Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
Union Cabinet Decisions Highlights | రామ్‌నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దాంతోపాటు చంద్రయాన్ 4 మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపింది.
Union Cabinet gave approval for Chandrayaan 4 Mission | న్యూఢిల్లీ: జమిలీ ఎన్నికల అనంతరం కేంద్ర కేబినెట్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రయాన్ 3తో భారత్ సక్సెస్ సాధించగా.. ఇదే సిరీస్ లో చంద్రయాన్ 4 మిషన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చంద్రయాన్ 3తో భారత్ చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండింగ్ చేసి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు చంద్రయాన్ 4 మిషన్ ద్వారా చంద్రుడి సౌత్ పోల్ మీద నుంచి శాంపిల్స్ సేకరించి భారత్ కు తీసుకురావడం, చందమామ నుంచి చంద్రయాన్ 3 నుంచి అవసరమైన టెక్నాలజీని సైతం తిరిగి తేవాలని కేంద్ర భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. చంద్రుడి మీదకి వెళ్లడంతో పాటు అక్కడి నుంచి భూమికి తిరిగొచ్చేలా టెక్నాలజీని చంద్రయాన్ 4లో అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది.
ఈ చంద్రయాన్-4 ద్వారా 2040 నాటికి చంద్రునిపై ల్యాండింగ్ కావడంతో పాటు అక్కడి నుంచి శాంపిల్స్ సేకరించి, రక్షితంగా తిరిగి భూమికి తిరిగి రావడం టార్గెట్. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం (Indian Space Station) ఏర్పాటు చేసేందుకు కేబినెట్ లో చర్చ జరగింది. దాంతో పాటు చంద్రయాన్ 4 మిషన్ ద్వారా 2040 నాటికి చంద్రునిపై ల్యాండింగ్ అయి, అక్కడినుంచి భూమి మీదకి సురక్షితంగా ల్యాండింగ్ కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దక్షిణ ధృవంపై సురక్షింగా ల్యాండింగ్ అయింది. కొన్ని రోజులపాటు మనకు సిగ్నల్స్ పంపినట్లు ఇస్రో సైంటిస్టులు తెలిపారు. కానీ కొన్నిరోజులకు అక్కడ సూర్యుడు లేకపోవడంతో ల్యాండర్ పనిచేయడం ఆగిపోవడంతో మిషన్ అక్కడితో ఆగిపోయింది. తాజాగా చంద్రయాన్ 4 ద్వారా గత మిషన్ లో చేసిన ప్రయోగాలకు కొనసాగింపుగా.. చంద్రుడి మీద ల్యాండ్ అయి అక్కడి నుంచి ప్రయోగాలకు అవసరమైన శాంపిల్స్ తిరిగి తీసుకువచ్చి సత్తా చాటాలని కేంద్ర మంత్రివర్గం భావిస్తోంది.
It would make everyone proud that Chandrayaan-4 has been cleared by the Cabinet! This would have multiple benefits, including making India even more self-reliant in space technologies, boosting innovation and supporting academia. https://t.co/ZWLMPeRrYh
— Narendra Modi (@narendramodi) September 18, 2024
అంతరిక్ష వాహక నౌకను(Spacecraft) అభివృద్ధి సహా ప్రయోగం బాధ్యతలను ఇస్రో తీసుకుంది. ప్రస్తుతం ఇస్రోలోని పద్ధతుల ద్వారా ప్రాజెక్ట్ సమర్థవంతంగా నిర్వహించాలని, పనులను సైతం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తారు. ఆమోదం పొందిన 36 నెలల్లో మిషన్‌ను పూర్తి చేసే దిశగా అడుగులు పడతాయని కేబినెట్ స్పష్టం చేసింది. స్వదేశీ టెక్నాలజీతో చంద్రయాన్ 4 మిషన్ ను రూపొందించి సక్సెస్ చేయాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా ఎన్నో రంగాల వారికి దీని వల్ల ఉపాధి దొరకడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థకు సైతం దోహదపడుతుందని ప్లాన్ చేశారు.
చంద్రయాన్ 4 ఖర్చు..
చంద్రయాన్-4 మిషన్ కోసం మొత్తం నిధుల రూ. 2104.06 కోట్ల మేర అవసరం. కాగా, చంద్రయాన్ 4 మిషన్ లాంచింగ్ వెహికల్, LVM3 రెండు ప్రయోగ వాహకనౌకల మిషన్లు, స్పెస్ నెట్‌వర్క్ సహకారం, ప్రయోగానికి ముందు చేసే పరీక్షలకు ఖర్చు అవుతుంది. వీటితోపాటు చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్ 4 ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అయి, అక్కడ మనకు కావాల్సిన శాంపిల్స్ సేకరించి భూమికి సురక్షితంగా తిరిగి రావడం మిషన్ ఉద్దేశం. ఈ మిషన్ ద్వారా చంద్రుడి మీదకు మనుషులను పంపి అధ్యయనం కోసం శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది.