Taped Banana: వీడెవడండీ బాబూ - ఒక్క అరటి పండును రూ.52 కోట్లకు కొని తినేశాడు!
Viral News: హాంకాంగ్‌లోని ఓ స్టార్ హోటల్లో ఓ అరటి పండును వేలం వేశారు. ఓ వ్యక్తి వచ్చి మన రూపాయల్లో రూ. 52 కోట్లు పెట్టి పాడుకున్నారు. వెంటనే దాన్ని తినేశారు.
Man bought duct-taped banana for Rs 52 crore eats it : వంద రూపాయలు పెడితే మంచి క్వాలిటీ అరటిపండ్లు డజన్‌కుపైగా వస్తాయి.అది ఇండియాలో అయినా హాంకాంగ్‌లో అయినా అంతే. కానీ ఒక్క అరటి పండును రూ. 52కోట్లకు కొన్నాడో వ్యక్తి. అంత పెట్టి కొన్నాడంటే అదేదో వజ్రాలు పొదిగిన .. వజ్రవైఢూర్యాలతో నిండిన కృత్రిమ అరటి పండు అనుకుంటారేమో. కానీ కాదు. అది మామూలు అరటి పండు. ఇంకా చెప్పాలంటే బండ్లు మీద పెట్టి అమ్మే అరటి పండు లాంటిది.దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. ఆ అరటి పండును వేలం వేస్తున్నహాల్లో దానికి ఓ గోడకు టేప్‌కు అంటించి పెట్టారు అంతే. వ
విజువల్ ఆర్టిస్టు ఆలోచన టేపుడ్ బనానా
ఇటలీకి చెందిన విజువల్ ఆర్టిస్ట్ మౌరిజియో 2019లో ఓ గోడకు అరటిపండును పెట్టి వేసి అంటించాడు.అది గొప్ప కళాత్మక విజువల్ అని ప్రచారం చేశాడు. ఈ అరటిపండుకు ‘కమెడియన్’ అని పేరు పెట్టాడు.వేలం వేయడం ప్రారంభించాడు. ఏదో ఓ దేశానికి వెళ్లడం..ఇలా అరటి పండును టేప్ చేసి పెట్టడం..వేలం వేయడం కామన్ అయిపోయింది. ‘కమెడియన్’ పేరిట చేసిన ఈ అరటి పండు ఆర్ట్‌వర్క్‌ను మియామి బీచ్ ఆర్ట్ బాసెల్‌లో తొలిసారి ప్రదర్శించారు. కొనుక్కున్న వాళ్లు కమెడియన్ అని ఆయన ఉద్దేశం ఏమో కానీ.. ఇది ఐదేళ్ల క్రితం రూ.98 లక్షలతో అమ్ముడుపోయింది. వేలం వేసినప్పుడల్లా ధర పెరుగుతూనే పోయింది.
మొదట 98 లక్షలు.. ఇప్పుడు రూ. 52 కోట్లు
తాజాగా హాంకాంగ్‌లో వేసిన వేలంలో ఇది ఏకంగా 6.2 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయి ఆశ్చర్యపరిచింది. చైనాకు చెందిన క్రిప్టో డీలర్ జస్టిన్ సన్ వేలంలో దీనిని సొంతం చేసుకున్నాడు. కొన్న తర్వాత ఆ అరటిపండును సెకన్ల వ్యవధిలోనే అతను తినేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
许多朋友问我这根香蕉的味道如何。老实说,对于一根有如此故事的香蕉,味道自然和普通香蕉不一样。我品尝出了一种100年前大麦克香蕉的味道。🍌 pic.twitter.com/ddo8pEjatx
— H.E. Justin Sun 🍌 (@justinsuntron) November 29, 2024
Also Read: TANAలో 30 కోట్ల గోల్ మాల్ - కోశాధికారే కొట్టేశారు - ప్రవాసాంధ్రుల పరువు పోయినట్లే !
కొని తినేనిసిన జస్టిన్
రూ. 52 కోట్ల విలువైన అరటి పండు తిన్న తర్వాత ఆయనను చాలా మంది ఎలా ఉంది అని అడిగారు. ఎలా ఉంది..మామూలు అరటి పండులాగే ఉందని సమాధానమిచ్చారు. కానీ రూ.52 కోట్ల సంగతేమిటని వారు గుర్తు చేస్తున్నారని జస్టిన్‌కు అర్థమయిందో లేదో మరి !