News
News
వీడియోలు ఆటలు
X

Son in Bag: బ్యాగులో కొడుకు శవం, అలాగే 200 కి.మీ.బస్సులో ప్రయాణం - కన్నీరు పెట్టించే ఘటన

అంబులెన్స్ డ్రైవర్‌కు చెల్లించడానికి తన వద్ద సరిపడినంత డబ్బు లేదని, అందుకని తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని బస్సులో 200 కి.మీ. ప్రయాణించానని బాధితుడు చెప్పుకొచ్చాడు.

FOLLOW US: 
Share:

పశ్చిమ బెంగాల్‌లో అవమానకరమైన ఘటన వెలుగు చూసింది. నిస్సహాయుడైన ఓ తండ్రి తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. ఆషిమ్ దేబ్ శర్మ (తండ్రి) ఆదివారం (మే 14) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంబులెన్స్ డ్రైవర్‌కు చెల్లించడానికి తన వద్ద సరిపడినంత డబ్బు లేదని, అందుకని తన 5 నెలల చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్‌లో ఉంచుకుని బస్సులో 200 కి.మీ. ప్రయాణించానని చెప్పుకొచ్చాడు.

బాధితుడు ఆషిమ్ దేబ్ శర్మ వీడియో సోషల్ మీడియాలో మరింతగా వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ.. “నా 5 నెలల కుమారుడికి సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఆరు రోజుల జరిగింది. ఆ చికిత్స తర్వాత శనివారం (మే 13) రాత్రి బిడ్డ మరణించాడు. ఈ సమయంలో నేను అతని చికిత్స కోసం రూ.16 వేలు ఖర్చు చేశాను. అయినా ఫలితం లేకపోవడంతో చనిపోయిన నా బిడ్డను కలియగంజ్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్ రూ.8 వేలు అడిగాడు, అవి నా దగ్గర లేకపోవడంతో నేను బిడ్డను బ్యాకులో ఉంచి బస్సులో తీసుకొని వెళ్లాను’’ అని తెలిపారు.

అంబులెన్స్ అందుబాటులో లేనప్పుడు, మృతదేహాన్ని బ్యాగ్‌లో పెట్టుకుని డార్జిలింగ్‌లోని సిలిగురి నుండి నార్త్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్‌కు సుమారు 200 కి.మీల దూరంలో బస్సులో ప్రయాణించినట్లు దేబ్‌శర్మ పేర్కొన్నారు. ఈ సమయంలో, తండ్రి ఎవరికీ దీని గురించి చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం సహ ప్రయాణీకులకు తెలిస్తే తనను బస్సులోంచి దింపేస్తారేమోనని భయపడ్డానని చెప్పాడు. పశ్చిమ్ బంగాల్‌లో 102 పథకం కింద నడుస్తున్న అంబులెన్స్‌ డ్రైవర్‌ మాట్లాడుతూ.. మృతదేహాలను తీసుకెళ్లేందుకు కాకుండా రోగులకు ఈ సౌకర్యం ఉచితమని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది జనవరిలో పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లాలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అంబులెన్స్ డ్రైవర్‌కు నిర్ణీత రుసుము కంటే మూడు రెట్లు చెల్లించలేక ఓ వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని దాదాపు 50 కిలోమీటర్లు తన భుజాలపై మోసుకుని ఇంటికి చేరుకున్నాడు.

ఈ విషయానికి సంబంధించి, పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు (బీజేపీ) సుబేందు అధికారి (సువేందు అధికారి) తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ 'స్వాస్థ్య సాతి' (Swasthya Sathi) అనే ఆరోగ్య బీమా పథకాన్ని ప్రశ్నించారు. మరోవైపు, చిన్నారి మృతిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని టీఎంసీ ఆరోపించింది. తన అధికారిక ట్విటర్ హ్యాండిల్‌లో.. దేబ్‌శర్మ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న వీడియోను పంచుకుంటూ, ‘‘స్వాస్త్య సాథి పథకం సాధించాల్సింది ఇదేనా? ఇది దురదృష్టవశాత్తూ 'అగియే బంగ్లా' (అధునాతన బెంగాల్) మోడల్ అసలైన రూపంలా ఉంది’’ అని ట్వీట్ చేశారు.

Published at : 15 May 2023 05:47 PM (IST) Tags: West Bengal News man traveling kaliaganj son in bag dead son in bag

సంబంధిత కథనాలు

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price Today 29 May 2023: మళ్లీ పడిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Amit Shah Manipur Visit: మణిపూర్ కు వెళ్లిన అమిత్  షా - హింసాత్మక ఘర్షణలను చక్కదిద్దుతారా?

Amit Shah Manipur Visit: మణిపూర్ కు వెళ్లిన అమిత్  షా - హింసాత్మక ఘర్షణలను చక్కదిద్దుతారా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Karnataka Cabinet: మంత్రుల శాఖలను ప్రకటించిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కు ఏ శాఖో తెలుసా?

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Gold-Silver Price Today 29 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

Gold-Silver Price Today 29 May 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు

టాప్ స్టోరీస్

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Wrestlers Protest: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రెజ్లర్లకు ఇచ్చే గౌరవమిదేనా: మంత్రి కేటీఆర్

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana Decade Celebration: గ్రామాల్లో 23 రోజుల పాటు ప్రణాళికా బ‌ద్ధంగా దశాబ్ధి వేడుకలు: మంత్రి ఎర్రబెల్లి

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!

Telangana News: ఇంట్లోనే కూర్చొని రీల్స్ చేస్తుంటారా - అయితే ఈ అదిరిపోయే ఆఫర్ మీ కోసమే!