Venkaiah Naidu: మాతృభాషలో విద్యాబోధనకు కేంద్రం చొరవ - వెంకయ్య నాయుడు హర్షం
Venkaiah Naidu: దేశవ్యాప్తంగా మాతృ భాషల్లో విద్యా బోధనకు కేంద్ర విద్యా శాఖ చొరవ తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
Venkaiah Naidu: దేశవ్యాప్తంగా మాతృ భాషల్లో విద్యా బోధనకు కేంద్ర విద్యాశాఖ చొరవ తీసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మాతృ భాషలో విద్యా బోధన జరగాలని తాను చాలాసార్లు సూచిస్తూనే ఉన్నానని ఊ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయడానికి ఎన్సీఈఆర్టీ ఉపక్రమించడం చాలా సంతోషమన్నారు. అలాగే ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఈ 22 భాషల్లో ఏ భాషలో విద్యా బోధనను ఎంచుకోవాలనేది సీబీఎస్సీకి ఇవ్వటం మరింత స్ఫూర్తిదాయకమని వివరించారు. అంతే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా మన సర్వతోముఖాభివృద్ధిని అడ్డుకుంటున్న వలస పాలన అవశేషాలకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నం అయిందని పేర్కొన్నారు. స్థానిక భాషలకు సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన తరుణం ఇదేనంటూ వ్యాఖ్యానించారు.
Appreciating CBSE for encouraging its affiliated schools to use Indian languages (mother tongue) as a medium of instruction and adapting multilingual education, in line with the vision of National Education Policy, 2020. This provides a significant cognitive advantage to young… pic.twitter.com/Tq25frLj0d
— Ministry of Education (@EduMinOfIndia) July 21, 2023
దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విద్యా బోధనకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోవడం ఆనందదాయకం. మాతృ భాషలో విద్యాబోధన జరగాలని నేను చాలాసార్లు సూచిస్తూనే ఉన్నాను.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 23, 2023
రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయడానికి ఎన్సీఈఆర్టీ ఉపక్రమించడం… https://t.co/nQeTq9Vkdu
I compliment the Ministry of Education, GoI, for the thrust lent to multilingual education & the use of mother tongue as a medium of instruction. Throughout my long career in public life, I have been ardently advocating the use of mother tongue in education. @dpradhanbjp https://t.co/qPlEZWuhgy
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 23, 2023
The NCERT’s initiative to prepare textbooks in 22 Scheduled Indian languages is a laudable one. It gladdens me to learn that CBSE has introduced the option of education in Indian languages (as enumerated in Schedule 8 of the Constitution) from pre-Primary sections to class XII.
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) July 23, 2023
పిల్లలు పూర్వప్రాథమిక స్థాయి నుంచే మాతృభాషపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఇతర భాషలను తెలుసుకుుంటే బహుబాషావాదం చిన్నారుల ఆలోచనా పరిధిని విస్తృతం చేస్తుందని జాతీయ విద్యా విధానం - 2020 కూడా బలంగా చెబుతోంది. కనీసం ఐదో తరగతి వరకు ఈ విధానం అనుసరించాలని 8వ తరగతి వరకు కూడా ఇదే విధానం మేలని చెబుతోంది.