Uttarakashi Tunnel Rescue: రిషికేష్ ఎయిమ్స్‌కి కార్మికులు,ప్రత్యేక హెలికాప్టర్‌లో తరలించిన ఎయిర్‌ఫోర్స్
Uttarakashi Tunnel Rescue: సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులను రిషికేష్ ఎయిమ్స్‌కి తరలించారు.
Uttarakashi Tunnel Rescue Success:
రిషికేష్ ఎయిమ్స్‌కి తరలింపు..
ఉత్తరకాశీలోని సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను (Silkyara Tunnel Rescue Success) సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన రెస్క్యూ సిబ్బంది వాళ్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతానికి అందరూ బాగానే ఉన్నప్పటికీ అబ్జర్వేషన్‌లో ఉంచి ప్రాథమికంగా అవసరమైన వైద్యం అందించనున్నారు. 41 మంది కార్మికులను రిషికేష్‌లోని AIIMS కి (AIIMS Rishikesh) తరలించారు. ఇందుకోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF)కి చెందిన Chinook Helicopter ఏర్పాటు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...కార్మికుల మానసిక స్థితి ఎలా ఉంది..? ఈ 17 రోజుల్లో ఏదైనా ఇన్‌ఫెక్షన్ సోకిందా..? అని పరీక్షించనున్నారు. వీళ్లని రిషికేష్ ఎయిమ్స్‌కి తరలించే ముందు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి చిన్యాలిసార్ హాస్పిటల్‌కి వెళ్లారు. కార్మికులను బయటకు తీసుకొచ్చిన వెంటనే నేరుగా ఈ ఆసుపత్రికే తీసుకొచ్చారు. ఈ హాస్పిటల్‌లోని బాధితులందరితోనూ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అందరూ బాగానే ఉన్నారని, మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | Uttarkashi tunnel rescue | IAF's transport aircraft Chinook, carrying 41 rescued workers, leaves from Chinyalisaur. It is being flown to AIIMS Rishikesh for the workers' further medical examination. #Uttarakhand pic.twitter.com/2bpCW4ks1T
— ANI (@ANI) November 29, 2023
ఎయిమ్స్ రిషికేష్ వైద్యులు 41 మంది కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. సొరంగంలో చిక్కుకుపోయినప్పటికీ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. ప్రస్తుతానికి వాళ్లు మానసికంగానూ బానే ఉన్నారని చెప్పారు. సైకియాట్రిస్ట్‌లు అందుబాటులోనే ఉన్నారని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం అందిస్తారని వివరించారు. ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించిన తరవాత బ్లడ్ టెస్ట్‌తో పాటు ఎక్స్‌రే చేసి రిపోర్ట్ తయారు చేస్తామని తెలిపారు.
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Doctor Narendra Kumar, Assistant Professor, Hospital Administration, AIIMS Rishikesh says, "They don't seem to be under any sort of mental stress. Still, we have teams of psychiatrists and doctors of internal medicine who will do… pic.twitter.com/P3cgJ0wshs
— ANI (@ANI) November 29, 2023
సొరంగంలో (Uttarakashi Tunnel Rescue Successful) చిక్కుకున్న కార్మికులు బయటకు వచ్చిన తరవాత ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ 17 రోజుల పాటు తాము ఎలా గడిపారో వివరించారు. సొరంగం కూలిపోయినప్పుడు ఏమీ అర్థం కాలేదని,చాలా గాబరా పడిపోయామని చెప్పారు. ఆ తరవాత రెస్క్యూ ఆపరేషన్ (Trapped Workers Rescued) మొదలయ్యాక కొంత వరకూ ఆందోళన తగ్గిందని అన్నారు. బయటకు రావడం చాలా ఆనందంగా ఉందని, ఇప్పుడు దీపావళి వేడుకలు చేసుకుంటామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో కార్మికుడూ తన కథను చెప్పాడు. ఇన్ని రోజుల పాటు విశ్రమించకుండా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు థాంక్స్ చెప్పాడు.
Also Read: PM Modi Astronaut: చంద్రుడిపైకి ప్రధాని నరేంద్ర మోదీ? నాసా చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply