో స్టార్‌లింక్ వివాదం వెనుక ఉన్న నిజాలేంటి?
ఎలాన్ మస్క్ vs ముఖేష్ అంబానీ - భారత్‌లో స్టార్‌లింక్ వివాదం వెనుక ఉన్న నిజాలేంటి?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Telangana Rising Global Summit: 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2.0' కు చురుగ్గా ఏర్పాట్లు.. డిసెంబరు 7 నుంచి 9 వరకు నిర్వహణ
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
బతుకమ్మ 2026: తీరొక్క పూల జాతర.. ఏ రోజు ఏ బతుకమ్మ, నైవేద్యం?
ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Abhijeet Dipke Detained: విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
విమానం నుంచే అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. సీజేపీ వీడియోలు వైరల్
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Embed widget